Income Tax
Income Tax : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. అడ్వాన్స్ టాక్స్ పే చేశారా? ఇంకా లేదంటే వెంటనే కట్టేయండి. ఈ త్రైమాసికంలో అడ్వాన్స్ టాక్స్ దాఖలుకు గడువు డిసెంబర్ 15 వరకు మాత్రమే ఉంది. ఈలోగా క్యాపిటల్ గెయిన్స్, వడ్డీ, డివిడెండ్‌లు లేదా వ్యాపార ఆదాయంతో పాటు ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కానీ, చాలామంది పన్నుచెల్లింపుదారులు (Income Tax) ఇంకా గడువు ఉందని, ఏడాది చివరిలో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయొచ్చులేనని పెద్దగా పట్టించుకోరు. గడువు తేదీ వరకు ఆగవద్దు. ముందుగానే అడ్వాన్స్ టాక్స్ పే చేయడం ఎంతైనా మంచిది. లేదంటే ఏడాది పొడవునా ఈ ఆదాయాలపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. దాంతో ప్రభుత్వం కూడా సకాలంలో పన్ను పేమెంట్లను అందుకుంటుంది. ఒకేసారి పెద్ద మొత్తాలను చెల్లించడం లేదా వడ్డీ పెనాల్టీలు పడకుండా ఉండొచ్చు.
జీతం ద్వారా కాకుండా మరి ఇతర ఆదాయంపై మొత్తం పన్ను బాధ్యత, TDS, TCS తొలగించిన తర్వాత రూ. 10వేలు దాటితే ఈ మొత్తాన్ని ఏడాది పొడవునా 4 వాయిదాలలో చెల్లించాలి. ఆదాయ మార్గాన్ని బట్టి ఈ పన్ను బాధ్యత భిన్నంగా లెక్కిస్తారు.
అంచనా ఎప్పుడు అవసరమంటే? :
మీకు వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం ఉంటే.. మీరు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీ అంచనా వేసిన పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని అంచనా వేయాలి. తదనుగుణంగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి. అయితే, క్యాపిటల్ గెయిన్స్ డివిడెండ్ ఆదాయం విషయంలో ఆదాయం వాస్తవానికి అందే వరకు అడ్వాన్స్ టాక్స్ అవసరం లేదు. ఈ ఆదాయాలను అంచనా వేయడం కష్టం. అందుకే అందిన త్రైమాసికంలో వాటిపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అడ్వాన్స్ టాక్స్ వాయిదా గడువు తేదీలివే :
60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు తమ ఆదాయం వ్యాపారం లేదా వృత్తి నుంచి రాకపోతే అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ నుంచి మినహాయింపు పొందుతారు. అయితే, ఒక సీనియర్ సిటిజన్ వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం కలిగి ఉంటే అడ్వాన్స్ టాక్స్ రూల్స్ ఇప్పటికీ వర్తిస్తాయి.
పన్ను చెల్లించకపోతే ఎంత పెనాల్టీ పడొచ్చు? :
అడ్వాన్స్ టాక్స్ వాయిదాను సకాలంలో డిపాజిట్ చేయకపోతే.. ఆ వ్యక్తి మిస్ అయిన వాయిదాపై 3శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ. లక్ష అడ్వాన్స్ టాక్స్‌పై జూన్ 15 నాటికి రూ. 15వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా చేయకపోతే పన్ను బకాయి ఉన్న మొత్తంపై నెలకు ఒక శాతం చొప్పున 3 నెలల పాటు మొత్తం 3శాతం వడ్డీని చెల్లించాలి.
మీరు సకాలంలో డిపాజిట్ చేయని రూ.15వేలపై వడ్డీగా రూ.450 చెల్లించాలి. మీరు ఆ మొత్తాన్ని తర్వాత డిపాజిట్ చేసినప్పటికీ కూడా 3 నెలల వడ్డీ మీరు కట్టని వాయిదాకు వర్తిస్తుందని గమనించాలి.