Google Pixel 8a : భలే డిస్కౌంట్ భయ్యా.. రూ.53వేల గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ కేవలం రూ.13వేలకే.. ఇలా కొనేసుకోండి..!

Google Pixel 8a : మీ దగ్గర పాత ఐఫోన్ ఉందా? అయితే ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పాత ఐఫోన్ ఇచ్చి రూ. 53వేల విలువైన కొత్త గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ కేవలం రూ.13వేలకే సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 8a

Google Pixel 8a : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. అత్యంత ఖరీదైన గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఆకర్షణీయమైన కెమెరా కలిగిన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు ఇదే అద్భుతమైన అవకాశం. గూగుల్ స్మార్ట్‌ఫోన్లు సాధారణంగా ప్రీమియం ధరకు లభిస్తాయి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో కన్నా ఫీచర్లు హై రేంజ్‌లో ఉంటాయి. ఐఫోన్ ధర మాదిరిగానే ఉంటాయి. అలాంటి ప్రీమియం గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఇప్పుడు కేవలం రూ. 13వేలకే వస్తోంది. ప్రస్తుతం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్‌లను అందిస్తున్నాయి.

Read Also : China 10G Network : చైనాలో సూపర్ ఫాస్ట్ 10G నెట్‌వర్క్‌.. ప్రపంచంలోనే ఫస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. జస్ట్ సెకన్లలోనే 2 ఫుల్ మూవీలు డౌన్‌లోడ్ చేయొచ్చు..!

ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. ప్రస్తుతం, పిక్సెల్ 8a స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు సెల్ఫీలు లేదా ఫోటోగ్రఫీ కోసం మంచి ఫోన్ చూస్తుంటే.. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరకు పిక్సెల్ 8a కొనేసుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8a డిస్కౌంట్ :
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8a ధర రూ.52,999కు లిస్టు అయింది. కానీ, కస్టమర్లు 28 శాతం తగ్గింపును పొందవచ్చు. మీరు ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.37,999కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా, మీరు HDFC బ్యాంక్ కార్డ్‌తో EMI ద్వారా పేమెంట్ చేస్తే.. అదనంగా మరో రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు.

ఈ ఆఫర్ కేవలం 128GB వేరియంట్‌కు మాత్రమేనని గమనించాలి. అంతేకాదు.. ఈ పిక్సెల్ 8a స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.13వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇది ఎలా అంటారా? ఈ డీల్ పొందాలంటే.. మీరు కొన్ని కండిషన్స్ పాటించాలి.

ఫ్లిప్‌కార్ట్ రూ.36,830 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఉదాహరణకు.. మీ పాత ఐఫోన్ 13 మినీని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. మీరు రూ.22,380 వరకు సేవ్ చేసుకోవచ్చు. దాంతో 50వేల ఖరీదైన పిక్సెల్ 8a స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధర రూ.13వేలకే సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8ఎ స్పెసిఫికేషన్లు :
గత ఏడాది మేలో వచ్చిన గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై బాక్స్ వెలుపల నుంచి రన్ అవుతుంది.

Read Also : Buying Gold : బంగారం కొనాలంటే లక్షలకు లక్షలు అక్కర్లేదు.. జస్ట్ 100 రూపాయలతో కొనొచ్చు.. ఇలా చేయండి..!

పర్ఫార్మెన్స్ కోసం గూగుల్ టెన్సర్ G3 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీ నుంచి ఎంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ పరంగా పిక్సెల్ 8a 64MP మెయిన్ లెన్స్, 13MP సెకండరీ లెన్స్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది.