Kia Carnival Luxury : కొత్త కియా కార్నివల్ లగ్జరీ కారు ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతంటే?
Kia Carnival Luxury : ఈ లగ్జరీ కారును రూ. 63.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కంపెనీ లాంచ్ చేసింది. కొత్త కార్నివాల్ బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే 1,822 ప్రీ-ఆర్డర్‌లు వచ్చాయి.

Kia Carnival Luxury MPV launched in India at Rs 63.90 lakh
Kia Carnival Luxury : కొత్త కారు కొంటున్నారా? భారత మార్కెట్లోకి ప్రముఖ కియా ఇండియా నుంచి కొత్త కియా కార్నివాల్ లగ్జరీ ఎమ్‌పీవీ వచ్చేసింది. ఈ లగ్జరీ కారును రూ. 63.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కంపెనీ లాంచ్ చేసింది. వాహనం సెమీ-నాక్డ్-డౌన్ (SKD) అవతార్‌లో పూర్తిగా లోడ్ అయిన లిమోసిన్ ప్లస్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
Read Also : Apple Free Earphones : ఆపిల్ పండుగ ఆఫర్.. కొత్త ఐఫోన్ కొంటే ఫ్రీగా ఇయర్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు!
ప్రస్తుతం ఈ కియా లగ్జరీ కార్నివల్‌కు ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేరనే చెప్పాలి. భారత్‌లో కార్నివాల్‌లో ఇది రెండో ఇన్నింగ్స్. గత ఫిబ్రవరి 2020లో భారత మార్కెట్లోకి మొదటి కార్నివల్ మోడల్ లాంచ్ అయింది. గత మూడేళ్లలో 14,542 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. పాత కార్నివాల్ మొదటి రోజు 1,410 బుకింగ్‌లను పొందగా, కొత్త కార్నివాల్‌కి బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే 1,822 ప్రీ-ఆర్డర్‌లు వచ్చాయి.
లగ్జరీ కార్నివల్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
కార్నివాల్ కారు మధ్యలో స్మార్ట్‌స్ట్రీమ్ 2.2-లీటర్ ఇన్-లైన్ 4-సిలిండర్ ఇ-వీజీటీ సీఆర్‌డీఐ ఇంజన్ ఉంది. గరిష్టంగా 193పీఎస్ పవర్, 441ఎన్ఎమ్ పీక్ ట్విస్టింగ్ ఫోర్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్, స్మార్ట్ అనే నాలుగు డ్రైవ్ మోడ్‌ల మధ్య ఎంచుకోవచ్చు. కార్నివాల్ మోడల్ కారు 5,155mm పొడవు, 1,995mm వెడల్పు, 1,775ఎమ్ఎమ్ టాల్ రూఫ్, 3,090ఎమ్ఎమ్ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
క్యాబిన్ లోపల 7-సీటర్ (2+2+3) లేఅవుట్ ఉంది. కార్నివాల్ చాలా పెద్దది అయినప్పటికీ, చాలా పదునైన డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ బ్లాక్, క్రోమ్ కలర్లలో కియా ‘టైగర్ నోస్’ గ్రిల్, ‘ఐస్ క్యూబ్’ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, స్టార్‌మ్యాప్ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఎల్ఈడీ కాంబినేషన్ ల్యాంప్స్ ఉన్నాయి. వెనుకవైపు హైడింగ్ వైపర్ కూడా ఉంది. ఎంపీవీ 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది.
ఇందులో గ్లేసియర్ వైట్ పెర్ల్, ఫ్యూజన్ బ్లాక్ అనే 2 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కార్నివాల్ క్యాబిన్ పూర్తిగా లగ్జరీ క్యాబిన్ కలిగి ఉంది. డ్యూయల్-టోన్ నేవీ, మిస్టీ గ్రే లేఅవుట్ ఉంది. 4-వే లంబార్ సపోర్ట్, మెమరీ ఫంక్షన్‌తో 12-వే పవర్ డ్రైవర్ సీటు, 8-వే పవర్ ఫ్రంట్ ప్యాసింజర్ సీటు ఉన్నాయి. ఫ్రంట్ సీట్లు వెంటిలేషన్, హీటింగ్ ఫంక్షన్లను కలిగి ఉంటాయి. రెండో వరుసలో వెంటిలేషన్, హీటింగ్, లెగ్ సపోర్ట్‌తో కూడిన రిలాక్సేషన్ సీట్లు ఉన్నాయి.
ఇతర ముఖ్యమైన ఫీచర్లలో స్వతంత్రంగా నియంత్రించే 3-జోన్ ఫుల్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఇన్ఫోటైన్‌మెంట్/క్లైమేట్ కంట్రోల్ స్వాప్ స్విచ్, టచ్ స్మార్ట్ పవర్ స్లైడింగ్ డోర్, డ్యూయల్ పనోరమిక్ కర్వ్డ్ డిస్‌ప్లే (12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్), 12-స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ మూడ్ లైటింగ్, డ్యూయల్ సన్‌రూఫ్‌లు ఉన్నాయి.
సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. :
కార్నివాల్‌లో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, అన్ని వరుసలకు సీట్‌బెల్ట్ రిమైండర్, పార్కింగ్ దూర హెచ్చరిక (ఫ్రంట్ సైడ్, బ్యాక్), హైలైన్ టీపీఎమ్ఎస్ ట్రైలర్ స్టెబిలిటీ అసిస్ట్. లగ్జరీ మూవర్‌లో 23 అటానమస్ ఫీచర్‌లతో లెవెల్ 2 అడాస్ కూడా ఉంది.