×
Ad

Car Resale Value : మీ పాత కారు అమ్మే ముందు ఇది చేస్తే వేలల్లో కాదు.. లక్షల్లో లాభం.. డీలర్లు కూడా చెప్పని సీక్రెట్!

Car Resale Value : మీ పాత కారు అమ్ముతున్నారా? మీరు ఈ చిన్నపాటి తప్పులను సరిచేయడం ద్వారా రీసేల్ వాల్యూ పెరుగుతుంది. తద్వారా కొన్న ధరకే కారు అమ్ముకోవచ్చు..

Car Resale Value (Image Credit To Original Source)

  • రెగ్యులర్ సర్వీసింగ్ మిస్ చేయొద్దు
  • అనవసర మోడిఫికేషన్స్ చేయొద్దు 
  • యాక్సిడెంట్ హిస్టరీ కొనుగోలుదారుల వద్ద దాచొద్దు
  • సర్వీసు రికార్డులను మెయింటైన్ చేయాలి
  • కారు చాలా క్లీన్ అండ్ పాలిష్ చేయించండి

Car Resale Value : కొత్త కారు కొన్నారా? మీ పాత కారు అమ్మాలని చూస్తున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.. చాలామంది పాత కారును అమ్మేటప్పుడు దాని కండిషన్ విషయంలో పెద్దగా పట్టించుకోరు. మీ కారు కండిషన్ బట్టి రీసేల్ వాల్యూ ఉంటుంది.

సాధారణంగా కారు వాల్యూ అనేది వాడిన కొద్ది తగ్గుతూ వస్తుంది. మీ కారులో బయటకు కనిపించే చిన్న సమస్యలు కూడా వాల్యూను తగ్గిస్తాయి. పాత కారును కొనేవాళ్లు ఎక్కువగా ఆ కారు కండిషన్ ఎలా ఉంది? కొనాలా? వద్దా అనేది చూస్తారు.

మీ కారు సరిగా లేకుంటే కొనేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా తక్కువ ధరకే అడుగుతారు. అప్పుడు మీరు అనుకున్నంతగా ధర పలకదు. మీ పాత కారు పట్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పడే మీ కారు రీసేల్ వాల్యూ పెరుగుతుంది. ఇంతకీ మీ కారు రీసేల్ వాల్యూ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Car Resale Value (Image Credit To Original Source)

కారు పాలిష్ చేయించండి :
మీ కారును అమ్మే ముందు బాగా కడిగి పాలిష్ చేయించండి. కారు లోపల బయట క్లీన్‌గా కనిపించాలి. కొత్త కారులా మెరిస్తే వాల్యూ కూడా అంతే పెరుగుతుంది. అలాగే, కారు సర్వీస్‌పై తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మీ కారుకు ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే రిపేర్ చేయించండి.

Read Also : Volkswagen Taigun Prices : కొత్త కారు కొంటున్నారా? వోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు తగ్గాయోచ్.. ఈ వేరియంట్ల ధరలు పెరిగాయి.. ఫుల్ డిటెయిల్స్!

సర్వీసు రికార్డులను ఉంచుకోండి :
మీ కారు పూర్తి సర్వీస్ హిస్టరీని దగ్గర ఉంచుకోండి. క్లియర్ సర్వీస్ హిస్టరీ అనేది మీ కారు వాల్యూ 10 శాతం నుంచి 12 శాతం పెరుగుతుంది. మీ కారుకు సంబంధించి డిజిటల్ రికార్డులను ప్రింట్ తీసుకోండి. రిపేరింగ్ బిల్లులను కూడా జాగ్రత్తగా ఉంచుకోండి.

చిన్న సమస్యలన్నా రిపేర్ చేయండి :
పగిలిన క్యాబిన్ లైట్లు, అరిగిపోయిన వైపర్లు లేదా సౌండ్ చేసే డోర్స్ వంటి చిన్న సమస్యలను వెంటనే రిపేర్ చేయించండి.

క్యాబిన్ క్లీన్ చేయండి :
మీ క్యాబిన్‌లో ఏదైనా దుర్వాసన వస్తుంటే.. వెంటనే క్లీన్ చేయండి. మీ కారులో మంచి సువాసన వచ్చేలా యాక్టివేటెడ్ చార్‌కోల్ బ్యాగులు లేదా ఓజోన్ ట్రీట్‌మెంట్ వాడండి.