Hyundai Verna Facelift : సూపర్ కారు.. జస్ట్ రూ. 3 లక్షలు కట్టి ఈ కొత్త హ్యుందాయ్ తెచ్చుకోండి.. నెలకు EMI ఎంతంటే?
Hyundai Verna Facelift : కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఎంతకు వస్తుంది? డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? ఈఎంఐ లెక్కలపై ఓసారి లుక్కేయండి.
Hyundai Verna Facelift
- హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ కొనేవారికి సింపుల్ గైడ్
- ఈఎంఐలో ఈ కారు కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత?
- టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 18.25 లక్షల వరకు
Hyundai Verna Facelift : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. కారు మేకర్ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో అదిరిపోయే మోడల్ కార్లను అందిస్తోంది. కొన్ని మోడల్స్ బాగా పాపులర్ అయ్యాయి. హ్యుందాయ్ ‘హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్’ అనే కొత్త సెడాన్ లాంచ్ చేసింది.
కొత్త హ్యుందాయ్ వెర్నా కొత్త డిజైన్, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. కొత్త హ్యుందాయ్ వెర్నాను కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇది మీకోసమే.. హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ కోసం ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? నెలకు ఈఎంఐ ఎంత చెల్లించాల్సి ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ధర :
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ధర విషయానికి వస్తే.. హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.98 లక్షలు. ఈ కారు టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 18.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారుకు మొత్తం 6 వేరియంట్ (HX2, HX4, HX6, HX6+, HX8, HX10) ఆప్షన్లు ఉన్నాయి. మీరు బడ్జెట్ ధరలో హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్ కొనుగోలు చేయవచ్చు.
ఢిల్లీలో బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ కోసం రూ. 1.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా, ఇన్సూరెన్స్ కోసం సుమారుగా రూ. 54,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర చిన్న ఛార్జీలతో కలిపి హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ రూ. 12.86 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరకు వస్తుంది.
కనీస డౌన్ పేమెంట్ ఎంతంటే? :
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌ను కొనుగోలుకు కనీసం రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు నుంచి రూ. 9.86 లక్షలు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది.
నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
ఏదైనా బ్యాంకు నుంచి 5 ఏళ్లకు 9 శాతం వడ్డీ రేటుతో రూ. 9.86 లక్షల లోన్ తీసుకుంటే.. నెలకు రూ. 20,468 ఈఎంఐ చెల్లిస్తారు. 5 ఏళ్లలో బ్యాంకుకు మొత్తం రూ. 12.28 లక్షలు చెల్లిస్తారు. ఇందులో కేవలం రూ. 2.42 లక్షలు వడ్డీనే చెల్లిస్తారు.
