Mahindra Thar Roxx : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా థార్ రోక్స్ కారు చూశారా? కేవలం గంటలోనే లక్ష 76వేల 218 బుకింగ్స్..!
Mahindra Thar Roxx Bookings : దసరా పండుగ సందర్భంగా ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు మహీంద్రా డీలర్‌షిప్, మహీంద్రా వెబ్‌సైట్ ద్వారా రూ. 21వేల టోకెన్ మొత్తానికి థార్ రోక్స్‌ను బుక్ చేసుకోవచ్చు.

Mahindra Thar Roxx garners 176,218 bookings in 60 minutes
Mahindra Thar Roxx Bookings : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త మోడల్ థార్ రోక్స్ కారుకు సంబంధించి అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు బుకింగ్‌లు ప్రారంభించింది. కేవలం 60 నిమిషాల్లోనే కొత్త మహీంద్రా థార్ రోక్స్ 176,218 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది.
Read Also : Kia Carnival Luxury : కొత్త కియా కార్నివల్ లగ్జరీ కారు ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతంటే?
దసరా పండుగ సందర్భంగా ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు అన్ని అధీకృత మహీంద్రా డీలర్‌షిప్‌ల వద్ద మహీంద్రా వెబ్‌సైట్ ద్వారా రూ. 21వేల టోకెన్ మొత్తానికి థార్ రోక్స్‌ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ప్రారంభమైనప్పుడు కంపెనీ కస్టమర్‌లకు వారి తాత్కాలిక డెలివరీ షెడ్యూల్‌ల గురించి తదుపరి మూడు వారాల్లో దశలవారీగా తెలియజేస్తుంది.
థార్ రోక్స్ మొత్తం 6 వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో MX1, MX3, AX3L, MX5, AX5L, AX7L ఉండగా, మరో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. జీ20 టీజీడీఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్, డీ22mHawk డీజిల్. అయితే, పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీతో 162పీఎస్, 330ఎన్ఎమ్, 6-స్పీడ్ ఏటీతో 177పీఎస్ 380ఎన్ఎమ్ అభివృద్ధి చేస్తుంది. డీజిల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఎటీతో 152పీఎస్ 330ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. మరింత పవర్‌ఫుల్ డీజిల్ వెర్షన్ (175పీఎస్ 370ఎన్ఎమ్) 6-స్పీడ్ ఎటీతో కూడా పొందవచ్చు.
అలాగే, థార్ రోక్స్ పెట్రోల్‌లో ఆర్‌డబ్ల్యుడీ మాత్రమే ఉంది. అయితే, థార్ రోక్స్ డీజిల్‌లో ఆర్‌డబ్ల్యుడీ, 4డబ్ల్యుడీ (4ఎక్స్‌పీఎల్‌ఓఆర్) ఆప్షన్లు ఉన్నాయి. వేరియంట్ వారీగా మహీంద్రా థార్ రోక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
- MX1 ఆర్‌డబ్ల్యూడీ పెట్రోల్ ఎంటీ – రూ. 12.99 లక్షలు
- MX1 ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 13.99 లక్షలు
- MX3 ఆర్‌డబ్ల్యూడీ పెట్రోల్ ఎటీ – రూ. 14.99 లక్షలు
- MX3 ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 15.99 లక్షలు
- AX3L ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 16.99 లక్షలు
- MX5 ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 16.99 లక్షలు
- AX5L ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎటీ – రూ. 18.99 లక్షలు
- AX7L ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 18.99 లక్షలు
- AX7L ఆర్‌డబ్ల్యూడీ పెట్రోల్ ఎటీ – రూ. 19.99 లక్షలు
- AX7L ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ ఎటీ – రూ. 20.49 లక్షలు
- MX5 4డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 18.79 లక్షలు
- AX7L 4డబ్ల్యూడీ డీజిల్ ఎంటీ – రూ. 20.99 లక్షలు
- AX5L 4డబ్ల్యూడీ డీజిల్ ఎటీ – రూ. 20.99 లక్షలు
- AX7L 4డబ్ల్యూడీ డీజిల్ ఎటీ – రూ. 22.49 లక్షలు
డ్యూయల్-టోన్ ఐవరీ-బ్లాక్ ఇంటీరియర్స్ కలిగిన వేరియంట్‌ల కోసం డెలివరీలు ఈ దసరా (అక్టోబర్ 12) నుంచి ప్రారంభమవుతాయి. మోచా బ్రౌన్ ఇంటీరియర్‌లతో కూడిన వేరియంట్‌ల కోసం జనవరి 2025 చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయి.
Read Also : Google for India 2024 : గూగుల్ జెమినీ లైవ్.. ఇకపై హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లోకి..!