PSU vs SFB FD Rates : 5 ఏళ్ల FDలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది? ప్రభుత్వ, ప్రైవేట్, SFB బ్యాంకుల రియల్ వడ్డీ రేట్లు ఇవే

PSU vs SFB FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? పీఎస్‌యూ, ప్రైవేట్, ఎస్‌ఎఫ్‌బీ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? మీరు 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం ఏ బ్యాంకులో రాబడి ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం..

PSU vs SFB FD Rates

PSU vs SFB FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి అద్భుతమైన న్యూస్.. మీరు FD కోసం ఏ బ్యాంకు అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారా? ప్రభుత్వ బ్యాంకులా? ప్రైవేట్ బ్యాంకులా? అని చూస్తున్నారా? వాస్తవానికి, ప్రభుత్వ బ్యాంకుల కన్నా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి తెలుసా?

మీరు ఒకవేళ 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టుబడుల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఎక్కువ వడ్డీ కోరుకునే పెట్టుబడిదారులు కేవలం ప్రభుత్వ బ్యాంకులపైనే కాకుండా ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల్లో డీసీబీ బ్యాంక్ 7.25శాతం వడ్డీ రేటుతో అగ్రస్థానంలో ఉంది.

ఈ వడ్డీ రేటు ప్రకారం.. రూ. లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీకి సుమారు రూ. 1.43 లక్షలు వస్తాయి. ఆ తర్వాత ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా పోటీగా ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి.

తక్కువ రిస్క్‌తో స్థిరమైన ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు పర్‌ఫెక్ట్ అనమాట. ఎందుకంటే.. పెట్టుబడి చేసే సమయంలోనే ఎంత వడ్డీ వస్తుందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో సేఫ్టీతో పాటు ముందుగానే రాబడి ప్లాన్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఎంత మొత్తం రాబడి వస్తుందో పెట్టుబడిదారునికి ముందే తెలుస్తుంది.

Read Also : Flipkart Sale : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా.. 55 అంగుళాల శాంసంగ్ మినీ LED 4K TV కేవలం రూ.40 వేలకే..!

చాలా మంది తమ పోటీదారులతో పోలిస్తే అత్యధిక వడ్డీ రేటును అందించే FDలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. 5 ఏళ్ల FDల విషయానికి వస్తే.. చాలా మంది పెట్టుబడిదారులు PSU బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ, అనేక ప్రైవేట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFB) అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.

పైసాబజార్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా PSU బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, SFB అందించే అత్యధిక 5 ఏళ్ల FD వడ్డీ రేట్లను పోల్చి చూస్తే.. రూ. లక్ష పెట్టుబడికి ఈ FDలలో ప్రతి బ్యాంకు నుంచి అందుకునే మెచ్యూరిటీ మొత్తాన్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది.

ప్రైవేట్ బ్యాంకుల నుంచి 5 ఏళ్ల FD రేట్లు.. రూ. లక్ష పెట్టుబడిపై మెచ్యూరిటీ :
ప్రధాన ప్రైవేట్ బ్యాంకులలో సాధారణ పౌరుల కోసం డీసీబీ బ్యాంక్ 5 ఏళ్ల ఎఫ్‌డీపై అత్యధికంగా 7.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. డీసీబీ బ్యాంక్‌లో 5 ఏళ్ల ఎఫ్‌డీలో రూ. లక్ష పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ నాటికి మీకు సుమారుగా రూ. 1.43 లక్షలు లభిస్తాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.15శాతం వడ్డీ రేటుతో తర్వాతి స్థానంలో ఉండగా, యెస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 6.70శాతం నుంచి 6.75 శాతం మధ్య రేట్లను అందిస్తున్నాయి. మరోవైపు, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ 5 ఏళ్ల ఎఫ్‌డీపై 6.40శాతం అందిస్తుండగా, ఇదే పథకంపై ఐసీఐసీఐ బ్యాంక్ అందించే రేటు 6.50శాతంగా ఉంది. ఐడీబీఐ బ్యాంక్ 5 ఏళ్ల ఎఫ్‌డీకి రేటు 6.25శాతంగా ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 5 ఏళ్ల FD రేట్లు.. రూ. లక్ష పెట్టుబడికి మెచ్యూరిటీ :
ప్రభుత్వ రంగ బ్యాంకులలో, బ్యాంక్ ఆఫ్ బరోడా 5 ఏళ్ల FDపై అత్యధికంగా 6.30శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ FDలో రూ. లక్ష పెట్టుబడి ఐదేళ్లలో సుమారుగా రూ. 1.37 లక్షలకు పెరుగుతుంది. కెనరా బ్యాంక్ 6.25 శాతం రేటును అందిస్తుండగా, ఎస్బీఐ 5 ఏళ్ల FDపై 6.05శాతం వడ్డీని అందిస్తోంది.

SFBల నుంచి అత్యధిక 5 ఏళ్ల FD రేట్లు.. రూ. లక్ష పెట్టుబడిపై మెచ్యూరిటీ :
SFBలలో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 ఏళ్ల FDపై అత్యధికంగా 7.90శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రూ. 1 లక్ష డిపాజిట్ మెచ్యూరిటీ నాటికి దాదాపు రూ. 1.48 లక్షలకు పెరగవచ్చు. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.77శాతం రేటును అందిస్తుండగా, అదే FD కాలపరిమితిపై ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.20శాతం రేటును అందిస్తోంది.