×
Ad

Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్‌టర్ అదుర్స్.. జస్ట్ రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఇంటికి తెచ్చుకోండి.. నెలకు EMI ఎంతంటే?

Hyundai Exter : హ్యుందాయ్ సబ్-కాంపాక్ట్ SUV ఎక్స్‌టర్ టాప్ వేరియంట్‌ కొనేందుకు చూస్తున్నారా? ఈ కారు కోసం మీరు ఎంత డౌన్ పేమెంట్‌ కట్టాలి? నెలకు ఈఎంఐ ఎంత చెల్లించాలో చూద్దాం..

  • Published On : January 29, 2026 / 07:31 PM IST

Hyundai Exter Top Model

  • హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొనేవారికి గుడ్ న్యూస్
  • హ్యుందాయ్ సబ్-కాంపాక్ట్ SUV ఎక్స్‌టర్ టాప్ వేరియంట్‌
  • హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రారంభ ధర రూ. 5.73 లక్షల (ఎక్స్-షోరూమ్)
  • ధర రూ. 8.90 లక్షలు, ఈఎంఐ ద్వారా రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్

Hyundai Exter : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మీరు హ్యుందాయ్ లవర్స్ అయితే ఇది మీకోసమే.. హ్యుందాయ్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ తక్కువ పేమెంట్ చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ సబ్-కాంపాక్ట్ SUV మోడల్ ఎక్స్‌టర్ టాప్ వేరింట్ సరసమైన ధరలో కొనేసుకోవచ్చు. ఈ టాప్ వేరియంట్‌ కొనేందుకు కనీసం డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? నెలకు ఎంత ఈఎంఐ పడుతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర ఎంతంటే? :
హ్యుందాయ్ ఎక్స్‌టర్ రూ. 5.73 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి లభ్యమవుతుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ టాప్-స్పెక్ వేరియంట్ రూ. 9.61 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.
మీరు ఢిల్లీలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ టాప్-స్పెక్ వేరియంట్‌ కొనుగోలు చేస్తుంటే.. రిజిస్ట్రేషన్ కోసం సుమారు రూ. 79వేలు, ఇన్సూరెన్స్ కోసం రూ.49వేలు చెల్లించాలి. అన్ని ఇతర ఛార్జీలతో కలిపి టాప్-స్పెక్ వేరియంట్ రూ.10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Best Sedan Cars 2026 : ఫ్యామిలీ కస్టమర్లకు పండగే.. కొత్త కారు కొంటున్నారా? టాప్ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కార్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

హ్యుందాయ్ ఎక్స్‌టర్ కనీస డౌన్ పేమెంట్ :
మీరు హ్యుందాయ్ ఎక్స్‌టర్ టాప్-ఎండ్ వేరియంట్‌ ధర సుమారు రూ. 8.90 లక్షలుగా ఉంటే మీరు ఈఎంఐ ద్వారా కొనుగోలుపై కనీసం రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేయొచ్చు. ఆపై మీరు బ్యాంక్ లోన్ రూ. 6.90 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది.

నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మీరు బ్యాంకు నుంచి 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లకు రూ. 8.90 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెలా రూ. 18,475 ఈఎంఐ చెల్లించాలి. మీరు 5 ఏళ్లలో బ్యాంకుకు మొత్తం రూ. 11.08 లక్షలు చెల్లించాలి. మీరు చెల్లించే వడ్డీ రూ. 2.18 లక్షలు మాత్రమే.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో వస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంది.