Oppo Reno 10 5G Price : ఒప్పో రెనో 10 5G ధర ఎంతో తెలిసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. రూ.3 వేలు డిస్కౌంట్..!
Oppo Reno 10 5G Price : ఒప్పో కంపెనీ లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ సందర్భంగా (Oppo Reno 10 5G) ధరను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 32,999 నుంచి అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Oppo Reno 10 5G India price officially revealed, check out specs and other details
Oppo Reno 10 5G Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో (Oppo) నుంచి జూలై ప్రారంభంలో కొత్త సిరీస్‌ను ఆవిష్కరించిన తర్వాత లేటెస్ట్ రెనో 10 స్మార్ట్‌ఫోన్ అధికారిక ధరను ఎట్టకేలకు ప్రకటించింది. కంపెనీ ఇప్పుడు 3 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఒప్పో రెనో 10 5G, రెనో 10 ప్రో 5G, రెనో 10 ప్రో ప్లస్ 5G, ఒప్పో రెనో 10 ప్రో వేరియంట్‌లు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ ఇంకా మార్కెట్లోకి రాలేదని గమనించాలి.
ఒప్పో లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ సందర్భంగా (Oppo Reno 10 5G) ధరను ఆవిష్కరించింది. భారత మార్కెట్లో ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 32,999గా నిర్ణయించింది. అయితే, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కస్టమర్‌లు రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ధరను రూ.29,999కి తగ్గించింది.
Read Also : Oppo K11 5G Launch Date : ఒప్పో K11 5G ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర, కీలక ఫీచర్లు లీక్..!
ఈ ధర పరిధిలో అనేక బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 40 యూజర్లకు అద్భుతమైన ఆప్షన్లలో ఒకటిగా ఉంది. (iQOO Neo 7) స్మార్ట్‌ఫోన్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 30వేల లోపు ఉంటుంది. అదనంగా, ఒప్పో రెనో 10 5G ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. రాబోయే ఈ డివైజ్ ఐస్ బ్లూ, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. కొత్త ఒప్పో ఫోన్ ఎప్పుడు అమ్మకానికి వెళ్తుంది? ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందో లేదో ప్రస్తుతానికి తెలియదు.

Oppo Reno 10 5G India price officially revealed, check out specs and other details
ఒప్పో రెనో 10 5Gతో పాటుగా, ఒప్పో రెనో 10ప్రో 5G, రెనో 10ప్రో ప్లస్ 5Gలను జూలై 10న లాంచ్ చేసింది. ఒప్పో రెనో 10 ప్రో భారత మార్కెట్లో ధర రూ. 39,999గా ఉంది. రెనో 10 Pro+ 5G ఫోన్ రూ. 4,999కి విక్రయిస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, 2 మోడల్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిద్దాం.
ఒప్పో రెనో 10 5G ఫీచర్లు :
ఒప్పో రెనో 10 5G ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టుతో భారీ 6.7-అంగుళాల ఫుల్-HD+ OLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో ఆధారితమైంది. 8GB RAM ద్వారా సపోర్టు ఇస్తుంది. గూగుల్ ఇంకా ఆండ్రాయిడ్ 14OS మార్కెట్‌లో రిలీజ్ చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13OSతో వస్తుంది. ఫోటోగ్రఫీ సెషన్‌లకు కొత్తగా లాంచ్ అయిన (Oppo Reno 10 5G) 64MP ప్రైమరీ సెన్సార్‌తో f/1.7 లెన్స్ ఆటోఫోకస్, OIS సపోర్ట్‌తో వస్తుంది. 32MP టెలిఫోటో సెన్సార్, 8MP సెన్సార్‌తో కలిసి ఉంటుంది. సెల్ఫీలకు ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా సెన్సార్ కనిపిస్తుంది.