SIP Investment : మీ జీతం డబ్బుల్లో నెలకు రూ. 5వేలు ఇలా ఇన్వెస్ట్ చేయండి.. 30ఏళ్లలో రూ. కోటికిపైగా సంపాదించవచ్చు..!
SIP Investment : మీ ఆదాయంలో కొంత డబ్బును ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? SIPలో పెట్టుబడి పెట్టండి. నెలకు రూ. 5వేలు చొప్పున 30ఏళ్లలో రూ. కోటికిపైగా డబ్బులను సంపాదించవచ్చు.. అది ఎలాగంటే?

SIP Investment
SIP Investment : అందరూ డబ్బులు సంపాదిస్తారు. కానీ, కొందరే ఆ డబ్బులను పొదుపుగా ఖర్చుపెడతారు. మరికొంతమంది జీతం పడిన వెంటనే ఆ డబ్బులను ఏదైనా పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీ ఆదాయం ఆదాయం బాగున్నప్పుడే డబ్బులు కూడబెట్టుకోగలమని చాలా మంది నమ్ముతారు.
కానీ, మీకు పెట్టుబడి గురించి సరైన అవగాహన ఉంటే.. మీరు చిన్న ఆదాయాల నుంచి కూడా కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చు. కేవలం రూ.25వేలు జీతం పొందే వారు కూడా రూ.1.5 కోట్లు సంపాదించవచ్చు.
ఈ ఫార్ములా తెలిస్తే చాలు.. మీరు చేయాల్సిందిల్లా.. రూ. 1.5 కోట్లు సంపాదించాలనుకుంటే.. 50-30-20 ఫార్ములా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి కోసం మీ ఆదాయంలో 20శాతం ఆదా చేయాలి. మిగిలిన 80శాతం మొత్తంతో మీరు మీ ఇంటి అవసరాలు, ఇతర ఖర్చులను తీర్చుకోవచ్చు. మీరు నెలకు రూ. 25వేలు సంపాదిస్తే.. మీరు 20శాతం రేటుతో నెలకు రూ. 5వేలు పెట్టుబడి పెట్టాలి.
ఇంతకీ పెట్టుబడి ఎక్కడ పెట్టాలా అంటారా? మీరు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. SIPలో మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. మార్కెట్ లింక్డ్ అయినప్పటికీ.. కొంత రిస్క్ ఉంటుంది. ఇందులో రాబడిపై ఎలాంటి హామీ ఉండదు. అయినప్పటికీ గత కొన్ని ఏళ్లుగా SIP సగటు రాబడి 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో చాలామంది పెట్టుబడిదారులు ఈ ఇదో అద్భుతమైన పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.
నెలకు రూ. 5వేలతో పెట్టుబడి :
మీరు ప్రతి నెలా SIPలో రూ. 5వేలు పెట్టుబడి పెడితే.. ఈ పెట్టుబడిని 30 ఏళ్లు కొనసాగించాలి. మీరు మొత్తంగా రూ. 18లక్షలు పెట్టుబడి పెడతారు. 12శాతం రాబడి రేటుతో, వడ్డీగా రూ.1,36,04,866 అందుతుంది. ఇలా 30 ఏళ్లలో మీ దగ్గర మొత్తం రూ. 1,54,04,866 డబ్బులు జమ అవుతాయి. అంటే.. కోటికిపైగా డబ్బులు మీ చేతికి అందుతాయి అనమాట.
ఒకవేళ మీ దగ్గర డబ్బు లేదని భావిస్తే.. మీరు SIP చెల్లింపు సమయాన్ని ఒకటో తేదీ నుంచి 5వ తేదీ మధ్య ఉంచుకోవాలి. ఒకటో తేదీన మీ జీతం బ్యాంకు అకౌంటులో పడిన వెంటనే ముందుగా ఆ డబ్బు పెట్టుబడికి వినియోగించవచ్చు. ఆ తరువాత, మీరు మీ ఇష్టానుసారం మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు.
ప్రస్తుత రోజుల్లో SIP అనేది రాబడి పరంగా అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సగటు రాబడి 12 శాతంగా ఉంటుంది. కొన్నిసార్లు దీని కన్నా మెరుగ్గా లేదా తక్కువగా కూడా ఉండవచ్చు. ఈ ప్లాన్ ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇంత లాభం మరే ఇతర ప్రభుత్వ పథకంలోనూ లభించదు. మెరుగైన వడ్డీతో పాటు చక్రవడ్డీ రాబడి కారణంగా మీరు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మీరు అంత ఎక్కువ రాబడిని పొందవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి.