Jio AI Jobs AI Impact Summit 2026 ( Image Credit : AI )
AI Impact Summit 2026 : మీకు ఏఐపై పట్టు ఉందా? ఏఐకి సంబంధించి ఎలాంటి పనైనా చేయగలరా? మీకు ఏఐ స్కిల్స్ ఉంటే మీకు జాబ్ పక్కా వచ్చినట్టే.. ఏఐ స్కిల్స్ ఉన్న టెక్ ఇంజనీర్ల కోసం రిలయన్స్ జియో వెతుకుతోంది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ఏఐపై మంచి పట్టు ఉన్న ఇంజనీర్ల కోసం అన్వేస్తున్నట్టు ఆ సంస్థ చీఫ్ ఏఐ సైంటెస్ట్ గౌరవ్ అగర్వాల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు.
అడ్వాన్స్ ఏఐ మోడల్స్, ఆప్టిమైజేషన్, ప్లాట్‌ఫామ్-లెవల్ ఆవిష్కరణలపై పనిచేసే డెవలపర్లు తనను నేరుగా సంప్రదించవచ్చని గౌరవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన ప్రకారం.. అర్హత కలిగిన ఏఐ ఇంజనీర్లకు నియామక బృందంలో వెంటనే జాబ్ ఇచ్చి తీసుకుంటామని చెప్పారు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అగర్వాల్ పోస్ట్ చేస్తూ.. తమ ఏఐ బృందం ఈ వారమంతా ఈ ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఉంటామని తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన డెవలపర్‌లు కావాలని, టెక్ కమ్యూనిటీలో టాలెంట్ ఉన్న ‘క్రాక్డ్ ఇంజనీర్స్’ ఎవరు ఉన్నా వచ్చి తనతో మాట్లాడొచ్చనని తెలిపారు.
To the cracked engineers at the summit: if you’re building at the frontier of AI models, optimization, or platforms, we need you.
Reach out and I’ll fast-track an intro to our recruitment team. Let’s build for Bharath, at a scale only we know! https://t.co/XdVJk4lqe2
— Gaurav Aggarwal (@fooobar) February 15, 2026
ఏఐ మీద ఎవరైనా వర్క్ చేస్తుంటే జియో బృందం వారితో మాట్లాడేందుకు రెడీగా ఉందని అన్నారు. ప్రత్యేకించి ఫ్రంట్ ఇయర్ లెవల్ ఏఐ డెవలపర్లకు ఆయన స్పెషల్ వెల్‌కమ్ చెప్పారు.
ఏఐ వ్యూహంలో రిలయన్స్ బిగ్ ప్లాన్ :
రిలయన్స్ ఏఐ వ్యూహంలో భాగంగా ముఖేష్ అంబానీ నాయకత్వంలో దూసుకుపోతోంది. కంపెనీ కొంతకాలంగా ఏఐ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున అప్లికేషన్లలో పెట్టుబడులను పెడుతోంది. దేశానికి సరిపడా స్కేల్‌గా AI మోడల్స్, ప్లాట్‌ఫామ్‌లను డెవలప్ చేయడంపై జియో దృష్టిసారించింది.
గవర్నమెంట్, కన్స్యూమర్లు, బిజినెస్ కోసం లార్జ్ స్కేల్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లు తీసుకురానుంది. రిలయన్స్ లాంగ్ టర్మ్ ఏఐ రోడ్‌మ్యాప్ కోసం ఇప్పటినుంచే ఇన్-హౌస్ ఏఐ రీసెర్చ్ స్ట్రాంగ్ ఉండాలని భావిస్తోంది.
రిలయన్స్ 2025లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. ఎంటర్‌ప్రైజ్, వినియోగదారుల కోసం లోకల్ లాంగ్వేజీల్లో ఏఐ సేవలను అందించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను గూగుల్ క్లౌడ్, మెటా, NVIDIA భాగస్వామ్యంతో ప్రకటించింది. ఇందులో బ్లాక్‌వెల్ ఏఐ ప్రాసెసర్‌లు, GH200 గ్రేస్ హాప్పర్ సూపర్‌చిప్‌లతో రన్ అయ్యే సూపర్ కంప్యూటర్‌లను నిర్మించడంతో పాటు రన్ చేయడం వంటివి ఉన్నాయి.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 :
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గ్లోబల్ సౌత్‌లో జరిగే ప్రధాన ఏఐ ఈవెంట్‌లలో ఒకటి. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి అగ్ర నాయకులు, మంత్రులు, టెక్ కంపెనీల అధిపతులు హాజరవుతున్నారు.
ఈ సమ్మిట్‌కు సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్, బిల్ గేట్స్, టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ వంటి టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నాయకులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా కూడా పాల్గొంటున్నారు.