అమెరికాలో విదేశీయులకు అనుమతి లేదంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో భారతీయ అమెరికన్లలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఇమిగ్రేషన్‌ను రద్దు చేయడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ సంతకంతో తాత్కాలికంగా ఇమిగ్రేషన్లను రద్దు కానున్నాయి. అమెరికాలోకి 60 రోజుల వరకు విదేశీయులకు ఇమ్మిగ్రేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. నిర్దిష్టమైన గ్రీన్ కార్డుల జారీపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించారు. ఇప్పుడు ఇదే.. భారతీయ అమెరికన్లలో ఆందోళనను రేకిత్తిస్తోంది. ఇమ్మిగ్రేషన్, గ్రీన్ కార్డుల జారీ విషయంలో ట్రంప్ నిర్ణయంపై ఇండో అమెరికన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
గ్రీన్ కార్డుపై అమెరికా వెళ్లేవారిలో ఆందోళన :
ట్రంప్ నిర్ణయంతో చాలామందిలో కలవరం మొదలైంది. గ్రీన్ కార్డుపై అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులకు ఇమ్మిగ్రేషన్ రద్దు నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా యూనివర్శిటీలో క్లినికల్ కమ్యూనిటీ సైకాలిజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ గితికా తల్వార్ కూడా ట్రంప్ నిర్ణయంతో కలవరపాటుకు గురయినట్టు చెప్పుకొచ్చారు. అమెరికాలో కాలేజీ విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలకు సంబంధించి వారికి గితికా తల్వార్ కౌన్సిలింగ్ ఇస్తుంటారు. కానీ, కొన్నిరోజుల నుంచి ఆమెలో ఒకరకమైన భయాందోళన నెలకొంది. దాన్ని నుంచి బయటకు పడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఆకస్మాత్తుగా ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ తాత్కాలింకగా రద్దు చేస్తున్నట్టు ట్విట్టర్ లో ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి తల్వార్ పరిస్థితి ఇలా మారింది.
‘ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ ట్వీట్ చదివిన వెంటనే నాకు చాలా భయం వేసింది. గత కొన్ని సంవత్సరాల్లో ప్రతి క్షణం.. నా ఇమ్మిగ్రేషన్ గురించి చింతించడం లేదా ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే అవసరం రాలేదు’అని అమెరికాలో డాక్టరేట్ చేసిన తల్వార్ అభిప్రాయపడ్డారు. ఆమె తన భర్తతో కలిసి 13 సంవత్సరాలుగా అమెరికాలోనే నివసిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత కారణంగా అమెరికా అల్లాడిపోతోంది. ఈ క్రమంలో కంటికి కనిపించని శతృవు దేశంపై దాడి చేస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇమ్మిగ్రేషన్ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే తాను ఈ సంతకం చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమెరికా యువత ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాత్కాలికంగా ఇమిగ్రేషన్లను రద్దు చేయాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పారు.
In light of the attack from the Invisible Enemy, as well as the need to protect the jobs of our GREAT American Citizens, I will be signing an Executive Order to temporarily suspend immigration into the United States!
— Donald J. Trump (@realDonaldTrump) April 21, 2020
కరోనాతో దెబ్బతిన్న అమెరికా ఎకానమీ :
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తిచెందినప్పటి నుంచి ఇప్పటివరకూ 840,000 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మరో 46,785 మంది మృత్యువాతపడినట్టు Johns Hopkins Coronavirus Resource Center ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని కారణంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. తద్వారా గత ఐదు వారాల్లో అమెరికాలో 26 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. మరోవైపు ట్రంప్ ఆదేశాలతో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పదేపదే నొక్కి చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్ పై ఆంక్షలు విధించినంత మాత్రానా అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయనడంలో అర్థం లేదని కొట్టిపారేస్తున్నారు. ప్రతి ఏడాదిలో వేలాది మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్తున్నారు. దేశంలో సుమారు 4 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నారు. వలస పరిమితులు భారతదేశానికి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని The New York Times నివేదించింది.
వచ్చే 60 రోజుల్లో దరఖాస్తులపైనే ప్రభావం :
ఇప్పటివరకూ ఇమ్మిగ్రేషన్ మారటోరియం కేవలం అమెరికాలో వచ్చే 60 రోజుల్లో గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేవారిపైనే ప్రభావం పడనుంది. తాత్కాలిక వీసాలైన EB-5 ఇన్వెస్టర్ వీసాలు, స్పెషల్ ఇమ్మిగ్రెంట్ వీసాలు, దంపతుల వీసాలు, అమెరికా పౌరుల మైనర్ చిల్డ్రన్ వీసాలకు మాత్రం మినహాయినిస్తుంది. ఈ ఆదేశాలు అమల్లో ఉన్నంత కాలం.. ప్రతి ఏడాదిలో దాదాపు 33 శాతంతో 1.1 మిలియన్ల గ్రీన్ కార్డుల జారీకి అమెరికా ఆమోదించకపోవచ్చు. ఇటీవలే Cato Institute నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. నైపుణ్యం కలిగిన భారతీయుల్లో 89శాతం మందికి ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులను పొందుతున్నారు. అమెరికాలో చట్టపరమైన శాశ్వత నివాసానికి 90 ఏళ్లు పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. దాదాపు 2 లక్షల మంది గ్రీన్ కార్డు పొందడానికి ముందే వృధాప్యంతో మరణిస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది.
భారతీయ గ్రీన్ కార్డుదారులపై పెద్దగా ప్రభావం ఉండదు:
భారతీయుల్లో కూడా 7 శాతం మేర ప్రభావం పడగా, గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల్లో 50 శాతం మంది అసమాన స్థాయిలో ప్రభావితమవుతున్నారు. ఇప్పటివరకూ బయటి దేశాల నుంచి అమెరికాలో శాశ్వాత నివాసానికి దరఖాస్తు చేసేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తించేది. తాత్కాలిక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై కాదని Cato study రచయిత డేవిడ్ బెయిర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ కొత్త ఆదేశాలు భారతీయ గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని నమ్ముతున్నట్టు తెలిపారు. భారతీయుల్లో 92 శాతం ఉద్యోగ ఆధారిత EB-2, EB-3 భారతీయ గ్రీన్ కార్డు దరఖాస్తుదారులే ఉండగా.. వీరంతా తాత్కాలిక స్టేటస్.. H-1B నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా మాదిరిగా అమెరికాలో పనిచేస్తున్నారు.