iPhone 16 Plus Price : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్‌.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

iPhone 16 Plus Price : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 ప్లస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ముగిసేలోగా వెంటనే కొనేసుకోండి.

iPhone 16 Plus Price

iPhone 16 Plus Price : కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఐఫోన్ ప్లస్ ధరను రూ.14,900 కన్నా ఎక్కువ తగ్గింపుతో అందిస్తోంది.

Read Also : Tech Tips : మీ ఫోన్ వేడెక్కుతోందా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వేసవిలో మొబైల్ కూలింగ్ కోసం 5 అద్భుతమైన టిప్స్ ఇవే!

ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ 16 ప్లస్ వంటి పాపులర్ మోడళ్లపై ఆఫర్లు చాలా తక్కువగా ఉంటాయి. మీరు మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఇంతకీ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.9,901 డైరెక్ట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఐఫోన్ ధర రూ.79,999కి తగ్గింది. ఈ డీల్‌ను మరింత తక్కువ ధరకే పొందాలంటే.. ఫ్లిప్‌కార్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై (Non-EMI) అదనంగా రూ.5వేల డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

AP Inter Results 2025

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. హుడ్ కింద, ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అలాగే, అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.

Read Also : iPhone 15 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. రూ.80వేల ఐఫోన్ 15 కేవలం రూ.32,950 మాత్రమే.. డోంట్ మిస్!

కంపెనీ ప్రకారం.. ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్ 48MP మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ షూటర్ ఉంది. ఇంకా, ప్రీమియం ఫోన్ IP68-సర్టిఫైడ్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.