×
Ad

బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌.. అందులో ‘ధురంధర్‌’ మీమ్స్‌ నెక్ట్స్‌ లెవెల్‌

పలు సినిమాల డైలాగులను కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా మార్చి సెటైర్లు వేస్తున్నారు.

Hilarious Memes (Image Credit To Original Source)

  • మధ్యతరగతి ప్రజలకు ఏం దక్కిందని ప్రశ్నలు
  • పన్నుల్లో ఉపశమనం ఇవ్వలేదంటూ మీమ్స్
  • ఎన్నో ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగిలిందని పోస్టులు

Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు పన్నుల్లో ఉపశమనం లభిస్తుందని అనుకుంటే దక్కింది ఏమీ లేదని చాలా మంది నెటిజన్లు అంటున్నారు.

బడ్జెట్‌పై ప్రజల స్పందన ఎలా ఉందన్న విషయాన్ని వారి పోస్టులు తెలుపుతున్నాయి. మధ్య తరగతి ప్రజలు కేంద్ర బడ్జెట్‌పై ఇన్ని ఆశలు పెట్టుకుంటే వారికి ఇచ్చింది ఏమీ లేదని కొందరు అంటున్నారు.

Also Read: Budget 2026: 10 భారీ లాభాలు.. మీలాంటి సామాన్యుడు, రైతులపై నేరుగా ప్రభావం ఎలా ఉంటుందంటే?

పలు సినిమాల డైలాగులను కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా మార్చి సెటైర్లు వేస్తున్నారు. బడ్జెట్‌పై కేంద్ర సర్కారు ఎంతో బిల్డప్‌ ఇచ్చిందని, చివరకు తాము అసంతృప్తికి గురయ్యామని కొందరు నెటిజన్లు అంటున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధురంధర్‌’ ఇమేజ్‌లను వాడుకుని చాలా మంది మీమ్స్‌ సృష్టించారు.