Google Pixel Watch 5 : సూపర్ వాచ్ గురూ.. కొత్త పిక్సెల్ వాచ్ 5 అదుర్స్.. కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్!
Google Pixel Watch 5 : గూగుల్ పిక్సెల్ వాచ్ 5 అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. 3జీబీ ర్యామ్, క్వాల్కామ్ చిప్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. అవేంటో ఓసారి చూద్దాం..
Google Pixel Watch 5 Specs Leaked
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కొత్త పిక్సెల్ వాచ్ 5
- ఈ స్మార్ట్‌వాచ్‌కు గాడ్రిక్ అనే కోడ్‌నేమ్ ఉంది
- 3GB ర్యామ్, Wi-Fi వేరియంట్, LTE వేరియంట్
Google Pixel Watch 5 : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేవారికి అదిరిపోయే అప్డేట్.. గూగుల్ నుంచి కొత్త పిక్సెల్ వాచ్ 5 వచ్చేస్తోంది. రాబోయే స్మార్ట్‌వాచ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్ వాచ్ చిప్సెట్, ర్యామ్ వివరాలు ముందే లీక్ అయ్యాయి. గూగుల్ పిక్సెల్ వాచ్ సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పిక్సెల్ వాచ్ 5 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
కొత్త అప్డేట్ ప్రకారం.. రాబోయే పిక్సెల్ వాచ్ స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని తెలుస్తోంది. కంపెనీ క్వాల్కామ్ చిప్సెట్తో రానున్నట్టు సమాచారం. ఈ స్మార్ట్‌వాచ్ గాడ్రిక్ అనే కోడ్‌నేమ్‌తో లిస్టు అయింది. ఇందులో క్వాల్కామ్ SW5100 ప్రాసెసర్ ఉంటుంది.
Read Also : Samsung Galaxy F70 Pro : గెట్ రెడీ.. కొత్త శాంసంగ్ ఫోన్ వస్తోందోచ్.. ఈసారి ఫీచర్లు నెక్స్ట్ లెవల్..!
ఈ చిప్‌సెట్‌లో మొత్తం 4 ARM కార్టెక్స్-A53 కోర్లు ఉన్నాయి. ఇందులో అడ్రెనో 702 జీపీయూ ఉండొచ్చు. ఇది వేర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే.. పిక్సెల్ వాచ్ 5లో 3GB ర్యామ్ ఉండొచ్చు.
ఒకటి కాదు.. రెండు వేరియంట్లు :
పిక్సెల్ వాచ్ 5కి సంబంధించి ఇటీవలి లీక్‌లు, డిజైన్‌ను వెల్లడించాయి. డిజైన్ గత మోడల్ పిక్సెల్ వాచ్ మాదిరిగానే ఉంటుందని అంచనా. అయితే, డార్క్ ఆంత్రాసైట్, నాచురల్ సిల్వర్, పైరైట్, వార్మ్ గోల్డ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఉండొచ్చు. డయల్‌లో కర్వ్ గ్లాస్ ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఛార్జింగ్ పిన్స్ కూడా సైడ్ ఉండొచ్చు.
అలాగే, పిక్సెల్ వాచ్ 5 రెండు (41mm, 45mm) వేరియంట్లలో రానుంది. ఇందులో ఒకటి Wi-Fi వేరియంట్ కాగా, మరొకటి LTE వేరియంట్. ఈ జనరేషన్ వాచ్‌లో భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా. ధర సుమారు రూ. 4,500 నుంచి ఉంటుందని అంచనా. ఆగస్టు 12న పిక్సెల్ వాచ్ 5 లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
