Vivo V50e Vs Vivo V50 : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. ఈ రెండు వివో 5G ఫోన్లలో ఏది కొంటే బెటర్? మీ బడ్జెట్ ధరలో వచ్చేది ఇదే..!
Vivo V50e Vs Vivo V50 : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో V50e, వివో V50 5G రెండు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో ఏది బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం..

Vivo V50e Vs Vivo V50
Vivo V50e Vs Vivo V50 : వివో లవర్స్‌కు కోసం అద్భుతమైన 5G ఫోన్లు.. ఇటీవలే వివో 5G స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫోన్ తీసుకొచ్చింది. అదే.. V50e 5G మోడల్. ఈ వివో ఫోన్ ధర రూ. 28,999కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ వివో V50e కొత్త ఫోన్ వివో V50 5Gతో పోటీ పడుతోంది.
ఈ పాత మోడల్ ఫోన్ ధర రూ. 34,999గా ఉంది. ఈ రెండు ఫోన్‌లు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ కొద్దిపాటి తేడాలు ఉన్నాయి అంతే.. మీ బడ్జెట్‌ను బట్టి రెండింటిలో ఏదైనా వివో ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ రెండు ఫోన్లలో ఫీచర్లు పరంగా ఏది బెస్ట్? ఎందులో ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వివో V50e vs V50 డిజైన్, డిస్‌ప్లే :
వివో V50e 5G, వివో V50 5G ఫోన్లు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. ఈ రెండూ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తాయి. 1080 x 2392 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. కర్వడ్ స్క్రీన్‌లు డైమండ్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తాయి. HDR10 ప్లస్‌కి సపోర్టు ఇస్తాయి. పవర్‌ఫుల్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
కొలతలు, బరువు కూడా దగ్గరగా ఉన్నాయి. వివో V50e ఫోన్ 7.61mm మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. అయితే, వివో V50 ఫోన్ 7.4mm ఫ్రేమ్‌తో 189 గ్రాములు కొంచెం బరువుగా వస్తుంది. ఈ రెండూ పంచ్-హోల్ డిజైన్‌ను అందిస్తాయి. ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో వస్తాయి. IP68, IP69 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రిసెస్టెన్స్ అందిస్తాయి.
వివో V50e vs V50 పర్ఫార్మెన్స్ :
వివో V50 5జీ ఫోన్ 2.63GHz వద్ద ఆక్టా-కోర్ సీపీయూ, అడ్రినో 720 GPUతో పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ఉంది. మరోవైపు, వివో V50e 5జీలో 2.5GHz క్లాక్ స్పీడ్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్, మాలి-G615 MC2 జీపీయూ ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు ఫన్‌టచ్OS 15తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతాయి. 8జీబీ ర్యామ్ (వర్చువల్ ర్యామ్) విస్తరించుకోవచ్చు. 128GB UFS 2.2 స్టోరేజ్‌తో సపోర్టు ఇస్తాయి. ఈ రెండూ మైక్రో SD కార్డ్‌లతో స్టోరేజీ ఎక్స్‌పాండ్ చేయలేరు.
వివో V50e, V50 కెమెరాలు :
ZEISS-బ్రాండెడ్ ఆప్టిక్స్, అడ్వాన్స్ డ్యూయల్ రియర్ సెటప్ 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వివో V50 5G కెమెరాను కలిగి ఉంది. ZEISS పోర్ట్రెయిట్ ఎక్సలెన్స్, ఆస్ట్రో మోడ్, టైమ్‌లెస్ బోకె స్టైల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.
వివో V50e 5జీ ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ అందిస్తుంది. ఇప్పటికీ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, డ్యూయల్ వ్యూ, సూపర్‌మూన్ వంటి అడ్వాన్స్ మోడ్‌లకు సపోర్టు ఇస్తుంది. కానీ, ZEISS స్పెషల్ ఫీచర్లు మాత్రం లేవు. ఈ రెండు ఫోన్లలో ఫ్రంట్ సైడ్ కెమెరాలు ఒకేలా ఉంటాయి. 4K, 1080p వీడియో రికార్డింగ్, ఆటోఫోకస్, పంచ్-హోల్ ప్లేస్‌మెంట్‌తో కూడిన 50MP షూటర్ ఉన్నాయి.
వివో V50e, V50 బ్యాటరీ, ఛార్జింగ్ :
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. వివో V50e 5600mAh ప్యాక్‌తో పోలిస్తే.. వివో V50 ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, రెండూ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది.
వివో ఏ మోడల్ కొనాలి? :
ఫోటోగ్రఫీ, ఛార్జింగ్ పరంగా పరిశీలిస్తే.. వివో V50 5G ఫోన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ వివో 5జీ ఫోన్ ధర రూ.34,999 వద్ద కొనుగోలు చేయొచ్చు. మీ బడ్జెట్ రూ.30వేల లోపు అయితే మాత్రం వివో V50e 5G ఫోన్ తీసుకోవచ్చు.
ఈ ఫోన్ ఆకట్టుకునే స్పెషిఫికేషన్లతో పాటు పవర్‌ఫుల్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ వివో ఫోన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కెమెరాలు, చిప్‌సెట్ లేదా తక్కువ బడ్జెట్‌లో చూస్తున్నారా? అనేదానిపై ఆధారపడి ఉంటుంది.