Hyundai Car Discounts
ఫిబ్రవరిలో ఈ హ్యుందాయ్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు
ఫిబ్రవరి 8న ‘ఆల్వేస్ ఎరౌండ్ క్యాంప్’ వాలెంటైన్స్ ప్రొగ్రామ్
ఫిబ్రవరి నెలలో ఈ హ్యుందాయ్ కార్లపై రూ. 73వేల వరకు బెనిఫిట్స్
Hyundai Car Discounts : హ్యుందాయ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఫిబ్రవరిలో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా వెర్నా, i20, ఎక్స్‌టర్, గ్రాండ్ i10 నియోస్‌తో సహా ఎంపిక చేసిన మోడళ్లపై అనేక బెనిఫిట్స్ అందిస్తోంది.
ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు కంపెనీ ఫిబ్రవరి 8న ‘ఆల్వేస్ ఎరౌండ్ క్యాంప్’ అనే వాలెంటైన్స్ స్పెషల్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ఇనిషియేటివ్ కూడా నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా కార్ల అమ్మకాలు, సర్వీసులు, వాహన ఎక్స్చేంజ్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. హ్యుందాయ్ ప్రకారం.. అన్ని ఆఫర్‌లు లభ్యత, డీలర్ స్థాయి బట్టి మారుతుంటాయి. వేరియంట్ వారీగా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వినియోగదారులు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 2026లో హ్యుందాయ్ కొనుగోలుదారులకు లభించే బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..
హ్యుందాయ్ వెర్నా :
ఈ మిడ్ సైజు సెడాన్ ఫిబ్రవరి నెలలో రూ. 73వేల వరకు బెనిఫిట్స్‌తో అందుబాటులో ఉంది. సెడాన్ అభిమానులను కూడా వెర్నా అట్రాక్ట్ చేసేలా ఉంది. ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ కీలకమైన ఆఫర్లలో ఒకటిగా ఉంది.
హ్యుందాయ్ i20 :
ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను రూ. 48వేల వరకు బెనిఫిట్స్‌తో అందిస్తోంది. హ్యుందాయ్ ఎంపిక చేసిన i20 వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధరలను కూడా సవరించింది. ఎరా వేరియంట్ ఇప్పుడు రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
అయితే, మాగ్నా ఎగ్జిక్యూటివ్ ధర రూ. 6,86,865 నుంచి రూ. 6,73,900కు తగ్గింది. మాగ్నా వేరియంట్ కూడా తగ్గింపు పొందింది. గతంలో రూ. 7,12,385తో పోలిస్తే ఇప్పుడు రూ. 6,99,900 వద్ద లిస్ట్ అయింది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ లభిస్తున్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
హ్యుందాయ్ కాంపాక్ట్ SUV, ఎక్స్‌టర్, ఫిబ్రవరి నెలలో రూ. 33వేల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. సిటీ సెంట్రలైజడ్ SUVగా ఎక్స్‌టర్, కాంపాక్ట్ యాక్సెస్ కోసం ప్యాకేజీలో SUV స్టైలింగ్ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ :
గ్రాండ్ i10 నియోస్‌పై రూ. 48వేల వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. మోడ్రాన్ ఫీచర్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సిటీ రైడర్లకు ఈ హ్యాచ్‌బ్యాక్ కారు బెస్ట్ అని చెప్పొచ్చు.
వాలెంటైన్స్ స్పెషల్ ఈవెంట్ :
ఫిబ్రవరి నెలలో జరిగే కార్యక్రమాల్లో భాగంగా హ్యుందాయ్ ఫిబ్రవరి 8న ‘ఆల్వేస్ ఎరౌండ్ క్యాంప్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ ప్రొగ్రామ్ సందర్భంగా వాహన అమ్మకాలు, సర్వీసులు, అధీకృత డీలర్‌షిప్‌లలో ఎక్స్చేంజ్ డీల్స్ వంటి అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.