Investment Options: సేవింగ్స్ అకౌంట్‌తో పోలిస్తే బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు

సాధారణంగా బ్యాంకులో మనీ సేవ్ చేసి.. డ్రా చేసే సమయంలో ఏమైనా పెరిగాయా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. వేరే రకంగా పెట్టుబడి పెడితే పెరుగుతాయని తెలిసినా ఇలా చేయడానికి కారణం.. ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చని.. సేవింగ్స్ అకౌంట్ అంటే డబ్బు ఎటూ పోదనే నమ్మకం.

investment-options

Investment Options: సాధారణంగా బ్యాంకులో మనీ సేవ్ చేసి.. డ్రా చేసే సమయంలో ఏమైనా పెరిగాయా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. వేరే రకంగా పెట్టుబడి పెడితే పెరుగుతాయని తెలిసినా ఇలా చేయడానికి కారణం.. ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చని.. సేవింగ్స్ అకౌంట్ అంటే డబ్బు ఎటూ పోదనే నమ్మకం.

ఇండియాలో అలా తక్కువ కాలంలోనే మీ పెట్టుబడికి సరైనా లాభాలు రావాలంటే.. ఏం చేయాలి. దాదాపు 3శాతం వరకూ వడ్డీ వచ్చే ఈ పెట్టుబడులు సేవింగ్స్ అకౌంట్ కంటే బెటర్ గానే ఉంటాయి.

టర్మ్ డిపాజిట్స్:
ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్లలో ఫిక్స్ డ్ రిటర్న్స్ వచ్చేది ఫిక్స్ డ్ డిపాజిట్స్ మాత్రమే. కంపెనీ డిపాజిట్స్ లేదా పోస్టాఫీస్ డిపాజిట్స్ లాంటివి. వీటిని ఏడు రోజుల నుంచి 12నెలల వరకూ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయొచ్చు. పోస్టాఫీస్లలో అయితే సంవత్సరం డిపాజిట్ చేసుకోవచ్చు.

డెబిట్ ఫండ్స్:
రిటర్న్స్ పైన నమ్మకాల్లేని వాటిల్లో డెబిట్ ఫండ్స్ ఒకటి. కాకపోతే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ప్రొడక్ట్స్ తో పోలిస్తే ఎఫెక్టివ్ రిటర్స్ వస్తాయనే చెప్పాలి. వీటిల్లో పలు కేటగిరీలు ఉంటాయి.
లిక్విడ్ ఫండ్ – 91 రోజులు
అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్ – 3 నుంచి 6 నెలలు.
లో డ్యూరేషన్ ఫండ్ – 6 నుంచి 12 నెలలు.
మనీ మార్కెట్ ఫండ్ – సంవత్సరం

మధ్య స్థాయి నుంచి దీర్ఘ కాలిక ఫండ్: ఇటువంటి ఫండ్స్ ప్రస్తుతం మనీ మార్కెట్ లో 4 నుంచి 7ఏళ్ల మధ్యలో నడుస్తుంది.

షార్ట్ టర్మ్ లో సేవింగ్ చేయాలనుకుంటే కాంప్రమైజ్ కాకుండా పెట్టేయండి. అదే సమయంలో ట్యాక్సేషన్ ను కూడా దృష్టిలో ఉంచుకోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే.. షార్ట్ నోటీస్ పీరియడ్ తో డ్రా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందే ఎప్పటిలోగా విత్ డ్రా చేసుకోవచ్చో అడిగి తెలుసుకోండి.