JioTV Pro Pack : జియో మరో సంచలనం.. రూ.55కే 1,000కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

JioTV Pro Pack : టెలికాం దిగ్గజం రియలన్స్ జియో వినియోగదారులకోసం మరో బడ్జెట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

JioTV Pro Pack

JioTV Pro Pack : టెలికాం దిగ్గజం రియలన్స్ జియో వినియోగదారులకోసం మరో బడ్జెట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.55తో జియో టీవీ ప్రో ప్యాక్ (JioTV Pro Pack) పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్‌లోని జియో టీవీ యాప్ ద్వారా వెయ్యికిపైగా లైవ్ టీవీ ఛానెనల్స్ ను వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ కు 30రోజులు వ్యాలిడిటీ ఉంటుంది.

Also Read : US Iran War Updates : ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌పై అమెరికా సైన్యం భీకర దాడులు.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన టెహ్రాన్

16కుపైగా భాషల్లో ప్రసారమయ్యే ఛానెల్స్ తోపాటు 150కుపైగా ప్రీమియం ఛానెల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. స్టార్ ప్లస్ హెడ్, కలర్స్ హెడ్, సోనీ ఎంటర్‌టైన్మెంట్ టెలివిజన్ హెడ్‌డీ, యానిమల్ ప్లాంట్ వంటి ప్రముఖ ఛానెల్స్ ను ఈ ప్లాన్ ద్వారా వీక్షించొచ్చు. అదేవిధంగా జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖవంటి ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ల ఛానెల్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే, జియోస్టార్, సోనీకు చెందిన లైవ్ స్పోర్ట్స్ ఛానెల్స్ మాత్రం ఈ ప్లాన్ లో ఉండవని జియో స్పష్టం చేసింది.

ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్, మొబైల్ డేటా, SMS వంటి టెలికాం ప్రయోజనాలు ఉండవు. ఇది పూర్తిగా టీవీ వినోదాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రత్యేక రీచార్జ్ ప్యాక్ అని జియో పేర్కొంది. రూ.55తో రీచార్జ్ చేసిన తరువాత ప్రత్యేకంగా యాక్టివేషన్ చేయాల్సిన అవసరం లేదు. జియో టీవీ యాప్‌లో జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే, వెంటనే ప్రీమియం చానెల్స్ చూడొచ్చునని జియో పేర్కొంది.

ఈ ప్లాన్‌ను ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులిద్దరూ ఉపయోగించుకోవచ్చు. ఒక మొబైల్ డివైస్‌లో మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. అవసరమైతే వినియోగదారులు ఈ ప్లాన్‌ను పలుమార్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుత వ్యాలిడిటీ ముగిసిన తర్వాత తదుపరి సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తుంది.