IndiGo Cabs : విమానం ఎక్కేవారికి పండగే.. ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది.. జస్ట్ రూ. 49కే రైడ్ బుకింగ్‌..!

IndiGo Cabs : ఇండిగో 'ఎయిర్‌పోర్ట్ క్యాబ్స్' అనే సరికొత్త సేవలను విస్తరించింది. ప్రయాణికులు ఇండిగో ప్లాట్‌ఫామ్ ద్వారా క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణం ఈజీగా సౌకర్యవంతంగా ఉంటుంది.

IndiGo Cabs

IndiGo Cabs : ఇండిగో ‘ఎయిర్‌పోర్ట్ క్యాబ్స్’ అనే సరికొత్త సేవలను విస్తరించింది. ప్రయాణికులు ఇండిగో ప్లాట్‌ఫామ్ ద్వారా క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణం ఈజీగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సంస్థ థర్డ్-పార్టీ క్యాబ్ ప్రొవైడర్ మోజోబాక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా ప్రయాణికులు రియల్-టైమ్ క్యాబ్ లభ్యతను అంచనా ఛార్జీలను చూడవచ్చు.

విమానాశ్రయం నుంచి నగరానికి నగరం నుంచి విమానాశ్రయానికి క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు. తద్వారా ఇండిగో (IndiGo Cabs) ప్రయాణికులకు మరింత కనెక్టివిటీని అందిస్తుంది. అయితే, ప్రయాణీకులు తమ సౌలభ్యం ప్రకారం.. క్యాబ్ బుకింగ్‌లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు.

ఇండిగో ఎయిర్‌పోర్ట్ క్యాబ్ బుకింగ్ సర్వీసు, సౌకర్యవంతమైన ఎయిర్‌పోర్ట్ ప్రయాణాల కోసం చూస్తున్న వినియోగదారులు, కొత్త ప్రయాణికుల అవసరాలను తీరుస్తుంది. ఈ సర్వీసుల ద్వారా ఇండిగో నగర రవాణాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని యోచిస్తోంది.

ప్రయాణీకులు ఈజీగా జర్నీ పూర్తి చేసేందుకు విమాన ప్రయాణానికి ముందు, ఆ తర్వాత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఇండిగో ఈ సర్వీసును రూపొందించింది. ప్రయాణీకులకు తమ విమానాలు, వసతి, ఎయిర్‌పోర్ట్ ప్రయాణాల కోసం సింగిల్ ప్లాట్‌ఫారం అందిస్తుంది.

Read Also : REON Pocket AC : పోర్టబుల్ ఫ్యాన్లకు గుడ్‌బై… ఇక మెడలోనే AC పెట్టుకుని బయట తిరగండి.. కూల్‌గా చిల్ అవ్వండి..

ఇండిగోతో క్యాబ్‌లను ఎలా బుక్ చేయాలి? :
ఇండిగో క్యాబ్‌లను ఇండిగో వెబ్‌సైట్, మొబైల్ యాప్ నుంచి నేరుగా బుక్ చేసుకోవచ్చు. ముందుగా, ప్రయాణికులు ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను విజిట్ చేసి బుకింగ్ విడ్జెట్‌కు వెళ్లాలి.

ఆ తర్వాత ‘Book A Cab’ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఎయిర్‌పోర్ట్ లొకేషన్, డ్రాప్-ఆఫ్ లొకేషన్‌తో పాటు పికప్ తేదీ, టైమ్ ఎంటర్ చేయండి. ‘Search’పై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న క్యాబ్‌లన్నీ కనిపిస్తాయి. ఒక కార్ సర్వీస్‌ను ఎంచుకుంటే ప్రయాణికులు రివ్యూ పేజీకి వెళ్తారు.

మీ పేరు, ఇంటిపేరు, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ మొదలైన మీ ప్రయాణ వివరాలను ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ వివరాలు పంపుతారు. కంటిన్యూ క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రయాణికులు పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. పేమెంట్ తర్వాత ప్రయాణికుడి ఇమెయిల్ అడ్రస్ కు బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది.

ఇండిగో ఎయిర్‌పోర్ట్ క్యాబ్స్ ఫీచర్లు :

  • కేవలం రూ. 49కే టాక్సీలను పొందవచ్చు.
  • కంపెనీ 100 శాతం హామీతో ఎయిర్‌పోర్ట్ పికప్, డ్రాప్ సౌకర్యాన్ని అందిస్తోంది.
  • ఇతర క్యాబ్ కంపెనీల మాదిరిగా సర్జ్ ప్రైసింగ్ ఉండదు.
  • క్యాబ్‌ రియల్ టైమ్ కూడా ట్రాక్ చేయగలరు.
  • ట్రస్టబుల్, వెరిఫైడ్ డ్రైవర్లు మాత్రమే ఉంటారు
  • మిమ్మల్ని పికప్ చేసుకునే వరకు క్యాబ్‌ను ఎప్పుడైనా ఫ్రీగా క్యాన్సెల్ చేయొచ్చు
  • 30 నిమిషాల ఫ్రీ వెయిటింగ్ టైమ్ కూడా ఉంది.