BHIM CIBIL Score : సూపర్ గుడ్ న్యూస్.. ఇకపై BHIM యాప్‌తో మీ క్రెడిట్ రిపోర్ట్ ఫ్రీగా చెక్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
BHIM CIBIL Score : భీమా యాప్ ద్వారా పేమెంట్లు మాత్రమే కాదు.. సిబిల్ స్కోరు.. మీ క్రెడిట్ స్కోరు కూడా ఈజీగా చెక్ చేయొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ స్టెప్స్ మీకోసం..
- Sreehari A
- Published on- April 25, 2026 / 04:37 PM IST
BHIM CIBIL Score
- భీమ్ యాప్ వాడుతున్నారా? సిబిల్ స్కోరు చూడటం ఈజీ
- ఈ యాప్ ద్వారా పేమెంట్లు మాత్రమే కాదు.. ఫ్రీ క్రెడిట్ స్కోరు ఆప్షన్
- క్రెడిట్ స్కోరు పూర్తిగా ఉచితంగా ఇలా తెలుసుకోవచ్చు.
BHIM CIBIL Score : భీమ్ యాప్ యూజర్లకు బిగ్ న్యూస్.. ఇప్పుడు, మీరు BHIM యాప్ ద్వారా డబ్బు పంపడమే కాదు.. మీ CIBIL స్కోర్‌ను కూడా ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. NPCI సిబిల్ అందిస్తున్న ఈ కొత్త ఫీచర్ లక్షలాది మందికి ఎన్నో బెనిఫిట్స్ అందిస్తోంది. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా తెలుసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
ఇప్పుడు మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేసేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకోసం పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. భీమ్ యాప్‌ను ఉపయోగించే వారికి అద్భుతమైన న్యూస్.. మీరు ఇప్పుడు యాప్ ద్వారానే మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను పూర్తిగా ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్‌పీసీఐ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
ఫైనాన్షియల్ ప్లానింగ్ బెటర్ :
భీమ్ యాప్ ఇకపై కేవలం డబ్బు పంపడం, స్వీకరించడమే కాదు. ఈ యాప్‌లో ఇప్పటికే ఖర్చులను ట్రాక్ చేయడం, ఫ్యామిలీ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కానీ, ఇప్పుడు క్రెడిట్ స్కోర్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేసుకోవచ్చు. లోన్లు పొందడం కూడా చాలా ఈజీగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.
Read Also : Auto Payment Setup : మీ బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్ ఆన్ చేసారా? ఇవి తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు!
మీ అనుమతి లేకుండా డేటా కనిపించదు
ఈ ఫీచర్ పూర్తిగా సురక్షితమైనది. మీరు యాప్‌ను ఆమోదిస్తేనే మీ స్కోర్ కనిపిస్తుందని దయచేసి గమనించండి. డేటా భద్రతకు సంబంధించిన అన్ని ప్రభుత్వ నిబంధనలు పాటించబడ్డాయి. ప్రజలు తమ దైనందిన జీవితంలో సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలిగేలా వారిలో అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.
ఇలా సిబిల్ స్కోర్ చెక్ చేయండి :
- మీ CIBIL స్కోర్‌ను చెక్ చేసేందుకు ఈ 3 పనులను చేస్తే సరిపోతుంది.
- BHIM యాప్‌ను ఓపెన్ చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు వెళ్లి ఫ్రీ సిబిల్ స్కోర్‌ను ఎంచుకోండి.
- మీ పాన్ కార్డ్ నంబర్, మీ పేరును ఎంటర్ చేసి ఆపై నిబంధనలను అంగీకరించి Proceed ఆప్షన్ ఎంచుకోండి.
- మీ సిబిల్ స్కోరు వెంటనే మీ మొబైల్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
