iQOO 12 Price : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఐక్యూ 12పై ఖతర్నాక్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!

iQOO 12 Price : అమెజాన్‌లో ఐక్యూ 12 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ లిమిటెడ్ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే.. ఐక్యూ 12 డీల్ ముగిసేలోగా కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iQOO 12 Price : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఐక్యూ 12పై ఖతర్నాక్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!

iQOO 12 price

Updated On : April 16, 2025 / 1:14 PM IST

iQOO 12 Price Drop : ఐక్యూ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు iQOO 12 భారీ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. గతంలో కన్నా చాలా చాలా సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఐక్యూ 12 ఫోన్ ధర రూ. 11వేలు తగ్గింది. పెద్దగా ఖర్చు లేకుండా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇదే బెస్ట్ టైమ్. ఈ డీల్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే.. ఈ డీల్ ముగిసేలోగా ఐక్యూ 12 ఫోన్ కొనేసుకోండి.

Read Also : Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. ఇంత మంచి డీల్ మళ్లీ రాదు..!

అమెజాన్‌లో ఐక్యూ 12 డీల్ :
భారత మార్కెట్లో ఐక్యూ 12 స్మార్ట్‌ఫోన్ రూ.52,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్ ఈ ఐక్యూ ఫోన్‌పై రూ.11వేలు ధర తగ్గింపును అందిస్తోంది. అంతేకాదు.. ఈ ఐక్యూ ఫోన్ ధర రూ.41,999కి తగ్గింది. మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.

ఐక్యూ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐక్యూ 12 ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, HDR10+ సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, ఐక్యూ 12 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో అమర్చి ఉంది. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ క్యూ1 గేమింగ్ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది.

Read Also : Google Pixel 9 Sale : పిక్సెల్ లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గిందోచ్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ జన్మలో రాదు..!

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐక్యూ 12 స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 64MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ వరకు అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.