Samsung Galaxy A55 5G : అమెజాన్‌లో ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!
Samsung Galaxy A55 5G : శాంసంగ్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ మీకోసమే..

Samsung Galaxy A55 5G
Samsung Galaxy A55 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. సౌత్ కొరియన్ టెక్ కంపెనీ శాంసంగ్ నుంచి అనేక కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్లకు పోటీగా మార్కెట్లో శాంసంగ్ ఫోన్లకు గట్టి పోటీనిస్తున్నాయి. మీరు శాంసంగ్ అభిమాని అయితే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది.
ఇంతకీ ఈ శాంసంగ్ ఫోన్ ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసా? ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఫలితంగా శాంసంగ్ కొత్త ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో చూద్దాం..
శాంసంగ్ A55 5జీపై డిస్కౌంట్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB (ROM) ఆప్షన్ ధర రూ. 45,999కు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 24శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు తర్వాత శాంసంగ్ 5జీ ఫోన్ ధరను రూ. 34,795 వద్ద కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు రూ. 750 డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభించదు. కానీ, మీకు కావాలంటే నెలకు రూ. 1224 ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫీచర్లు :
ఈ శాంసంగ్ 5G ఫోన్ 6.6-అంగుళాల డిస్‌ప్లే ఫుల్-HD+ రిజల్యూషన్ కలిగి ఉంది. రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత OneUI 6.1పై రన్ అవుతుంది. ఈ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్, GPS, USB పోర్ట్ కూడా ఉన్నాయి.