×
Ad

ఆల్‌ టైమ్‌ కనిష్ఠానికి రూపాయి.. అసలేం జరుగుతోంది? ఇలాగైతే ఎలా?

ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం కూడా దీనికి కారణమైంది.

India rupee: భారత రూపాయి గురువారం మరింత క్షీణించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 90.43గా ఉంది. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, దేశీ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు వెళ్లిపోతుండడం ఇన్వెస్టర్లను నిరాశకు గురి చేసింది. దీంతో రికార్డు స్థాయిలో రూపాయి మారకం విలువ కనిష్టాన్ని తాకింది.

Also Read: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. పసిడి దుకాణాలకు పరుగులు తీయాల్సిందే..

ఎఫ్‌పీఐల నిరంతర అమ్మకాలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. భారత మార్కెట్లలో షేర్లు, బాండ్లు, ఇతర ఆర్థిక సాధనాలు కొనుగోలు చేస్తున్న విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) ఈ ఏడాది ఇప్పటివరకు 1.52 లక్ష కోట్ల షేర్లను విక్రయించారు.

డిసెంబర్ తొలి 3 రోజుల్లో 8,369 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. కొన్ని నెలలుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. ఈక్విటీ, డెట్‌ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

“డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం 90 మార్క్ దాటిన తీరు చూస్తే ఒత్తిడి తగ్గలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ తీరు ఒత్తిడి కొనసాగుతుందని, 90.70-91.00కి చేరే దిశగా వెళ్తుందని సూచిస్తోంది” అని సీఆర్ ఫారెక్స్‌కు చెందిన పబారి అన్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 92కూ వెళ్లవచ్చన్న అంచనాలు ఉన్నాయి.