Indian Railways New Rule : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై ఇలా ప్రయాణించలేరు..!

Indian Railways New Rule : భారత రైల్వే కొత్త రూల్స్ తీసుకొస్తోంది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు టికెట్ తీసుకున్నాక ఇలా ప్రయాణించలేరని గమనించాలి..

Indian Railways New Rule

Indian Railways New Rule : రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి భారత రైల్వేలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈసారి రైల్వేలో నియమాల్లో పెద్ద మార్పు ఉండబోతోంది. ఈ కొత్త నిబంధనల కారణంగా రైల్వే ప్రయాణికులపై ప్రభావం పడనుంది.

ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులపైనే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే.. స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతించరు. వెయిటింగ్ లిస్టు కలిగిన ప్రయాణికులు జనరల్ క్లాస్‌లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.

Read Also : Post Office Scheme : భార్యాభర్తల కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. జాయింట్ అకౌంట్లో పెట్టుబడి.. ఏడాదికి రూ. లక్షకుపైగా సంపాదించొచ్చు..!

మే 1 నుంచి కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు భారత రైల్వే కొత్త నియమాలను తీసుకొస్తోంది. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే.. అది ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. అయితే, కౌంటర్ నుంచి వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు కొనుగోలు చేసే చాలా మంది ప్రయాణీకులు ఇప్పటికీ స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తారు.

స్లీపర్, ఏసీలో ప్రయాణం నిషేధం :
వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించడం నిషేధమని గమనించాలి. అదేవిధంగా, వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు ఈ కోచ్‌లలో సీటులో కూర్చుని ఉన్నట్లు తేలితే.. వారికి జరిమానా విధించడం లేదా జనరల్ కంపార్ట్‌మెంట్‌కు తరలించే హక్కు TTEకి ఉంటుంది.

వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకు ప్రయాణ సమయంలో అసౌకర్యం కలగకుండా కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ నిబంధనను అమలు చేసినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ తెలిపారు.

వెయిటింగ్ టికెట్లతో కష్టమే :
తరచుగా వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో కన్ఫార్మడ్ టిక్కెట్లు ఉన్నవారి సీట్లలో కూర్చొంటారు. దీనివల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా, ఈ కోచ్‌లలో వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల సంఖ్య పెరిగినప్పుడు సీట్లు బ్లాక్ అవుతాయి.

Read Also : OnePlus Summer Sale : మే 1 నుంచే వన్‌ప్లస్ సమ్మర్ సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లు, ప్యాడ్, బడ్స్ ప్రో, స్మార్ట్ వాచ్‌లపై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

ప్రయాణికుల కదలిక కష్టతరం అవుతుంది. ప్రయాణీకులందరికీ ప్రయాణం అసౌకర్యంగా ఉంటుంది. మీరు తరచుగా వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణిస్తుంటే.. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయాణాన్ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రయాణం సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.