Hyundai Exter _ Price, variants, mileage, features, other details you should know
Hyundai Exter : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ఇటీవల భారత మార్కెట్లో అత్యంత సరసమైన SUV ఎక్స్‌టర్‌ను రిలీజ్ చేసింది. ఎక్స్‌టర్ కార్‌మేకర్ SUV పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసింది. ఇందులో వెన్యూ, క్రెటా, అల్కాజార్, టక్సన్ వంటి ప్రముఖ మోడల్‌లు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ ఎంట్రీ-లెవల్ SUV, ఫీచర్-లోడెడ్ అయినందున ఎక్స్‌టర్ నుంచి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ SUV కొనేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర ఎంతంటే? :
హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV కారు ధర రూ. 6 లక్షలతో మొదలై రూ. 10.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. Venue మోడల్ కారు ధర రూ. 7.77 లక్షల నుంచి రూ. 13.18 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ వేరియంట్లు ఇవే :
హ్యుందాయ్ (Exter) కారు 7 వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో EX, EX(O), S, S(O), SX, SX(O), SX(O) Connect వరుసగా ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజన్, ట్రాన్స్‌మిషన్ :
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2-లీటర్, కప్పా (Kappa) పెట్రోల్ ఇంజన్ ఉంది. 83PS, 113.8Nm అందిస్తుంది. 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTకి అందిస్తుంది. CNG ఆప్షన్ కూడా ఉంది. 69PS, 95.2Nm లను రిలీజ్ చేస్తుంది. అయితే, 5-స్పీడ్ MTతో మాత్రమే పెయిర్ చేయవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైలేజ్ :
హ్యుందాయ్ (Exter) పెట్రోల్ MT మోడల్ 19.4kmpl, పెట్రోల్ AMTకి 19.2kmpl, CNG MTకి 27.1km/kg మైలేజీని అందిస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ వేరియంట్ వారీగా ధరలివే :
వేరియంట్‌ల వారీగా ఎక్స్‌టర్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ క్రింద విధంగా ఉన్నాయి..
ఎక్స్‌టర్ 1.2 పెట్రోల్ (Exter 1.2 petrol) :
* EX MT – రూ. 6 లక్షలు
* EX(O) MT – రూ. 6.25 లక్షలు
* S MT – రూ. 7.27 లక్షలు
* S(O) MT – రూ. 7.42 లక్షలు
* S AMT – రూ 7.97 లక్షలు
* SX MT – రూ. 8 లక్షలు
* SX MT డ్యూయల్ టోన్ – రూ. 8.23 లక్షలు
* SX(O) MT – రూ. 8.64 లక్షలు
* SX AMT – రూ. 8.68 లక్షలు
* SX AMT డ్యూయల్ టోన్ – రూ. 8.91 లక్షలు
* SX(O) Connect MT – రూ. 9.32 లక్షలు
* SX(O) AMT – రూ. 9.32 లక్షలు
* SX(O) కనెక్ట్ MT డ్యూయల్ టోన్ – రూ. 9.42 లక్షలు
* SX(O) కనెక్ట్ AMT – రూ. 10 లక్షలు
* SX(O) కనెక్ట్ AMT డ్యూయల్ టోన్ – రూ. 10.10 లక్షలు
* ఎక్స్‌టర్ 1.2 CNG
* S MT – రూ. 8.24 లక్షలు
* SX MT – రూ. 8.97 లక్షలు
Hyundai Exter _ Price, variants, mileage, features, other details you should know
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫీచర్లు :
ఎక్స్‌టర్‌లో పారామెట్రిక్ గ్రిల్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ H-LED టెయిల్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ H-LED DRLలు, ఫ్రంట్, బ్యాక్ స్కిడ్ ప్లేట్లు, 15-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 8-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.2-అంగుళాల కలర్ TFT MIDతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వెనుక AC వెంట్‌లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెథెరెట్ అప్‌హోల్‌స్టరీ, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, మెటల్ లైట్ నాబ్, గేర్ లైట్ నాబ్ వంటి ఇన్-క్యాబిన్ ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యుయల్ కెమెరాతో కూడిన డాష్‌క్యామ్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు కాకుండా ఎక్స్‌టర్‌లో అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్ కూడా ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ vs టాటా పంచ్ :
భారత మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రధాన ప్రత్యర్థి టాటా పంచ్. టాటా పంచ్ ధర రూ. 6 లక్షలతో మొదలై రూ. 9.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Read Also : Oppo Reno 10 5G Price : ఒప్పో రెనో 10 5G ధర ఎంతో తెలిసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. రూ.3 వేలు డిస్కౌంట్..!