ICICI Bank Charges 2026 : డిసెంబర్ 1 నుంచి ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు.. ఎవరి జేబుకు చిల్లు పడుతుందంటే?
ICICI Bank Charges 2026 : ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులకు అలర్ట్.. 2026 డిసెంబర్ 1 నుంచి క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. కొత్త రూల్స్, ఉచిత పరిమితులు, అదనపు ఛార్జీల వివరాలివే..
- Sreehari A
- Published on- October 23, 2026 / 08:31 AM IST
ICICI Bank cash transaction charges
- ICICI బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా?
- సేవింగ్స్ ఖాతాదారులకు అలర్ట్.. ICICI బ్యాంక్ కొత్త రూల్స్
- ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా మరింత ఖరీదు
- కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి క్యాష్ ఛార్జీలు పెంపు
ICICI Bank Charges 2026 : మీకు ICICI బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉందా? అయితే ఇది మీకోసమే.. క్యాష్ డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేసుకోవడం తరచూ చేస్తుంటే ఇది తప్పనిసరిగా తెలుసుకోండి. 2026 డిసెంబర్ 1 నుంచి కొన్ని క్యాష్ లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలను భారీగా పెంచనుంది. అయితే, ఈ మార్పు అందరికీ వర్తించదు. ఉచిత పరిమితి దాటిన వారిపైనే అదనపు భారం పడనుంది. పూర్తి ఛార్జీల వివరాలపై ఓసారి లుక్కేయండి..
నెలకు ఎన్నిసార్లు ఉచితం? :
కొత్త నిబంధనల ప్రకారం.. సేవింగ్స్ ఖాతాదారులు నెలకు 3 సార్లు ఉచితంగా క్యాష్ డిపాజిట్ చేయవచ్చు. అలాగే, నెలకు 3 క్యాష్ విత్‌డ్రాయల్స్ కూడా ఉచితంగానే చేయొచ్చు. ఈ ఉచిత లావాదేవీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాదు, క్యాష్ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు నెలకు రూ.1 లక్ష వరకు ఉచిత నగదు పరిమితి కూడా వర్తిస్తుంది. ఈ పరిమితులను దాటితే మాత్రం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.
Read Also : Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. రూ.1.80 లక్షల ఫోన్‌పై అమెజాన్‌లో భారీ తగ్గింపు..
ఛార్జీలు ఎంత పెరుగుతాయి? :
ప్రస్తుతం, ఉచిత పరిమితిని మించిన నగదు లావాదేవీలపై ప్రతి రూ.1,000కు రూ.3.50 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. అయితే, ఈ మొత్తం కనీసం రూ.150గా ఉండాలి. 2026 డిసెంబర్ 1 నుంచి ప్రతి రూ.1,000కు ఛార్జీని రూ.4కు పెంచనున్నారు. కనీస ఛార్జీ మాత్రం రూ.150గానే ఉంటుంది. అంటే, పరిమితికి మించి నగదు లావాదేవీలు చేసే కస్టమర్లు ఇకపై కొంత ఎక్కువ డబ్బులు కట్టాల్సి రావచ్చు.
కస్టమర్లు ఏం చేయాలి? :
ప్రతినెలా ఉచిత పరిమితిలోనే లావాదేవీలు చేసేవారికి ఎలాంటి ఛార్జీలు పడవు. కానీ, తరచూ పెద్ద మొత్తాల్లో క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేసే వారి ఖాతాలో అదనపు ఛార్జీలు పడొచ్చు. ముందుగానే బ్యాంకు కొత్త నిబంధనలను తెలుసుకోవడం ఎంతైనా మంచిది.
Note : ఈ కొత్త ఛార్జీలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాకు వర్తించే పూర్తి వివరాల కోసం ICICI బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.
