Honda City, Amaze offers, discounts in May explained, check here
Honda Car Offers on City, Amaze in May : కారు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా సిటీ (Honda City), అమేజ్ (Amaze) వంటి SUV సెడాన్‌లను విక్రయిస్తున్న హోండా కార్స్ ఇండియా (Honda Cars India) హోండా సిటీ, అమేజ్ వంటి కార్ల మోడళ్లపై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. రాబోయే నెలల్లో తన పోర్ట్‌ఫోలియోకి మూడవ మోడల్ Elevate SUVని కూడా చేర్చనుంది. మేలో హోండా సిటీ కారుపై రూ. 15వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. అందులో రూ. 4వేల కస్టమర్ లాయల్టీ బోనస్, రూ. 6వేల హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.
హోండా సిటీ 1.5-లీటర్ i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 121PS గరిష్ట శక్తిని, 145Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్‌ను 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVTతో రావొచ్చు. అయితే, డీజిల్ ఆప్షన్ లేదు. ఈ ఏడాది ప్రారంభంలో మార్చిలో హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మారుతి సుజుకి సియాజ్‌లకు పోటీగా తేలికపాటి మార్పులతో హోండా సిటీ ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 15.97 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందుబాటులోకి వచ్చింది.
మేలో హోండా అమేజ్‌పై వినియోగదారులు రూ. 17వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 4వేల కస్టమర్ లాయల్టీ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హోండా అమేజ్ 1.2-లీటర్ i-VTEC SOHC పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 90PS శక్తిని, 110Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ MT, CVT ఉన్నాయి. ఈ కారులో కూడా డీజిల్ ఆప్షన్ అందుబాటులో లేదు.
Honda Car Offers, discounts in May explained, check here
హోండా అమేజ్ ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.60 లక్షల (ఎక్స్-షోరూమ్)లో వస్తుంది. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్‌లకు పోటీగా జూన్ 6న హోండా ఎలివేట్‌ను ప్రదర్శించనుంది . పండుగ సీజన్ సమీపంలో ఈ కొత్త SUV కారును ప్రవేశపెట్టనుంది.
కొన్ని హోండా డీలర్‌షిప్‌లు ఇప్పటికే SUV కోసం అనధికారిక బుకింగ్‌లను ప్రారంభించాయి. హోండా ఎలివేట్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ కారు మోడళ్లకు పోటీగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.