Voiceతోనే టైపింగ్ : వచ్చే ఐదేళ్లలో Keyboards ఉండవు

కీ బోర్డు.. ఇన్ పుట్ డివైజ్ ? Output డివైజ్ అంటే.. కంప్యూటర్ స్టూడెంట్ అయితే.. వెంటనే ఇన్ పుట్ డివైజ్ అని సమాధానం చెబుతాడు.

  • Publish Date - April 19, 2019 / 11:05 AM IST

కీ బోర్డు.. ఇన్ పుట్ డివైజ్ ? Output డివైజ్ అంటే.. కంప్యూటర్ స్టూడెంట్ అయితే.. వెంటనే ఇన్ పుట్ డివైజ్ అని సమాధానం చెబుతాడు.

కీ బోర్డు.. Input డివైజ్ ? లేదా Output డివైజ్ ? అంటే.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లూ వెంటనే.. Input డివైజ్ అని టక్కున సమాధానం చెబుతారు. ప్రతి ఇంట్లో, ఆఫీసుల్లో కంప్యూటర్ ఉందంటే.. కచ్చితంగా కీ బోర్డు ఉండాల్సిందే. కంప్యూటర్ లో ఏదైనా టైప్ చేయాలన్నా తప్పనిసరిగా కీబోర్డు కావాలి. లేదంటే టైప్ చేయడం కష్టం. ల్యాప్ టాప్స్ కూడా ఇన్ బుల్డ్ కీబోర్డులు ఉన్నప్పటికీ, ఎక్స్ ట్రనల్ యూఎస్ బీ, వైర్ లెస్ కీబోర్డులు కూడా వచ్చేశాయి. కాసేపు కీబోర్డు పనిచేయకపోతే.. వర్క్ ఆగిపోతుంది. పేజీలు పేజీలు డేటా టైప్ చేయాలంటే కీబోర్డు ఎంతో అవసరం. అలాంటి కీబోర్డులు భవిష్యత్తులో అంతరించి పోనున్నాయి.
Also Read : TikTok బ్యాన్ : ఇండియాలో 100 కోట్ల పెట్టుబడికి మరో ప్లాన్

భవిష్యత్తులో కీబోర్డు లేకపోయినా టైప్ చేయొచ్చు అంటున్నారు టెక్ నిపుణులు. రానున్న ఐదేళ్లలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అదే.. వాయిస్ ఎనేబుల్డ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. కీబోర్డులకు కాలం చెల్లినట్టే. ఈ టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ప్లాన్ చేస్తున్నారు. ‘ఈ రోజు నేనొకటి స్పష్టంగా చెప్పగలను. వచ్చే ఐదేళ్లలో ఇన్ పుట్ డివైజ్.. కీబోర్డు అంతరించిపోవడం తథ్యం’ అని మ్యాంగ్రోవ్ క్యాపిటల్ పార్టనర్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ టల్సాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

వాయిస్ ఎనేబుల్డ్ టెక్నాలజీ కోసం ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కంపెనీల్లో కంప్యూటర్లకు Voice Enabled Technology అందుబాటులోకి వస్తే యూజర్ ఎక్స్ పీరియన్స్ మార్పు వస్తుందన్నారు. కీబోర్డులకు బదులుగా వాయిస్ టెక్నాలజీని రూపొందించడం తమ సంస్థకు సవాల్ గా మార్క్ తెలిపారు. మ్యాంగ్రోవ్ కంపెనీతో మొదలై చాలా కంపెనీల్లో వాయిస్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని అన్నారు. దశాబ్దానికి వాయిస్ ఒక అవకాశం లాంటిది. నేనొక ఆశావాదిని. ఒక ఆశావాదిగా ఇది సబబుగా భావిస్తాను’ అని చెప్పారు. 
Also Read : చెక్ చేశారా? : ఇన్ స్టాగ్రామ్‌లో.. మీ Likes కనిపించవు

ఇప్పటికే స్కైప్ వంటి టెలికమ్యనికేషన్ సంస్థల్లో వాయిస్ ఎనేబుల్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ స్కైప్ యాప్ ను మైక్రోసాఫ్ట్ 2011లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2013లో wix.com అందుబాటులోకి రాగా, ఇందులో కూడా వాయిస్ టెక్నాలజీ ఉంది. ఇప్పటికే వాయిస్ కంట్రోల్డ్ టెక్నాలజీ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థతో పాటు Alexaలో కూడా వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ ఉంది. గూగుల్ అందించే Echo డివైజ్ లైన గూగుల్ అసిస్టెంట్, హోం యాప్ ల్లో కూడా వాయిస్ టెక్నాలజీ ఉంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు కూడా సొంత వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.

టెక్ రీసెర్చ్ సంస్థ జునిపర్ రీసెర్చ్ ప్రకారం.. 2018 ఏడాది పూర్తయ్యేనాటికి వాయిస్ బేసిడ్ డివైజ్ లు వాడే వినియోగదారులు 2.5 బిలియన్ల డిజిటల్ అసిస్టెంట్స్ టెక్నాలజీని వాడారు. 2023 నాటికి డిజిటల్ అసిసెంట్ల టెక్నాలజీ వాడకం 8 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో వాయిస్ ఎనేబుల్డ్ టెక్నాలజీ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల తర్వాత కీబోర్డుపై టైప్ చేయాల్సిన పనిలేదు. వాయిస్ ద్వారానే స్ర్కీన్ పై చక్కగా టైప్ చేసుకోవచ్చు అనమాట. 
Also Read : ఫేస్‌బుక్‌.. ప్రైవసీ ఇదేనా? : 15 లక్షల యూజర్ల ‘ఈమెయిల్స్’ ఇంపోర్ట్