IRCTC Refund Rules
IRCTC Refund Rules : పండుగ సీజన్‌లో రైలు టికెట్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది ప్రయాణికులు IRCTC యాప్ లేదా పోర్టల్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, కొన్నిసార్లు, అత్యవసర పరిస్థితుల్లో సెలవు లేకపోవడం, ప్రయాణ తేదీలను మార్చడం, వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్ ఉండటం లేదా రైలు రద్దు వంటి కారణాలతో చివరి నిమిషంలో టిక్కెట్లను రద్దు చేయాల్సి ఉంటుంది.
మీరు ప్రయాణించే రైలు ఆలస్యమైనా లేదా అందులో ఏసీ పనిచేయకపోవడం వంటి ఏదైనా కారణాలతో కూడా టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ప్రయాణికుడు టికెట్ క్యాన్సిల్ రీఫండ్‌కు సంబంధించిన రూల్స్ తప్పక అర్థం చేసుకోవాలి. టికెట్ రద్దు చేస్తే రీఫండ్ ఎంత వస్తుంది? ఎలా పొందాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టికెట్ క్యాన్సిల్ రూల్స్ ఏంటి? :
వెయిట్‌లిస్ట్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకుంటే.. రైల్వేలు ప్రతి ప్రయాణీకుడికి రూ. 20 జీఎస్టీని తిరిగి చెల్లిస్తాయి. అయితే, రైలు బయలుదేరిన 4 గంటలలోపు రద్దు చేయాలి. ప్రారంభ చార్ట్ తయారీ తర్వాత టికెట్ వెయిట్‌లిస్ట్ జాబితాలో ఉంటే.. ప్రయాణీకుడు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమాటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. పూర్తి రీఫండ్ ఎలాంటి డిస్కౌంట్లు లేకుండా అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది.
కన్ఫార్మ్ కానీ టిక్కెట్ల రద్దు రూల్స్ :
పార్టీ ఇ-టికెట్ లేదా ఫ్యామిలీ ఇ-టికెట్‌లోని కొంతమంది ప్రయాణీకులకు టిక్కెట్లు కన్ఫార్మ్ అయి ఉంటే మరికొందరు వెయిటింగ్ లిస్ట్‌లలో ఉంటే రూల్స్ భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితిలో టికెట్ రద్దు అయినా లేదా రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు TDR ఫైల్ చేయకపోతే.. కన్ఫార్మ్ అయిన ప్రయాణీకులకు పూర్తి ఛార్జీ రీఫండ్ కూడా లభిస్తుంది.
కానీ, ప్రతి ప్రయాణీకుడికి రూ. 20 + జీఎస్టీ రుసుము తొలగిస్తారు. మొదటి చార్ట్ తయారీ తర్వాత రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందు టికెట్ రద్దు అయితే.. కన్ఫార్మ్ ప్రయాణీకులకు ఎలాంటి తగ్గింపులు లేకుండా ఫుల్ రీఫండ్ లభిస్తుంది. ఫస్ట్ రిజర్వేషన్ చార్ట్ ఇప్పుడు రైలు బయల్దేరడానికి 8 గంటల ముందు రెడీ అవుతుంది.
రైలు షెడ్యూల్ చేసిన సమయం కన్నా 3 గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణీకుడు ప్రయాణించకపోతే.. పూర్తిగా లేదా పాక్షికంగా కన్ఫార్మ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులందరికీ ఎలాంటి ఛార్జీలు లేకుండా పూర్తి ఛార్జీని తిరిగి చెల్లిస్తారు.
మీరు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేయడం ద్వారా కూడా మీ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 139కు కాల్ చేయండి. ఈ నంబర్ మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అందించిన నంబర్ మాత్రమే ఉండాలి. ఆ తర్వాత IVR మెనూలో ‘ఆప్షన్ 4 టికెట్ క్యాన్సిలేషన్’ ఆప్షన్ ఎంచుకోండి. మీ PNR రైలు వివరాలను ఎంటర్ చేసి OTPతో క్యాన్సిల్ చేసుకోవచ్చు.
