ITR Filing 2026 : రూ. 10 లక్షలకుపైగా కారు కొన్నారా? ITRలో TCS రీఫండ్ మిస్ అవ్వొద్దు! ఇలా క్లెయిమ్ చేయండి!

ITR Filing 2026 : కొత్త కారు రూ. 10లక్షలకు పైగా ఉంటే తప్పనిసరిగా ఒక శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ మొత్తంపై పన్ను తిరిగి పొందవచ్చు.. అది ఎలాగంటే?

ITR Filing 2026

  • కొత్త కారు కొనుగోలుపై చెల్లించిన ట్యాక్స్ తిరిగి పొందొచ్చు
  • రూ. 10 లక్షలకు పైగా కారు కొంటే టీసీఎస్ రీఫండ్ వస్తుందా?
  • కారు కొనుగోలుపై ఒక శాతం టీసీఎస్ తిరిగి ఎలా క్లెయిమ్ చేయాలి?

ITR Filing 2026 : రూ.10 లక్షలకుపైగా కొత్త కారు కొన్నారా? అయితే ఇది మీకోసమే.. మీరు చెల్లించిన ఒక శాతం టీసీఎస్ తిరిగి పొందవచ్చు తెలుసా? చాలామంది షోరూమ్‌లో కొత్త కారు కొనుగోలు చేశాక బిల్లు చూడగానే మరో ఒక శాతం టీసీఎస్ కూడా ఉండటం చూసి షాకవుతుంటారు.

అదనంగా టాక్స్ కట్టాలా? అని అని కంగారు పడిపోతుంటారు. చాలా మంది ఇలానే అనుకుంటారు. కానీ, ఇందులో అసలు ట్విస్ట్ ఉంది. మీరు కొత్త కారు (ITR Filing 2026) కొనుగోలు సమయంలో చెల్లించిన ఆ ఒక శాతం టీసీఎస్ అనేది ప్రభుత్వం దగ్గరే మీ పేరుతో ట్యాక్స్ క్రెడిట్‌గా రిజిస్టర్ అవుతుంది అనమాట. అంటే.. అది అదనపు పన్ను కాదని గమనించాలి.

ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ మొత్తాన్ని మీ ఆదాయపు పన్నులో అడ్జెస్ట్ చేసుకోవచ్చు. మీ ట్యాక్స్ బకాయి కూడా తగ్గుతుంది. ఒకవేళ మీరు చెల్లించిన టీసీఎస్ మీ పన్ను బకాయి కన్నా ఎక్కువైతే మిగిలిన మొత్తాన్ని రిఫండ్‌గా కూడా పొందవచ్చు. కానీ, చాలా మంది ఈ విషయం తెలియక వేల రూపాయల ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయకుండా వదిలేస్తుంటారు. మీరు కూడా రూ.10 లక్షలకుపైగా కొత్త కారు కొనుగోలు చేస్తే ఈ విషయం తప్పక తెలుసుకోండి.

ఒక శాతం టీసీఎస్ ఏంటి? :
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షలకు మించి కొత్త కారు కొనుగోలుపై డీలర్ కొనుగోలుదారుడి నుంచి 1శాతం టీసీఎస్ వసూలు చేయాలి.

కారు ఎక్స్-షోరూమ్ ధర : రూ.20 లక్షలు
1శాతం టీసీఎస్ : రూ.20,000
ఈ మొత్తాన్ని డీలర్ ఆదాయపు పన్ను శాఖకు డిపాజిట్ చేసి కొనుగోలుదారుడి పాన్ కార్డుకు లింక్ చేస్తారు.

టీసీఎస్ ఎందుకు వసూలు చేస్తారు? :

  • హై వాల్యూ కొనుగోళ్లను ట్రాక్ చేయడం
  • పన్ను చెల్లింపుదారుల వివరాలను రిజిస్టర్ చేయడం
  • పన్ను ఎగవేతను తగ్గించడం
  • టీసీఎస్ అనేది పర్మినెంట్ టాక్స్ కాదు.. ఆ తర్వాత ఐటీఆర్‌లో క్రెడిట్‌ అవుతుంది.

టీసీఎస్ ఎలా క్లెయిమ్ చేయాలి? :
టీసీఎస్ ఒకసారి క్రెడిట్ అయ్యాక అది మొత్తం ప్రాసెస్ ఫారమ్ 26AS అనేది యాన్యూవల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌‌మెంట్ (Annual Information Statement (AIS)లో కనిపిస్తుంది. ఐటీఆర్ దాఖలు సమయంలో ‘Taxes Paid’ సెక్షన్‌లో ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయాలి. ఆదాయపు పన్ను పోర్టల్ మీ ఫైనల్ టాక్స్ బకాయిని ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది.

అవసరమైన డాక్యుమెంట్లు :
టీసీఎస్ క్లెయిమ్ చేసేందుకు ఈ కింది డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలి.

