రిలయన్స్ AGM లో సంచలనాలు.. జియో హాట్ స్టార్ లో అదిరిపోయే ఫీచర్లు.. వింటేనే వావ్.. ఇక చూస్తే మైండ్ బ్లాంక్

మొబైల్ డివైజ్‌ల కోసం రూపొందించిన క్రికెట్ ఇంటర్‌ఫేస్ మాక్స్‌వ్యూ 3.0. దీనితో రియల్‌టైమ్ ఫీచర్లను స్ట్రీమ్ ఆపకుండా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

JioHotstar AI

JioHotstar AI: ఓటీటీ వేదికలు అన్నీ పర్సనలైజ్‌ కంటెంట్‌ కోసం పోటీపడుతున్న వేళ జియోహాట్‌స్టార్ కంటెంట్‌ మాత్రమే కాకుండా, కంటెంట్‌ని ఎలా వెతుకుతాం? ఎలా వింటాం? అన్న దానిపై కూడా దృష్టి పెడుతోంది. కంటెంట్ సెర్చ్‌ విషయంలో యూజర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వడానికి కృత్రిమ మేధస్సు(ఏఐ)పై మరింత ఆధారపడుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ దీనిపై కొత్త అప్‌గ్రేడ్స్‌ను ప్రకటించారు. “మొబైల్, టీవీ, కనెక్టెడ్ పరికరాలపై ఒక బిలియన్ స్క్రీన్లను చేరుకోవడమే లక్ష్యంగా, దీన్ని లోకలైజ్డ్‌ ఏఐ బేస్డ్‌ సర్వీస్‌గా మలుస్తున్నట్లు తెలిపారు.

600 మిలియన్ల మందికి పైగా వినియోగదారులు, 300 మిలియన్ల పేయింగ్‌ సబ్‌స్క్రైబర్లతో జియోహాట్‌స్టార్ ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్‌గా ఉంది.

ఇప్పుడు మరింత మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోసం నాలుగు ప్రధాన సాంకేతిక ఫీచర్లను అందిస్తోంది.

Also Read: ప్రపంచవ్యాప్తంగా ఏఐ బూమ్‌ మధ్య “రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌” లాంచ్.. అంటే ఏంటి? ఫుల్ డీటెయిల్స్‌.. మెటా, గూగుల్‌తోనూ భాగస్వామ్యం..

అవే.. రియా, వాయిస్ ప్రింట్, జియోలెన్జ్, మాక్స్‌వ్యూ 3.0. ఇవి ఎలా పనిచేస్తాయంటే?

రియా: వాయిస్ అసిస్టెంట్

ఏమి చేస్తుంది?: రియా అనేది వాయిస్ ఆధారిత కృత్రిమ మేధ అసిస్టెంట్. దీనితో టైపింగ్, ట్యాపింగ్, స్క్రోలింగ్ లేకుండా మాట్లాడటం ద్వారా కంటెంట్ వెతుక్కోవచ్చు.

ఎలా పనిచేస్తుంది?: రియా సహజ భాషా ప్రాసెసింగ్, సేమాంటిక్ సెర్చ్ మోడల్స్ వాడి సంభాషణ శైలిలో చెప్పిన వాయిస్ ఇన్‌పుట్స్‌ను అర్థం చేసుకుంటుంది. కచ్చితమైన టైటిల్ లేదా కీవర్డ్‌ల అవసరం లేకుండా ఉద్దేశం, సందర్భాన్ని గ్రహిస్తుంది. “కోహ్లీ చివరి సెంచరీ చూపించు” లేదా “రైలు సీన్ ఉన్న ఎపిసోడ్ ప్లే చేయి” అని చెప్పినా అర్థం చేసుకుని సెర్చ్‌ చేస్తుంది.

“ఏం కావాలో చెప్పండి… రియా మీకోసం క్యూయరేట్ చేస్తుంది. ఇక స్క్రోల్ అవసరం లేదు. సెర్చ్ అవసరం లేదు” అని ఆకాశ్ అన్నారు.

వాయిస్ ప్రింట్: మీ ఇష్టమైన స్టార్ల సినిమాలు ఇప్పుడు మీ భాషలో

ఏమి చేస్తుంది?: వాయిస్ ప్రింట్ కృత్రిమ మేధస్సు ఆధారిత వాయిస్ క్లోనింగ్, రియల్‌టైమ్ లిప్ సింక్ వాడి ఓటీటీ కంటెంట్‌ను స్థానిక భాషలో చూడటానికి సహాయపడుతుంది. నటుడు అసలు గొంతు, హావభావాలను అలాగే ఉంచుతుంది.

