Kia EV9 Electric SUV : అత్యాధునిక ఫీచర్లతో కియా EV9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసిందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 561కి.మీ రేంజ్, ధర ఎంతంటే?

Kia EV9 Electric SUV Launch : మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఈ, బీఎండబ్ల్యూ ఐఎక్స్‌కు పోటీగా కియా ఈవీ9 మోడల్ కారు వచ్చేసింది. అత్యంత ఖరీదైన ఈ కారు ఇప్పటివరకు మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కార్లలో అత్యంత అడ్వాన్స్‌డ్ మోడల్ ఇదే..

Kia EV9 Luxury electric SUV launched in India at Rs 1.30 crore

Kia EV9 Electric SUV Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి కియా ఇండియా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. ఇదే కంపెనీ నుంచి కార్నివాల్ లగ్జరీ ఎంపీవీ మోడల్ లాంచ్ చేసిన కంపెనీ, మరో ఈవీ9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసింది. ఈ కారు పూర్తిగా ఇంటర్నల్ (CBU) అవతార్‌తో దేశంలోకి ప్రవేశిస్తున్న కియా ఈవీ9గా కంపెనీ చెబుతోంది.

Read Also : Google for India 2024 : గూగుల్ జెమినీ లైవ్.. ఇకపై హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లోకి..!

మెర్సిడెస్-బెంజ్ ఈక్యూఈ, బీఎండబ్ల్యూ ఐఎక్స్‌కు పోటీగా వస్తుంది. కియా ఈవీ9 మోడల్ కారు అత్యంత ఖరీదైనది. ఈ కార్‌మేకర్ ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత అడ్వాన్స్‌డ్ కారు కూడా ఇదే. భారత మార్కెట్లో ఒకే, ఫుల్ లోడ్ అయిన జీటీ లైన్ ట్రిమ్‌లో ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ. 1.30 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈవీ6 తర్వాత దేశంలో కియా రెండో ఎలక్ట్రిక్ కారుగా ఈవీ9ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.

ఫుల్ ఛార్జ్‌పై 561కి.మీ పరిధి :
కియా ఈవీ9 ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP)పై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫారమ్ భవిష్యత్తులో భారత మార్కెట్లో హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) సపోర్టు అందిస్తుంది. భారతీయ మార్కెట్ కోసం కియా 384పీఎస్ పవర్ అవుట్‌పుట్, 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో డ్యూయల్-మోటార్ అమరికతో ఈవీ9 ఆల్-వీల్-డ్రైవ్ (AWD)ని ఎంచుకుంది.

గంటకు 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.3 సెకన్లలో చేరుకోగలదు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌పై 561కిలోమీటర్ల (ARAI) క్లెయిమ్ పరిధిని కలిగి ఉంది. 350kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని కేవలం 24 నిమిషాల్లో 10 శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

కియా ఈవీ9 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
కియా ఈవీ9 కారు 5,015ఎమ్ఎమ్ పొడవు, 1,980ఎమ్ఎమ్ వెడల్పు, 1,780ఎమ్ఎమ్ ఎత్తు రూఫ్ ట్రాకులతో వస్తుంది. 3,100ఎమ్ఎమ్ పొడవైన వీల్‌బేస్, 198ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. క్యాబిన్‌లో 6-సీటర్ (2+2+2) కాన్ఫిగరేషన్ ఉంది. డిజిటల్ ప్యాటర్న్ లైటింగ్ గ్రిల్, ‘ఐస్ క్యూబ్’ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ‘స్టార్‌మ్యాప్’ డీఆర్ఎల్ ఆటోమేటిక్ బాడీ కలర్డ్ ఎక్స్‌టీరియర్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ‘స్టార్‌మ్యాప్’ ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్ వంటి ఫీచర్లను కలిగిన జీటీ-లైన్ వెర్షన్‌పై ఈవీ9 ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ ఆధారపడి ఉంటుంది.

ఎల్ఈడీ బ్యాక్ ఫాగ్ ల్యాంప్స్, హైడ్ బ్యాక్ వైపర్, హీటింగ్, మెమరీ ఫంక్షన్‌లతో బ్లాక్ ఓఆర్‌వీఎమ్, 20-అంగుళాల క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కారులో స్నో వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్, పాంటెరా మెటల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే అనే ఐదు ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ఈవీ9 క్యాబిన్ డ్యూయల్-టోన్ బ్రౌన్, బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. మెమరీ ఫంక్షన్‌తో 18-వే పవర్ డ్రైవర్ సీట్, 12-వే ఫ్రంట్ ప్యాసింజర్ పవర్ సీట్, 8-వే పవర్ అడ్జస్ట్‌తో రెండో వరుస కెప్టెన్ సీట్లు, రెండో వరుస మసాజ్ సీట్లు, ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

6-అంగుళాల (HVAC) కంట్రోల్స్ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ నావిగేషన్), హైడ్ హాప్టిక్ టచ్‌స్క్రీన్ బటన్‌లు, 14 స్పీకర్‌లతో మెరిడియన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, 64 డ్యూయల్-కలర్ యాంబియంట్ మూడ్ లైటింగ్, డిజిటల్ IRVM, డ్యూయల్ సన్‌రూఫ్, నెక్స్ట్-జెన్ కియా కనెక్ట్ 10కి పైగా ఫీచర్లు ఉన్నాయి. చాలా లగ్జరీ ఈవీల మాదిరిగానే ఈవీ9 కూడా వెహికల్-టు-లోడ్ (V2L) సామర్థ్యాన్ని కలిగి ఉంది. నెక్స్ట్-జెన్ డిజిటల్ కీ 2.0తో వస్తుంది.

సెక్యూరిటీ ఫీచర్లు :
ఫీచర్ల పరంగా , ఈవీ9కి 10 ఎయిర్‌బ్యాగ్‌లు, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, మల్టీ-కొలిజన్ బ్రేక్, బ్రేక్ అసిస్టెంట్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, పార్కింగ్ సెన్సార్లు (ఫ్రంట్, సైడ్, బ్యాక్ ) ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. 27 కన్నా ఎక్కువ యాక్టివిటీలతో లెవల్ 2 అడాస్ ఉంది. ఈవీ9 ఎన్‌సీఏపీ, యూరో ఎన్‌సీఏపీలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

Read Also : Mahindra Thar Roxx : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా థార్ రోక్స్ కారు చూశారా? కేవలం గంటలోనే లక్ష 76వేల 218 బుకింగ్స్..!