  • కారు కొనుగోలు ఇన్వాయిస్ (టీసీఎస్ వివరాలతో)
  • ఫారమ్ 27D (డీలర్ జారీ చేసే టీసీఎస్ సర్టిఫికేట్)
  • కారు కొనుగోలు సమయంలో వాడిన పాన్ కార్డు
  • టీసీఎస్ క్రెడిట్ కనిపించే ఫారమ్ 26AS

ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఫారమ్ 26ASలో టీసీఎస్ క్రెడిట్ సరిగ్గా నమోదైందో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి.

Read Also : OnePlus Shut Down : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇక మార్కెట్లో OnePlus ఫోన్లు కనిపించవా..?

టీసీఎస్ ఎలా అడ్జెస్ట్ అవుతుంది? :

కారు ఎక్స్-షోరూమ్ ధర 1% TCS తుది ఆదాయపు పన్ను TCS సర్దుబాటు రిఫండ్ / చెల్లించాల్సిన పన్ను
రూ.12 లక్షలు రూ.12,000 రూ.20,000 రూ.12,000 సర్దుబాటు ఇంకా రూ.8,000 చెల్లించాలి
రూ.15 లక్షలు రూ.15,000 రూ.15,000 పూర్తి సర్దుబాటు రిఫండ్ లేదు, అదనపు పన్ను లేదు
రూ.20 లక్షలు రూ.20,000 రూ.8,000 రూ.8,000 సర్దుబాటు రూ.12,000 రిఫండ్
రూ.25 లక్షలు రూ.25,000 రూ.0 పన్ను లేదు పూర్తి రూ.25,000 రిఫండ్

పన్ను సర్దుబాటు :
కారు ధర : రూ.12 లక్షలు
టీసీఎస్ : రూ.12,000
మొత్తం ఆదాయపు పన్ను : రూ.20,000
రూ.20,000 – రూ.12,000 = రూ.8,000
అంటే చివరకు రూ.8వేలు మాత్రమే చెల్లించాలి.

పాక్షిక రిఫండ్ :
కారు ధర : రూ.20 లక్షలు
టీసీఎస్ : రూ.20,000
తుది పన్ను బకాయి : రూ.8,000
రూ.20,000 – రూ.8,000 = రూ.12,000 రిఫండ్

ఫుల్ రిఫండ్ :
కారు ధర : రూ.25 లక్షలు
టీసీఎస్ : రూ.25,000
ఆదాయపు పన్ను బకాయి : జీరో
రూ.25,000 – రూ.0 = రూ.25,000 ఫుల్ రిఫండ్

లెక్కలేంటి? :
టీసీఎస్ = కారు ఎక్స్-షోరూమ్ ధర × 1శాతం
రిఫండ్ = టీసీఎస్ – తుది ఆదాయపు పన్ను (టీసీఎస్ ఎక్కువైతే)
చెల్లించాల్సిన అదనపు పన్ను = తుది ఆదాయపు పన్ను – టీసీఎస్ (పన్ను బకాయి ఎక్కువైతే)

రీఫండ్ ఎప్పుడు వస్తుంది? :
రీఫండ్ అనేది మీ మొత్తం ఆదాయపు పన్ను బకాయిపైనా ఆధారపడి ఉంటుంది.

  • టీసీఎస్ పన్ను బకాయి ఎక్కువగా ఉంటే మిగిలిన మొత్తం రిఫండ్ వస్తుంది.
  • టీసీఎస్ పన్ను బకాయి తక్కువగా ఉంటే టీసీఎస్ అడ్జెస్ట్ చేసి మిగిలిన పన్ను మాత్రమే చెల్లించాలి.
  • పన్ను బకాయి అసలు లేకపోతే చెల్లించిన 100శాతం టీసీఎస్ రిఫండ్ పొందవచ్చు.

ఉదాహరణకు.. రూ.20 లక్షల కారు కొని రూ.20వేలు టీసీఎస్ చెల్లించారని అనుకుందాం. మీ తుది ఆదాయపు పన్ను రూ.8వేలు మాత్రమే అయితే.. రూ.8,000 పన్నుకు టీసీఎస్ అడ్జెట్ అవుతుంది. మిగిలిన రూ.12వేలకు మీ బ్యాంక్ ఖాతాలో రిఫండ్‌గా క్రెడిట్ అవుతుంది.

చాలామంది చేసే తప్పులివే :

  • పన్ను నిపుణుల ప్రకారం.. చాలా మంది ఈ క్రెడిట్‌ను కోల్పోవడానికి ప్రధాన కారణాలివే..
  • డీలర్ నుంచి ఫారమ్ 27D తీసుకోకపోవడం
  • ఫారమ్ 26ASలో టీసీఎస్ క్రెడిట్ రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేయకపోవడం
  • ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ‘Taxes Paid’ సెక్షన్‌లో టీసీఎస్ వివరాలను నమోదు చేయకపోవడం

టీసీఎస్ అనేది మీ పాన్ కార్డుతో ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లో ఉంటుంది. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఫారమ్ 26ASను ఒకసారి పరిశీలిస్తే.. మీకు రావాల్సిన ట్యాక్స్ క్రెడిట్ లేదా రిఫండ్‌ను ఈజీగా పొందవచ్చు.