Budget 2026: 10 భారీ లాభాలు.. మీలాంటి సామాన్యుడు, రైతులపై నేరుగా ప్రభావం ఎలా ఉంటుందంటే?
పరిశ్రమల కారిడార్ల సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ల ఏర్పాటు, క్యాంపస్ నుంచే కెరీర్ అవకాశాలను అందింపుచ్చుకోవడం వంటివాటికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు.
Union Budget 2026 (Image Credit To Original Source)
- రైతుల ఆదాయం పెరిగేలా నిర్ణయాలు
- పశుపోషణ, తోటల పంటలకు ప్రోత్సాహం
- ఆరోగ్య రంగంలో ఉద్యోగాలకు ప్రాధాన్యం
Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగాలు, నైపుణ్యాలు, ధరల తగ్గుదల, సమగ్ర వృద్ధి అంశాలపై బడ్జెట్లో దృష్టి పెట్టారు. రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈలు, ప్రయాణికులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత అందరికీ బడ్జెట్- 2026 నేరుగా, పరోక్షంగా ప్రయోజనాలు అందిస్తుంది.
రైతులు, గ్రామీణ కార్మికులకు అధిక ఆదాయం
బడ్జెట్ 2026లో 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. మత్స్యకార రంగం, గ్రామీణుల ఆదాయాలు పెరుగుతాయి. పశుపోషణ, తోటల పంటలకు ప్రోత్సాహం దక్కుతుంది.
కొబ్బరి, జీడిపప్పు, చందనం రైతులకు భారీ ప్రోత్సాహం
కొబ్బరి ప్రోత్సాహక పథకం ద్వారా పాత చెట్లు తొలగించి అధిక దిగుబడి రకాలతో మార్పిడి చేస్తారు. దాదాపు 3 కోట్ల మంది లబ్ధిదారులు, అందులో కోటి మంది రైతులు ఉన్నారు. జీడిపప్పు, కోకోను 2030 నాటికి ప్రపంచ స్థాయి ప్రీమియం బ్రాండ్లుగా మార్చే ప్రత్యేక మిషన్లు చేపడతారు. భారత చందనం వ్యవస్థ పునరుజ్జీవనానికి కృషి చేస్తారు.
ఏఐతో మరింత స్మార్ట్ డిజిటల్ వ్యవసాయం
భారత్ విస్టార్ ప్లాట్‌ఫాం ద్వారా ఏఐతో మల్టీలాంగ్వేజ్ సలహాలు అందుతాయి. దిగుబడులు మెరుగుపరచడం, ప్రమాదాల నిర్వహణ, ఖర్చుల తగ్గింపు సాధ్యమవుతుంది. వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది.
మహిళకు సపోర్ట్
గ్రామీణ మహిళల నేతృత్వంలోని సంస్థల కోసం షీ మార్ట్స్ ప్రారంభిస్తారు. తక్కువ రుణాలు మాత్రమే తీసుకుని వ్యాపారలు చేసే స్థాయి నుంచి సొంతంగా పెట్టుబడి, మార్కెట్ అవకాశాలతో పూర్తి స్థాయి వ్యాపారాలను నిర్వహించేలా మహిళలు ఎదిగే అవకాశం కలుగుతుంది.
Also Read: Union Budget 2026: బడ్జెట్లో ఎవరెవరికి ఎంత? 13 ఫొటోల్లో మొత్తం చూసేయండి..
5 విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌లు
పరిశ్రమల కారిడార్ల సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ల ఏర్పాటు, క్యాంపస్ నుంచే కెరీర్ అవకాశాలను అందింపుచ్చుకోవడం వంటివాటికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా ఉన్నత స్థాయి విద్యా ఉపాధి కమిటీ ఏర్పడుతుంది. విద్య, పరిశ్రమ, నివాస సౌకర్యాలు ఒకే ప్రాంతంలో ఉండే వ్యవస్థను తీసుకొస్తారు.
బాలికల విద్య, పరిశోధన
ప్రతి జిల్లాలో స్టెమ్ (STEM) సంస్థల్లో బాలికల హాస్టళ్ల ఏర్పాటు చేస్తారు. చదువు మధ్యలో మానేసే బాలికల సంఖ్య తగ్గుతుంది. 4 కొత్త లేదా అభివృద్ధి చెందిన టెలిస్కోప్, ఖగోళ భౌతిక శాస్త్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. భారత పరిశోధన వ్యవస్థకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చూస్తారు.
చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం
రూ.10,000 కోట్ల ఎస్ఎంఈ వృద్ధి నిధి
స్వయం సమృద్ధ భారత్ నిధిలో రూ.2,000 కోట్ల పెట్టుబడి
ట్రెడ్స్ ద్వారా రూ.7 లక్షల కోట్ల చెల్లింపులు. ట్రెడ్స్ అంటే చిన్న వ్యాపారాలకు బకాయిలు త్వరగా చెల్లించే డిజిటల్ వేదిక.
టియర్ 2, టియర్ 3 నగరాల్లో కొత్త కార్పొరేట్ విభాగం. రెడ్ టేప్ తగ్గింపు, వేగంగా వృద్ధికి చర్యలు.
ఆరోగ్య రంగ ఉద్యోగాలు
1.5 లక్షల మందికి శిక్షణ
5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు
అత్యవసర, ట్రామా సదుపాయాలతో జిల్లా ఆసుపత్రుల విస్తరణ
ఆరోగ్య సేవల అందుబాటు పెరుగుతుంది. భారీ స్థాయిలో ఉపాధి సృష్టి.
హై స్పీడ్ రైళ్లతో తక్కువ ఖర్చు
ముంబై-పుణె, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి సహా 7 హై స్పీడ్ రైలు మార్గాలు. ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు ఊతం, రోజువారీ ప్రయాణికులు, వ్యాపారాలకు లాభం వస్తుంది.
పర్యాటకం, క్రీడలు, జీవనోపాధిలో..
వైద్య, వారసత్వ పర్యాటకానికి డిజిటల్ మ్యాపింగ్, ఆయా ప్రదేశాల అభివృద్ధి
దివ్యాంగజన కౌశల్ యోజన, దివ్యాంగ సహారా యోజనల ద్వారా సాంకేతిక ఆధారిత ఉపాధి అవకాశాలు
ఖేలో ఇండియా మిషన్ ద్వారా క్రీడా ప్రతిభ, మౌలిక సదుపాయాలు, కోచింగ్ సామర్థ్య విస్తరణ