ఎలా పనిచేస్తుంది?: నటుడి అసలు గొంతుతో శిక్షణ పొందిన కృత్రిమ మేధస్సు మోడల్స్ వాడి ఏ భారతీయ భాషలోనైనా సింథటిక్ స్పీచ్ రూపొందిస్తాయి. దీన్ని రియల్‌టైమ్ లిప్‌సింక్ టెక్నాలజీతో కలిపి నటుడి పెదవుల కదలికలు కూడా అనువాద ఆడియోకి సరిపోలేలా మార్చుతాయి.

మన ప్రస్తుతం చూస్తున్న డబ్బింగ్‌ సినిమాల్లో వేరే వాయిస్ ఆర్టిస్ట్ గొంతు వాడడం వల్ల ఆ యాక్టర్ల పెదవుల కదలికలు వాయిస్‌తో సింక్ కాకుండా కనిపిస్తాయి. కానీ, వాయిస్ ప్రింట్ నటుడి గొంతు, నిజమైన హావభావాలను అలాగే ఉంచుతుంది.

“కృత్రిమ మేధస్సు వాయిస్ క్లోనింగ్, లిప్‌సింక్ శక్తితో మీ ఇష్టమైన తారల వాయిస్ కేవలం డబ్ కావడమే కాదు.. మీ భాషలో, నటుడి గొంతుతో, పర్ఫెక్ట్ లిప్‌సింక్‌తో సీన్లు ప్లే అవుతాయి” అని అంబానీ అన్నారు.

జియోలెన్జ్: కస్టమ్ వ్యూస్, అడాప్టివ్ ఇంటర్‌ఫేస్‌లు

ఏమి చేస్తుంది?: జియోలెన్జ్ అనేది విజువల్ పర్సనలైజేషన్ ఫీచర్. దీనితో ఒక్క క్లిక్‌లో స్క్రీన్‌పై కంటెంట్ ఎలా కనిపించాలో నియంత్రించవచ్చు.

ఎలా పనిచేస్తుంది?: జియోలెన్జ్ వినియోగదారుల అభిరుచులను గుర్తించి స్క్రీన్ లేఅవుట్‌ను మార్చుతుంది. మ్యాచ్‌ని స్కోర్ ఓవర్లేతో చూడాలా, మధ్యలోనే భాష మార్చాలా, కామెంటరీ ట్రాక్స్‌ని పాప్‌అవుట్‌గా చూడాలా? వంటి వాటిని డైనమిక్‌గా చేస్తుంది.

మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ ఏ పరికరంలో చూసినా ఇంటర్‌ఫేస్ అలానే సరిపోతుంది. స్క్రీన్ వదిలి వెళ్లకుండానే కంటెంట్ మాడ్యూల్స్ మధ్య టాగుల్ చేయవచ్చు.

“జియోలెన్జ్‌తో మీరు మీ అభిరుచికి తగిన అనేక వ్యూయింగ్ ఆప్షన్లను ఒక క్లిక్‌తో సెర్చ్‌ చేయొచ్చు. మీ కంటెంట్, మీ స్క్రీన్, మీరు కోరుకున్న విధంగా ఉంటుంది” అని అంబానీ అన్నారు.

మాక్స్‌వ్యూ 3.0: మీ మొబైల్ గ్రిప్‌కే సరిపోయే క్రికెట్ ఎక్స్‌పీరియన్స్‌

ఏమి చేస్తుంది?: మొబైల్ డివైజ్‌ల కోసం రూపొందించిన క్రికెట్ ఇంటర్‌ఫేస్ మాక్స్‌వ్యూ 3.0. దీనితో రియల్‌టైమ్ ఫీచర్లను స్ట్రీమ్ ఆపకుండా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

ఎలా పనిచేస్తుంది?: మాక్స్‌వ్యూ 3.0 వినియోగదారులు సహజంగా ఫోన్ పట్టుకునే విధానానికి అనుగుణంగా లైవ్ స్కోర్‌ కార్డులు, కెమెరా యాంగిల్ మార్పులు, ఇన్‌స్టంట్ హైలైట్స్‌ని అమర్చుతుంది. అన్నీ స్వైప్‌తో ఒకే స్క్రీన్‌లో వస్తాయి.

వీడియో విండో వదిలి వెళ్లాల్సిన అవసరం ఉండదు. బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఇతర యాంగిల్స్, హైలైట్ క్లిప్స్ ముందుగానే లోడ్ అవుతాయి.

“ఈ క్రికెట్ ఎక్స్‌పీరియన్స్‌ను మీరు సహజంగా ఫోన్ పట్టుకునే విధానానికే అనుగుణంగా రూపొందించాం” అని అంబానీ వివరించారు.