Hyundai Verna 2023 : హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ కారు వచ్చేస్తోంది.. మార్చి 21నే లాంచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Hyundai Verna 2023 : హ్యుందాయ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) నుంచి కొత్త హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna 2023) లాంచ్ కాబోతోంది.

Hyundai Verna 2023 : హ్యుందాయ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) నుంచి కొత్త హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna 2023) లాంచ్ కాబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హ్యుందాయ్ వెర్నా 2023 భారత మార్కెట్లో మార్చి 21న లాంచ్ కానుంది.

ఈ కారు మిడ్-సైజ్ సెడాన్ ఆరో జనరేషన్ మోడల్. ఈ నేమ్‌ప్లేట్ ఏళ్ల తరబడి బలమైన వారసత్వాన్ని ముందుకు కొనసాగించనుంది. ఈ కారు హోండా సిటీ 2023 , స్కోడా స్లావియా, VW వర్టస్, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి పోటీగా ఉంటుందని భావిస్తున్నారు. 2023 వెర్నా గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

హ్యుందాయ్ వెర్నా 2023 లాంచ్ తేదీ :
కొత్త వెర్నా మార్చి 21న భారత్‌లో లాంచ్ కానుంది.

2023 హ్యుందాయ్ వెర్నా డిజైన్ :
2023 వెర్నా రాడికల్ డిజైన్‌ను కలిగి ఉంది. పూర్తిగా రీడిజైన్‌తో రానుంది. ముందు, వెనుక కాస్తా కర్వడ్ లైనుతో వస్తుంది. అల్లాయ్ వీల్స్ పూర్తిగా కొత్తవి ఉండనున్నాయి. వెనుక భాగం చాలా రిఫ్రెష్‌గా కనిపిస్తుంది.

2023 హ్యుందాయ్ వెర్నా ఫీచర్లు :
వెర్నా 2023 ఎక్స్ టీరియర్ ఫీచర్లలో సెగ్మెంట్-ఫస్ట్ హారిజన్ LED పొజిషనింగ్ ల్యాంప్స్ ఉన్నాయి . కారు ఫేస్ మీదుగా రన్ అయ్యే DRL ద్వారా లుక్‌కు ప్రాధాన్యత ఉంది. షోల్డర్ లైన్ సైడ్‌కి కొంచెం స్పోర్టినెస్‌ని అందిస్తుంది. వెనుక భాగంలో, మీరు పారామెట్రిక్ కనెక్ట్ చేసిన LED టెయిల్‌ల్యాంప్‌లను పొందవచ్చు. కారును అందంగా కనిపించేలా చేస్తుంది.

Read Also : Best Premium Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? రూ.లక్ష లోపు 5 బెస్ట్ ప్రీమియం ల్యాప్‌టాప్‌లు.. ఇందులో ఏది బెటర్ అంటే?

2023 హ్యుందాయ్ వెర్నా క్యాబిన్ :
క్యాబిన్ లోపలికి అడుగు పెట్టగానే.. చుట్టూ ఉన్న ప్రీమియంను చూడొచ్చు. క్యాబిన్ కూడా చాలా విశాలంగా ఉంది. వీల్‌బేస్, వెడల్పు పెరగనుంది. చెప్పుకోదగ్గ ఫీచర్లలో ఫ్రంట్ హీటెడ్/వెంటిలేటెడ్ సీట్లు, సెగ్మెంట్-ఫస్ట్ స్విచ్ చేసేలా టైప్ ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోలర్, బోస్ ప్రీమియం సౌండ్ 8 స్పీకర్ సిస్టమ్, 10.25-అంగుళాల HD ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్, కలర్ TFT MIDతో డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి.

Hyundai Verna 2023 to launch in India tomorrow

2023 హ్యుందాయ్ వెర్నా అంచనా ధర ఎంతంటే? :
కొత్త వెర్నా ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా. మొత్తం 14 వేరియంట్‌లు ఉంటాయి.

2023 హ్యుందాయ్ వెర్నా ఇంజన్ :
ఈ కారులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్ (115PS గరిష్ట శక్తితో పాటు143.8Nm గరిష్ట టార్క్), 1.5-లీటర్ Turbo GDi పెట్రోల్ (160PS గరిష్ట శక్తి, 253Nm గరిష్ట టార్క్). ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో MPi పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ MT, IVT ఆటోమేటిక్, టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT ఉన్నాయి.

2023 హ్యుందాయ్ వెర్నా డైమెన్షన్ :
కొత్త వెర్నా కొలతలు విషయానికి వస్తే.. కారు 4,535mm పొడవు, 1,765mm వెడల్పు, 1,475mm పొడవు. సెగ్మెంట్-లీడింగ్ 2,670mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ కారులో 528-లీటర్ బూట్ ఉంది.

2023 హ్యుందాయ్ వెర్నా ADAS :
కొత్త వెర్నాలో 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, 17 లెవెల్ 2 ADAS ఫీచర్లతో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్, 65 కన్నా ఎక్కువ అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ADAS ఫీచర్లలో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్-ఎవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ ఉన్నాయి.

Read Also : Samsung Galaxy F14 5G : మార్చి 24న శాంసంగ్ గెలాక్సీ F14 5G వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు