Honda QC3 Electric Scooter : వావ్.. ఫ్యామిలీ కోసం హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 151 కి.మీ రేంజ్..!
Honda QC3 Electric Scooter : ఈ QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కనెక్టెడ్ ఫీచర్లతో 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫంక్షన్‌లకు సపోర్టు ఇస్తుంది.
- Sreehari A
- Published on- July 25, 2026 / 11:23 AM IST
Honda QC3 Electric Scooter
- హోండా QC3లో ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ కనెక్టెడ్ టెక్నాలజీ
- 3kWh స్టేబుల్ బ్యాటరీ ప్యాక్, 32 లీటర్ల స్టోరేజ్
- సింగిల్ ఛార్జ్‌పై 150 కిలోమీటర్లకుపైగా IDC రేంజ్
Honda QC3 Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్యామిలీ కస్టమర్ల కోసం మార్కెట్లోకి మరో కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ (HMSI) కంపెనీ సరికొత్త QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ కనెక్టెడ్ టెక్నాలజీ ఉంది.
అయితే, హోండా కంపెనీ మరో 9 టూవీలర్స్ కూడా ఆవిష్కరించింది. ఇందులో ఏడీవీ 160 స్కూటర్, రెబెల్ 300, రెబెల్ 500 క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు, అప్‌డేటెడ్ సీబీ 350 రేంజ్, XR300 డ్యూయల్-పర్పస్ ఆఫ్-రోడ్ మోడల్స్ ఉన్నాయి.
కొత్త QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. బ్యాటరీని సుమారు 2.40 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. నివేదికల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ IDC రేంజ్ సింగిల్ ఛార్జ్‌పై 151 కిలోమీటర్లకుపైగా అందిస్తుంది. QC3లో సీటు కింద సుమారు 32 లీటర్ల స్టోరేజ్ ఉంది.
స్మార్ట్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఇందులో స్మార్ట్ కీ సిస్టమ్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కనెక్టెడ్ ఫీచర్లతో 5-అంగుళాల టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. డిస్‌ప్లేలో వెహికల్ ముఖ్యమైన డేటాను చూడొచ్చు. హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫంక్షన్‌లకు సపోర్టు ఇస్తుంది. అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది.
రోజువారీ వినియోగం, మంచి కంపర్ట్ కోరుకునే వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతంగా ఉంటుంది. హెచ్‌ఎంఎస్‌ఐ యాక్టివా (ఇ) ప్రారంభ ధర రూ. 1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై సుమారుగా 102 కి.మీ. దూసుకెళ్తుంది.
ఇ-స్కూటర్లతో గట్టిపోటీగా :
క్యూసీ1 ప్రారంభ ధర రూ. 90,022 (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై సుమారుగా 80 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ సెగ్మెంట్లో కంపెనీ బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ వారి ఎలక్ట్రిక్ స్కూటర్లతో నేరుగా పోటీపడుతుంది.
యాక్టివా ఎలక్ట్రిక్‌లో ఇరువైపులా టర్న్ ఇండికేటర్లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ బ్యాక్ సైడ్ యాక్టివా ‘e’ని పోలి ఉంటుంది. ఇందులో సీటు కింద రీమూవబుల్ బ్యాటరీ సిస్టమ్ ఉంది.
ఇందులో రెండు 1.5 kWh బ్యాటరీలు ఉంటాయి. స్టాండర్డ్, స్పోర్ట్ ఎకాన్ అనే 3 రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హోండా రోడ్‌సింక్ డ్యూయో అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. తద్వారా రైడర్లు స్మార్ట్‌ఫోన్‌లతో ఈజీగా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ నావిగేషన్ కోసం వాడుకోవచ్చు.