ప్రతి TDR క్లెయిమ్‌కు నిర్దిష్ట సమయ పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు.. మీ రైలు 3 గంటల కన్నా ఎక్కువ ఆలస్యమై, మీరు ప్రయాణించకపోతే ట్రైన్ బయలుదేరే సమయానికి ముందే TDRను ఫైల్ చేయాలి.
ఏయే సందర్భాల్లో టీడీఆర్ ఫైల్ చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1. రైలు 3 గంటలకు పైగా ఆలస్యంగా వచ్చి ప్రయాణీకుడు ప్రయాణించలేదంటే.. బోర్డింగ్ స్టేషన్ వద్ద రైలు బయలుదేరే సమయం వరకు
2. సరైన కోచ్ లేకపోవడం లేదా ఛార్జీలో తేడా (లోయర్ క్లాస్‌లో ప్రయాణం) – 2 రోజుల వరకు (సర్టిఫికెట్ జారీ చేసిన రోజు మినహా)
3. AC ఫెయిల్ – ప్రయాణీకుల డిస్టినేషన్ స్టేషన్‌కు చేరుకునే సమయం నుంచి 20 గంటలలోపు మాత్రమే టీడీఆర్ ఫైల్ చేయొచ్చు.
4. కన్ఫార్మ్ టికెట్ ప్రయాణీకులందరూ ప్రయాణించకపోవడం.. బోర్డింగ్ స్టేషన్‌లో షెడ్యూల్ ట్రైన్ 4 గంటల ముందు వరకు
5. రైలు మరో మార్గంలో వెళ్లడం.. ప్రయాణీకుడు ప్రయాణించకపోవడం.. బోర్డింగ్ స్టేషన్ వద్ద బయలుదేరే సమయం నుంచి 72 గంటల వరకు
6. రైలు దారి మళ్లింపు.. బోర్డింగ్ స్టేషన్ మీదుగా వెళ్లలేదు.. బోర్డింగ్ స్టేషన్ వద్ద బయలుదేరే సమయం నుంచి 72 గంటల వరకు
7. పార్టీ పాక్షికంగా కన్ఫార్మ్/వెయిట్‌లిస్ట్ & వెయిట్‌లిస్ట్ ప్రయాణీకులు ప్రయాణించకపోవడం.. డెస్టినేషన్ స్టేషన్‌కు చేరుకున్న 72 గంటల వరకు
8. పార్టీ పాక్షికంగా కన్ఫర్మ్/వెయిట్‌లిస్ట్, అందరు ప్రయాణీకులు ప్రయాణించకపోవడం.. బోర్డింగ్ స్టేషన్ వద్ద బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు
9. ప్రయాణీకుడు లోయర్ క్లాసులో జర్నీ, ఛార్జీలో వ్యత్యాసం ఉంటే.. 2 రోజుల వరకు (సర్టిఫికెట్ జారీ చేసిన రోజు మినహా)
10. పార్టీ పాక్షికంగా ప్రయాణం.. (పాక్షికంగా వాడిన టిక్కెట్‌పై రీఫండ్).. బోర్డింగ్ స్టేషన్ వద్ద బయలుదేరే సమయం నుంచి 72 గంటల వరకు
11. లోయర్ క్లాసులో రిజర్వేషన్ ప్రయాణించిన సందర్భాల్లో.. బోర్డింగ్ స్టేషన్ వద్ద ట్రైన్ బయలుదేరినప్పటి నుంచి 3 గంటలలోపు
12. కోచ్ దెబ్బతినడం వల్ల ప్రయాణించకపోవడం.. బోర్డింగ్ స్టేషన్ వద్ద అసలు బయలుదేరినప్పటి నుంచి 3 గంటలలోపు
13. గమ్యస్థానం చేరకముందే రైలు ఆగిపోవడం.. ప్రయాణీకుల గమ్యస్థానానికి షెడ్యూల్ చేసిన రాక నుంచి 72 గంటల వరకు