Hyundai Car Price Increase : కారు కొనాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. ఇప్పుడే కొనేయండి.. మేలో భారీగా పెరగనున్న ధరలు

Hyundai Car Price Increase : కారు కొనాలనుకునేవారికి భారీ షాక్ అని చెప్పవచ్చు. మే 1 నుంచి ధరలు పెరగబోతున్నాయి.

Hyundai to increase prices from may 2026 up to 1 percent

  • మరోసారి ధరల పెంపుకు రెడీ అయిన హ్యుందాయ్
  • గరిష్టంగా 1 శాతం వరకు పెంపు
  • మే 1 నుంచి అమల్లోకి కొత్త ధరలు

Hyundai Car Price Increase : మీరు కారు కొనాలని భావిస్తున్నారా.. అందులోనూ హ్యుందాయ్ కంపెనీ కారు కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడే త్వరపడండి. ఎందుకంటే.. త్వరలోనే ఈ కంపెనీ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మొత్తం మోడల్ లైన్అప్‌పై ధరలను సవరించినట్లు హ్యుందాయ్ కంపెనీ తాజాగా ప్రకటించింది. 2026 మే నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. గరిష్టంగా 1 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, ధరల పెరుగుదల అనేది మోడల్, వేరియంట్‌పై ఆధారపడి మారుతుందని తెలిపింది.

ధరల పెంపుకు గల కారణాలను కంపెనీ వివరించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇప్పటి వరకు కూడా వినియోగదారులపై భారం పడకుండా చూసేందుకు.. కంపెనీయే ఖర్చుల పెరుగుదలను భరించేందుకు ప్రయత్నించిందని.. కానీ ఈ ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల కొంత భాగాన్ని ధరల రూపంలో వినియోగదారులపై మోపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది.

Hyundai Car Discounts : హ్యుందాయ్ డిస్కౌంట్ ధమాకా.. వెర్నా, క్రెటా, i20 కార్లపై రూ. 1.10 లక్షల డిస్కౌంట్.. ఫుల్ లిస్ట్ ఇదే!

ఏ మోడల్ ధర ఎంత మేర పెరుగుతుందనే దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హ్యుందాయ్ ఇలా ధరలు పెంచడం ఇది రెండో సారి. గతంలో అంటే 2026 ఏడాది ప్రారంభంలోనే గరిష్టంగా 0.6 శాతం వరకు ధరలు పెంచింది. అలాగే, ఇటీవల మార్చిలో హ్యుందాయ్ వెన్యూ ధరను రూ.20,000 వరకు పెంచింది.

Hyundai Verna Facelift : సూపర్ కారు.. జస్ట్ రూ. 3 లక్షలు కట్టి ఈ కొత్త హ్యుందాయ్ తెచ్చుకోండి.. నెలకు EMI ఎంతంటే?

ఇప్పుడు తాజాగా మేలో మరోసారి ధరలను పెంచనుంది. అయితే హ్యుందాయ్ కంపెనీ నుంచి ఎక్కువగా అమ్ముడయ్యే క్రెటా, వెన్యూ వంటి మోడళ్లపై వేరియంట్ వారీగా ధరలు మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. కనుక హ్యుందాయ్ కార్లు కొనాలని భావించే వారు ఇప్పుడే కొంటే మేలని చెబుతున్నారు. కొత్త ధరలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి.