Gold Jewellery Purity : మీ బంగారు ఆభరణాల స్వచ్ఛతను BIS యాప్‌తో ఎలా చెక్ చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్ ప్రాసెస్..!

Gold Jewellery Purity : బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్‌ను చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారం లేదా నకిలీ బంగారం ఉండొచ్చు. BIS యాప్‌ ద్వారా ఈజీగా చెక్ చేయొచ్చు.

Gold Jewellery Purity : మీ బంగారు ఆభరణాల స్వచ్ఛతను BIS యాప్‌తో ఎలా చెక్ చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్ ప్రాసెస్..!

Gold Jewellery Purity

Updated On : April 29, 2025 / 6:22 PM IST

Gold Jewellery Purity : బంగారం కొంటున్నారా? మీరు కొనే బంగారు ఆభరణాలు నిజమైనవేనా? సాధారణంగా భారత మార్కెట్లో విక్రయించే అన్ని బంగారు ఆభరణాలకు 6 అంకెల హాల్‌మార్క్ (HUID) యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అనేది బంగారు ఆభరణాలకు హాల్ మార్క్‌లను అందించే ఒక ప్రభుత్వ సంస్థ. అయితే, బంగారు ఆభరణాలపై ఉన్న హాల్‌మార్క్.. నిజమైన హాల్ మార్క్ లేదా అనేది వినియోగదారులు ఈజీగా తెలుసుకోవచ్చు.

Read Also : BoB Savings Scheme : బ్యాంక్ ఆఫ్ బరోడాలో అద్భుతమైన స్కీమ్.. ఈ బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేస్తే చాలు.. రూ. 16,022 వడ్డీ పొందొచ్చు..!

ప్రస్తుతం (BIS) ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ యాప్ (BIS Care) అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ సాయంతో మీ బంగారంపై ఉన్న HUID నంబర్ అసలైనదో కాదో తెలుసుకోవచ్చు. ఈ హాల్ మార్క్ నెంబర్ యాప్‌‌లో ఎంటర్ చేయాలి. ఆపై యాప్ వెంటనే స్కాన్ చేసి అది ఒరిజినల్ లేదా ఫేక్ అనేది క్షణాల వ్యవధిలోనే చెప్పేస్తుంది.

ఆభరణాలపై హాల్‌మార్క్ ఎందుకంటే? :
బంగారు ఆభరణాలు చాలా ఖరీదైనవి. అందుకే స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనాలి. అందుకే ప్రభుత్వం గత రెండు ఏళ్ల క్రితమే బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసింది. బంగారం, వెండిని హాల్‌మార్కింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. హాల్‌మార్క్‌లు బంగారం స్వచ్ఛతను తెలియజేసే అధికారిక సింబల్స్. హాల్‌మార్కింగ్ స్కీమ్ అనేది బంగారం కల్తీ కాకుండా చూడొచ్చు.

BIS యాప్ బంగారం స్వచ్ఛతను చెకింగ్ ఎలా? : 

  • ఆభరణంపై ఉన్న హాల్‌మార్క్‌ను గుర్తించండి.
  • హాల్‌మార్క్‌లో వాడిన బంగారం అధికారిక నిష్పత్తి ఉంటుంది.
  • హాల్‌మార్కింగ్ చెకింగ్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి BIS CARE అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
  • మీ పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • యాప్ స్టోర్: https://apps.apple.com/in/app/bis-care-app/id6443724891
  • ప్లే స్టోర్: https://play.google.com/store/apps/details id=com.bis.bisapp&hl=en_IN

BIS యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే? :

  • BIS యాప్ డౌన్‌లోడ్ తర్వాత ఓపెన్ చేసి “Verify HUD” ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత బంగారు ఆభరణాలపై ఫ్రింట్ చేసిన HUD నంబర్‌ను టైప్ చేయండి.
  • ఆభరణాల వ్యాపారి రిజిస్ట్రేషన్ నంబర్, అస్సేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్, AHC రిజిస్ట్రేషన్ నంబర్, AHC అడ్రస్, ఆర్టికల్ టైప్, హాల్‌మార్కింగ్ తేదీ, స్వచ్ఛతతో సహా బంగారు ఆభరణాల అన్ని HUD వివరాలను చూడొచ్చు.

బంగారు ఆభరణాలపై ఉన్న HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబర్ బంగారు ఆభరణాలపై కనిపించే 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఆభరణాలపై చిన్నగా కనిపిస్తుంది. సాధారణంగా BIS లోగో, స్వచ్ఛత గ్రేడ్ వంటి ఇతర హాల్‌మార్క్ సింబల్స్ దగ్గర ఉంటుంది.

Read Also : D2M Technology : భారత్‌కు D2M స్మార్ట్‌ఫోన్లు.. ఇంటర్నెట్ లేకుండానే మీ మొబైల్‌లో లైవ్ టీవీ చూడొచ్చు.. డైరెక్ట్-టు-మొబైల్ ఏంటి? ఎలా పనిచేస్తుంది?

BIS యాప్ బెనిఫిట్స్, ఫీచర్లు :

  • గూగుల్ ప్లే స్టోర్‌ అధికారిక BIS యాప్ ప్రకారం.. BIS యాప్‌ను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
  • మీరు యాప్ ‘Complaints’ ఫీచర్‌ని ఉపయోగించి మీ ఫిర్యాదులను లేదా ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు.
  • BIS యాప్ ఏదైనా వస్తువు లేదా ఉత్పత్తిపై ISI, హాల్‌మార్క్, CRS రిజిస్ట్రేషన్ మార్కింగ్‌ అథెంటికేషన్ చెక్ చేయొచ్చు.
  • యూజర్ రిజిస్ట్రేషన్ లేదా OTP ఆధారిత లాగిన్ ద్వారా మీరు రిజిస్టర్ చేసే కంప్లయింట్ టైప్ ఎంచుకోండి.
  • ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలతో ఫారమ్‌ నింపి ఆపై సమర్పించండి.
  • తయారీదారు పేరు, చిరునామా, లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వంటి అన్ని వివరాలను సమర్పించాలి.
  • బంగారంపై లైసెన్స్ నంబర్/HUID నంబర్/రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్‌కు వచ్చే కంప్లయింట్ నంబర్, మీ ఫిర్యాదు రసీదును పొందండి.
  • వస్తువుల ప్రామాణికత, లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌, హాల్‌మార్క్‌ అన్నింటినీ ధృవీకరించవచ్చు.
  • వస్తువుల లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా హాల్‌మార్క్ నంబర్ తప్పుగా ఉంటే.. క్లయింట్ వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.
  • ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన, హాల్‌మార్క్ ఉల్లంఘన గురించి ISI ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు.
  • మీరు రిజిస్ట్రేషన్ మార్కులు, మోసపూరిత ప్రకటనలు, ఇతర BIS-సంబంధిత సమస్యలకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
  • యాప్‌ని ఉపయోగించి వెంటనే ఫిర్యాదు ఎలా చేయాలో కస్టమర్‌కు సమాచారం అందుతుంది.