×
Ad

Hyundai i20 2026 : సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కొత్త హ్యుందాయ్ i20 కారు వచ్చేసిందోచ్.. ధర జస్ట్ రూ. 5.99 లక్షలే..!

Hyundai i20 2026 : 2026 హ్యుందాయ్ i20 ఇప్పుడు కేవలం ₹5.99 లక్షలకు అందుబాటులో ఉంది. స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కొత్త ఫీచర్లు, డిజైన్‌తో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్‌లతో పోటీపడుతుంది.

Hyundai i20 2026

  • కొత్త హ్యుందాయ్ i20 వెర్షన్ 2026 లాంచ్
  • ప్రారంభ ధర రూ. 5 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • 6 ఎయిర్‌బ్యాగులు, ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్‌కు సేఫ్టీ ఆప్షన్
  • సన్‌రూఫ్, బోస్ ప్రీమియం 7-స్పీకర్ ఆడియో సిస్టమ్

Hyundai i20 2026 : హ్యుందాయ్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత ఆటో మార్కెట్లోకి హ్యుందాయ్ i20 2026 కొత్త కారు వచ్చేసింది. హ్యుందాయ్ ఇప్పుడు ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కేవలం రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విక్రయించనుంది. కొత్త ఎంట్రీ-లెవల్ ఎరా వేరియంట్‌తో పాటు, మాగ్నా ఎగ్జిక్యూటివ్, మాగ్నా వేరియంట్‌ల ధరలు కూడా తగ్గాయి.

అయితే, మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి పోటీదారులతో పోలిస్తే మరింత స్ట్రాంగ్ ఉంటుంది. సేఫ్టీ, టెక్నాలజీ, డిజైన్‌ పరంగా అద్భుతంగా ఉంటుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక బేస్ మోడల్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్, పర్ఫార్మెన్స్ వివరాలపై ఓసారి లుక్కేయండి.

డిజైన్ :
హ్యుందాయ్ i20 డిజైన్ స్పోర్టీగా చాలా ప్రీమియంగా ఉంది. ఫ్రంట్ సైడ్ క్యాస్కేడింగ్ గ్రిల్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో బాడీ-కలర్ ORVM, డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రియర్ సైడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, రిఫ్లెక్టర్లు, స్పాయిలర్ మోడ్రాన్ టచ్‌ అందిస్తాయి. మొత్తంమీద, 3995mm పొడవు, 1775mm వెడల్పు, 1505mm ఎత్తు ఉంటుంది.

ఇంటీరియర్ వివరాలివే :

హ్యుందాయ్ i20 క్యాబిన్ ప్రీమియం, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌లో హై-క్వాలిటీ మెటీరియల్స్, సాఫ్ట్-టచ్ సర్ఫేస్‌లు, ఫిట్ అండ్ ఫినిషింగ్ ఉన్నాయి. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందిస్తాయి.

సీట్లు చాలా కంపర్టబుల్ ఉంటాయి. లెగ్‌రూమ్, హెడ్‌రూమ్‌ ఉన్నాయి. బ్యాక్ ఏసీ వెంట్స్ (టాప్ వేరియంట్‌లో) USB ఛార్జింగ్ పాయింట్లు, తగినంత స్టోరేజీ స్పేస్ అందుబాటులో ఉంది. ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, సన్‌రూఫ్, బోస్ ప్రీమియం 7-స్పీకర్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది.

Read Also : Vivo X100 Pro : అద్భుతమైన ఆఫర్ భయ్యా.. వివో X100 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

సేఫ్టీ ఫీచర్లు :
బేస్ ఎరా వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, డిజిటల్ క్లస్టర్, టైప్-సీ USB ఛార్జింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, బాడీ-కలర్ ఎక్స్ ట్రనల్ పార్ట్స్ లభిస్తాయి. హైయర్ వేరియంట్‌లలో వైర్‌లెస్ ఛార్జింగ్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, TPMS, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ i20 సేఫ్టీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఈబీడీతో ఏబీఎస్ హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా, టీపీఎంఎస్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. హై వేరియంట్‌లలో మరింత అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్‌కు సేఫ్టీ ఆప్షన్ కూడా ఉంది.

ఇంజిన్, మైలేజ్ :
హ్యుందాయ్ i20 మోడల్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 82-87bhp, 114-115Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, iVT (CVT) ఆటోమేటిక్ ఉన్నాయి. సిటీ, హైవేలో ఈ కారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఏఆర్ఏఐ మైలేజ్ 16kmpl మాన్యువల్ బేస్ నుంచి 20 kmpl (IVT) టాప్ ఆప్షన్ అందిస్తుంది.