iPhone 15 vs iPhone 16
iPhone 15 vs iPhone 16 : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో పండుగ సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్స్ సందర్భంగా అనేక ఐఫోన్ మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ, ఏ మోడల్ ఐఫోన్ కొంటే బెటర్ అనేది డిసైడ్ కావడం కొద్దిగా కష్టమే. ఇప్పుడు ఐఫోన్ ప్రియులు ఇదే సందిగ్ధంలో పడ్డారు.
ఈ-కామర్స్ దిగ్గజాలు రెండూ అద్భుతమైన డీల్స్ (iPhone 15 vs iPhone 16) అందిస్తున్నాయి. అందులో ఐఫోన్ 15 అమెజాన్‌లో అత్యల్ప ధరకు లభిస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ రెండు ఐఫోన్లలో ఏది కొంటే బెటర్ అనేది నిర్ణయించుకోలేక చాలామంది కొనుగోలుదారుల్లో గందరగోళాన్ని సృష్టించింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు :
అమెజాన్ వెబ్‌సైట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 రూ.43,749 ధర నుంచి లభ్యమవుతుంది. ప్రస్తుత జాబితా ధర రూ.59,900 నుంచి భారీగా తగ్గింపు పొందింది. రూ.17వేల కన్నా ఎక్కువ తగ్గింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో గత ఏడాదిలో రూ. 69,900కు లాంచ్ అయిన ఐఫోన్ 16 ఇప్పుడు సేల్ సమయంలో రూ. 51,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం దాదాపు రూ. 8వేలు ఉంటుంది.
ఐఫోన్ 16 కొనాలా? ఐఫోన్ 15 కొనాలా? :
2023, 2024లో వరుసగా లాంచ్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 15 రెండూ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్, బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలో 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కానీ, అసలు వ్యత్యాసం ప్రాసెసర్‌లో ఉంది. ఐఫోన్ 15 A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
అయితే, ఐఫోన్ 16 మరింత పవర్‌ఫుల్ A18 బయోనిక్ చిప్‌సెట్ కలిగి ఉంది. ఐఫోన్ 16 కొత్త ఏఐ ఫీచర్‌లతో ప్రత్యేక కెమెరా, యాక్షన్ బటన్‌తో రీడిజైన్ కలిగి ఉంది. ధర పరంగా చూస్తే.. కొత్త డిజైన్, అడ్వాన్స్ ఏఐ, కెమెరా బటన్ కోరుకునే యూజర్లకు ఐఫోన్ 16 అద్భుతమైన అప్‌గ్రేడ్. అయితే, ఈ కొత్త ఫీచర్లు అవసరం లేకుంటే ఐఫోన్ 15 కూడా అద్భుతమైన ఆప్షన్. ఎందుకంటే తక్కువ ధరలో దాదాపు ఒకేలాంటి కోర్ ఫీచర్లను కలిగి ఉంది.