Atal Pension Yojana
Atal Pension Yojana : ప్రస్తుత రోజుల్లో అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక అద్భుతమైన పథకాలను అందిస్తోంది. అందులో ఒకటి అటల్ పెన్షన్ పథకం.. ఈ పథకంలో ఆర్థికంగా వెనుకబడినవారికి ఆర్థిక భరోసా ఇవ్వడమే లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ అటల్ పెన్షన్ పథకాన్ని అందిస్తోంది. ఈ అటల్ పెన్షన్ యోజన (APY) పథకంలో చేరితో ప్రతి నెలా మీరు రూ. 210 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 5వేల గ్యారెంటెడ్ పెన్షన్ పొందవచ్చు. ఇప్పటివరకూ ఈ పథకంలో 86.6 మిలియన్లకు పైగా చేరారు.
వార్షిక బడ్జెట్ 2026కు ముందు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2030-31 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ పథకం పొడిగింపునకు ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో తక్కువ ఆదాయ వర్గాలు, అసంఘటిత రంగంలోని కార్మికులు, వృద్ధాప్య ఆదాయ భద్రతను అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకంలో చేరిన లబ్ధిదారులు 60ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ. 1000 నుంచి రూ. 5వేల వరకు గ్యారెంటీతో పెన్షన్ పొందవచ్చు.
అటల్ పెన్షన్ యోజన ఏంటి? :
అటల్ పెన్షన్ యోజన (APY) అనేది కేంద్ర ప్రభుత్వం అందించే పెన్షన్ పథకం. ఈ పథకం కింద, లబ్ధిదారులు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందుతారు. ఈ పథకం ప్రత్యేకంగా రిటైర్మెంట్ అయిన వారికి వర్తిస్తుంది.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, వ్యక్తులు రిటైర్మెంట్ సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు 40 ఏళ్లు మించకూడదు.
ఈ పథకానికి అర్హతలేంటి? :
ఎలా దరఖాస్తు చేయాలి? :
పథకం ప్రయోజనాలేంటి? ఏయే డాక్యుమెంట్లు అవసరం :
మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఉండాలి. ఆ తర్వాత, 60 ఏళ్ల తర్వాత మీకు ఎంత పెన్షన్ కావాలో ఎంచుకోండి. రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ. 4,000 లేదా రూ. 5,000 ఇలా ఏదో ఒకటి ఎంచుకోండి. మీరు పథకంలో ఎంత ముందుగా చేరితే ప్రతి నెలా అంత తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి కాలం కనీసం 20 ఏళ్లు ఉంటుంది.
ఉదాహరణకు.. మీరు 18 ఏళ్ల వయస్సులో చేరి రూ. 5,000 నెలవారీ పెన్షన్ ఎంచుకుంటే.. మీరు నెలకు రూ. 210 మాత్రమే చెల్లించాలి. మీకు రూ. 2,000 పెన్షన్ కావాలంటే.. నెలకు రూ. 84 మాత్రమే అవసరం. రూ. 1,000 పెన్షన్ కోసం మీకు రూ. 42 మాత్రమే అవసరం. ఈ పథకం కోసం మీ డబ్బు బ్యాంకు నుంచి ఆటో-డెబిట్ అవుతుంది.