Amazon CEO Jeff Bezos : జూలై 5న అమెజాన్ సీఈఓ పదవికి జెఫ్ బెజోస్ గుడ్‌బై.. కొత్త సీఈఓ ఎవరంటే?

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే జూలై 5న ఆయన సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగనున్నారు.

Amazon CEO Jeff Bezos : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే జూలై 5న ఆయన సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగనున్నారు. ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈఓగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1994లో అదే తేదీన సరిగ్గా 27 ఏళ్ల క్రితం అమెజాన్ విలీనం అయ్యిందని అమెజాన్ వాటాదారుల సమావేశంలో బెజోస్ వివరించారు.

ఫిబ్రవరిలో బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సీటెల్‌కు చెందిన అమెజాన్.కామ్ ఇంక్ ప్రకటించింది. కానీ, నిర్దిష్ట తేదీని వెల్లడించలేదు. జెఫ్ స్థానంలో ఉన్న జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్-కంప్యూటింగ్ బిజినెస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదవి నుంచి తప్పుకున్న అనంతరం బెజోస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. జెఫ్ బెజోస్ ఇంటర్నెట్‌తో పుస్తకాలను అమ్మడం ద్వారా అమెజాన్‌ సంస్థను జెఫ్ బెజోస్ ప్రారంభించారు. జూలై 5 బెజోస్‌కు చాలా సెంటిమెంట్. అందుకే అదే రోజున సీఈఓ పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు.

అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. 57ఏళ్ల బెజోస్ వ్యక్తిగత సంపాదన 167 బిలియన్ డాలర్లు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కొత్త ఉత్పత్తులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. రాకెట్ షిప్ కంపెనీ బ్లూ ఆరిజిన్, వార్తాపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ వంటి ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టాలని బెజోస్ యోచిస్తున్నారు. మరోవైపు అమెజాన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులో మరిన్ని షోలు, సినిమా కంటెంట్ కోసం హాలీవుడ్ స్టూడియో ఎంజిఎమ్‌ను 45 8.45 బిలియన్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ఆండీ జెస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో జెస్సీ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధినేతగా ఉన్న జెస్సీ.. జులై 5న అమెజాన్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు