iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ.1,44,900 నుంచి రూ.1,29,000కి తగ్గింది. అదనంగా రూ.7,500 HSBC బ్యాంక్ ఆఫర్‌తో పాటు కొనుగోలుదారులకు రూ.23వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.
2024లో లాంచ్ అయిన ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ (iPhone 16 Pro Max) భారత మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర తగ్గింపు పొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ప్రీమియం ఫోన్లలో ఒకటి. ఈ డిస్కౌంట్ విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఈఎంఐతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు.
కొత్త ధర, తగ్గింపు వివరాలివే :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ (1TB స్టోరేజ్) భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.1,84,900గా ఉండేది. విజయ్ సేల్స్ ఇప్పుడు అదే ఐఫోన్ ధరను రూ.1,72,500కి విక్రయిస్తోంది. నేరుగా రూ.12,400 (7 శాతం) తగ్గింపును అందిస్తోంది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో చెల్లించే కస్టమర్‌లు అదనంగా రూ.7,500 తగ్గింపును పొందవచ్చు. దాంతో మొత్తం సేవింగ్ రూ.19,000 కన్నా ఎక్కువగానే పొందవచ్చు. ఈ డీల్ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ ముఖ్య ఫీచర్లు :
ఐఫోన్ ప్రో మాక్స్ మోడళ్లపై డీల్స్ :
ఆపిల్ ఐఫోన్లలో ముఖ్యంగా ప్రో మాక్స్ మోడల్స్ అరుదుగా భారీ డిస్కౌంట్లతో లభిస్తాయి. ఐఫోన్ 16 ప్రో మాక్స్ పై రూ. 23వేలు సేవ్ చేయొచ్చు. ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక పర్ఫార్మెన్స్, రీసేల్ వాల్యూ ఉంటుంది.