Samsung One UI 7 Update : ఈ శాంసంగ్ ఫోన్లలో కొత్త One UI 7 అప్‌డేట్.. మీరు వాడే మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Samsung One UI 7 Update : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. శాంసంగ్ వన్ యూఐ 7 కొత్త అప్‌డేట్ వచ్చేసింది. మీ శాంసంగ్ ఫోన్లలో కూడా ఈ అప్‌‌డేట్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి.

Samsung One UI 7 Update : ఈ శాంసంగ్ ఫోన్లలో కొత్త One UI 7 అప్‌డేట్.. మీరు వాడే మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Samsung One UI 7 Update

Updated On : April 11, 2025 / 9:18 PM IST

Samsung One UI 7 Update : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ అధికారికంగా ఆండ్రాయిడ్ 15-ఆధారిత వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. వన్ UI 7 అప్‌డేట్ ఇప్పటికే అనేక దేశాల్లో రిలీజ్ అయింది.

ఈ కొత్త అప్‌డేట్ లేటెస్ట్ డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. యూరప్, దక్షిణ కొరియాలోని కొన్ని ప్రాంతాలలోని వినియోగదారులు ఇప్పటికే అప్‌డేట్‌ను అందుకున్నప్పటికీ, భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్, శాంసంగ్ Z ఫోల్డ్ 6, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 వంటి ఫోన్లలో ఇంకా కొత్త అప్‌డేట్ రాలేదు.

Read Also : Samsung Galaxy A55 5G : అమెజాన్‌లో ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

భారత్‌లో One UI 7 అప్‌డేట్ రిలీజ్ అవుతుందా? :
ఈ కొత్త One UI 7 అప్‌డేట్ ఏప్రిల్ 7న దక్షిణ కొరియాలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు యూరోపియన్ ప్రాంతాలకు విస్తరించింది. అమెరికా, కెనడాలోని వినియోగదారులు ఏప్రిల్ 10 నుంచి కొత్త అప్‌డేట్‌ను అందుకుంటున్నారు. భారత్ విషయానికొస్తే.. One UI 7 అప్‌డేట్ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది.

కానీ అన్ని శాంసంగ్ గెలాక్సీ S24, Z Fold 6, Z Flip 6 యూజర్లు ఇంకా ఈ కొత్త అప్‌డేట్ అందుకోలేదు. సాధారణంగా శాంసంగ్ దశలవారీగా అప్‌డేట్ రిలీజ్ చేస్తుంటుంది. మోడల్ నెంబర్స్, ప్రాంతాల ఆధారంగా బ్యాచ్‌లలో అప్‌డేట్ యూజర్లకు అందుతుంది. భారత్‌లో చాలా మంది వినియోగదారులు ఇప్పటికే అప్‌‌డేట్ రాకపోయినా, రాబోయే కొద్ది రోజుల్లో కొత్త అప్‌డేట్ అందుకోనే అవకాశం ఉంది.

వన్ UI 7 అప్‌డేట్ : సపోర్టు చేసే శాంసంగ్ ఫోన్లు ఇవే :
శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌లతో ఆగడం లేదు. వన్ UI 7 అప్‌డేట్ ఏప్రిల్ చివరి నాటికి గెలాక్సీ S23 సిరీస్, గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5 ఫోన్లలో కూడా రిలీజ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4, Z ఫ్లిప్ 4, గెలాక్సీ S23 FE, గెలాక్సీ S22, శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ వంటి పాత ప్రీమియం ఫోన్లలో కూడా మే నెలలో కొత్త అప్‌డేట్‌ అందుకునే అవకాశం ఉంది.

Galaxy S23 series
Galaxy Z Fold 5
Galaxy Z Flip 5
Galaxy Z Fold 4
Galaxy Z Flip 4
Galaxy S23 FE
Galaxy S22
Galaxy S21 series

వన్ UI 7 అప్‌డేట్ ఫీచర్లు ఏంటి? :
One UI 7 అప్‌డేట్ అనేక అప్‌గ్రేడ్స్ అందిస్తుంది. లైవ్ మీడియా నోటిఫికేషన్‌లు, కొత్త Now Bar ఇంటర్‌ఫేస్, ఈజీ మీడియా కాస్టింగ్, క్రాస్-డివైస్ సింకింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. ఇందులో ఆడియో ఎరేజర్, ఎడిటింగ్ ఆప్షన్లు వంటి కొత్త ఇమేజింగ్ టూల్స్ కూడా ఉన్నాయి.

Read Also : Android 16 Beta : బిగ్ అలర్ట్.. ఈ షావోమీ, వన్‌ప్లస్ ఫోన్లలో కొత్త ఆండ్రాయిడ్ 16బీటా రిలీజ్.. మీ ఫోన్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..!

హోమ్ స్క్రీన్ డిజైన్ పర్సనలైజడ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అదనపు కస్టమైజేషన్ ఫీచర్లతో రావచ్చు. మీకు ఇంకా అప్‌డేట్ అందకపోతే, అది త్వరలో రావచ్చు. మీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సెట్టింగ్స్ ఓసారి చెక్ చేయండి.