Janmashtami 2024 _ Banks To Remain Closed On August 26 In These States ( Image Source : Google )
Janmashtami 2024 : ఈ సంవత్సరంలో జన్మాష్టమి పండుగ ఆగస్టు 26న (సోమవారం) వస్తుంది. జన్మాష్టమిని శ్రీకృష్ణభగవానుని భక్తులు అత్యంత ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలిచే రోజు. శ్రీకృష్ణుని జన్మని సూచిస్తుంది. విష్ణువు ఎనిమిదవ అవతారంగా నమ్ముతారు. భారత్ అంతటా విష్ణువుని పూజిస్తుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి తమ కుటుంబ సౌభాగ్యాల కోసం దీవెనలు కోరుకుంటారు.
Read Also : NEET UG 2024 Counselling : నీట్ యూజీ కౌన్సెలింగ్ రిజల్ట్స్ ఎప్పుడంటే? ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..!
ఈ సంవత్సరం పండుగ ఆగస్టు 26న సోమవారం వస్తుంది. ఇప్పుడు జన్మాష్టమికి మరికొద్ది రోజులే ఉండడంతో పండుగ రోజున అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులు బంద్ చేస్తారా అని భావిస్తున్నారు. అయితే, అన్ని చోట్లా బ్యాంకులు మూతపడవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. సోమవారం సెలవుదినాన్ని పాటించే నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండూ పనిచేయవు. జన్మాష్టమి 2024 సందర్భంగా మూసివేసే బ్యాంకుల పూర్తి జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
మీరు మీ బ్యాంక్ సంబంధిత పనిని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకు శాఖలు మూసివేయబడినప్పటికీ సెలవు సమయంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సౌకర్యాలు ప్రభావితం కావు. జన్మాష్టమి శ్రీకృష్ణుని జన్మ దినం. భాద్రపద మాసంలో (అష్టమి) 8వ రోజున జరుపుకుంటారు. సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వస్తుంది.