Tech Tips : మీ ఫోన్ వేడెక్కుతోందా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వేసవిలో మొబైల్ కూలింగ్ కోసం 5 అద్భుతమైన టిప్స్ ఇవే!
Tech Tips : వేసవి కాలంలో మీ ఫోన్ అదేపనిగా వేడెక్కుతుందా? అయితే వెంటనే ఇలా చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ ఎంత వేడిగా ఉన్నా కూడా వెంటనే కూలింగ్ అవుతుంది. ఈ 5 స్మార్ట్ టిప్స్ తెలుసుకోండి.

Your Phone Overheating
Tech Tips : అసలే ఎండకాలం.. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. మీ స్మార్ట్‌ఫోన్ లోపల హీట్ కూడా వేగంగా పెరుగుతుంది. చాలా మంది మొబైల్ యూజర్లు తమ ఫోన్లు వెంటనే వేడెక్కుతున్నట్లు గమనిస్తుంటారు.
ముఖ్యంగా ఎక్కువసేపు కాల్స్ చేస్తున్నప్పుడు, గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా GPS వాడుతున్న సమయంలో స్మార్ట్‌ఫోన్ వేడెక్కడం ఎక్కువగా చూస్తుంటారు. మీ ఫోన్ ఎక్కువగా హీట్ అయితే పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. కాలక్రమేణా, బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను వేసవికాలంలో కూడా ఎల్లప్పుడూ కూల్‌గా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించండి. అవేంటో ఓసారి చూద్దాం..
1. నేరుగా సూర్యకాంతిలో ఉంచొద్దు :
మీ ఫోన్‌ను కొన్ని నిమిషాలు ఎండలో ఉంచినా కొద్దిసేపటికే వేడెక్కుతుంది. మీరు బీచ్‌లో ఉన్నా, కారులో ఉన్నా లేదా కిటికీ దగ్గర కూర్చున్నా మీ ఫోన్ నీడలో ఉండేలా చూసుకోండి. మీ ఫోన్‌ను ఏదైనా గుడ్డ (ఇన్సులేటెడ్ బ్యాగ్‌లో) ఉంచాలి. అప్పుడు నేరుగా ఎండ పడదు. తద్వారా మీ ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
2. వాడని ఫీచర్లను ఆఫ్ చేయండి :
బ్లూటూత్, వై-ఫై, మొబైల్ డేటా, లొకేషన్ సర్వీసులతో బ్యాటరీ వేగంగా డౌన్ అవుతుంది. తద్వారా ఫోన్ తొందరగా వేడెక్కుతుంది. మీరు ఈ ఫీచర్లను వాడకపోతే వెంటనే ఆఫ్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్లలో అవసరంలేని ఫీచర్ల సంఖ్యను ఆపివేస్తే ఫోన్ వెంటనే కూల్ అవుతుంది. అలాగే, మీకు కనెక్టివిటీ ఫీచర్లు అవసరం లేనప్పుడు ఎయిర్‌ప్లేన్ మోడ్‌కి మారితే కూడా మీ ఫోన్ కూల్ అవుతుంది.
3. హీట్ ఎక్కువగా ఉంటే ఫోన్ వాడొద్దు :
మధ్యాహ్నం ఎండ వేడిలో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఫోన్ అదేపనిగా వాడకుండా ఉండటం మంచిది. మీ ఫోన్ తీవ్రంగా వేడెక్కితే అది చల్లబడే వరకు కాసేపు రెస్ట్ తీసుకోండి.
4. ఫోన్ కేసును రిమూవ్ చేయండి :
ముఖ్యంగా మందంగా లేదా రబ్బరైజ్ కేస్‌లు వేడిని బయటకు పోకుండా అడ్డుకుంటాయి. మీ ఫోన్ వేడెక్కితే కొద్దిగా గాలి తగిలేలా చూడండి. అందుకోసం మీ ఫోన్ బ్యాక్ కేస్ రిమూవ్ చేయండి. సరైన కూలింగ్ కోసం చల్లని ఉపరితలంపై ఉంచండి. తద్వారా వేడి తగ్గిపోయి ఫోన్ కూల్ అవుతుంది.
5. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయండి :
ఒకేసారి ఎక్కువ యాప్‌లను ఓపెన్ చేసి ఉంచడం వల్ల మీ ఫోన్ ప్రాసెసర్‌పై అనవసరంగా ప్రెజర్ పెరుగుతుంది. మీరు ప్రస్తుతం ఉపయోగించని యాప్‌లను స్వైప్ చేయండి. మీ ఫోన్‌ను పవర్ డౌన్ చేసి రీబూట్ చేసి రెస్ట్ ఇవ్వండి. మీ ఫోన్ కూల్ అవుతుంది. ఫలితంగా బ్యాటరీ లైఫ్ టైమ్ కూడా పెరుగుతుంది. వేసవిలో ఈ స్మార్ట్ టిప్స్ ద్వారా మీ ఫోన్ సురక్షితంగా ఉంచుకోవచ్చు. కూల్‌గా ఉండే ఫోన్ వేగంగా రన్ అవుతుంది. ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఉంటుంది.