Transfer WhatsApp Chats : గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ బ్యాకప్‌తో పనిలేదు.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే?
Transfer WhatsApp Chats : వాట్సాప్ కొత్త చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ యూజర్లు తమ పాత ఫోన్ నుంచి అదే OSలో రన్ అయ్యే కొత్త ఫోన్‌కు వాట్సాప్ చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Transfer WhatsApp Chats without backup
Transfer WhatsApp Chats : ప్రముఖ సోషల్ దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడూ ప్రవేశపెడుతోంది. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. వాట్సాప్ కూడా డేటా ట్రాన్స్‌ఫర్ టూల్‌గా మారింది. ఇందులోని చాట్‌లు, మీడియా ఫైల్‌లు వంటి మరిన్ని డేటాను కలిగి ఉంది. మీరు కొత్త ఫోన్‌కు మారాలనుకుంటే.. వాట్సాప్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ ఇటీవల QR-ఆధారిత చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను ప్రారంభించింది.
వినియోగదారులు తమ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు అదే ఆపరేటింగ్ సిస్టమ్‌తో వాట్సాప్ హిస్టరీని బదిలీ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ iOS నుంచి iOSకి లేదా ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అదనంగా, యూజర్లు iCloud లేదా Google డిస్క్‌లో క్లౌడ్ బ్యాకప్‌లపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఆండ్రాయిడ్, iOSలలో బ్యాకప్ లేకుండా వాట్సాప్ చాట్‌లను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్ చాట్‌లను పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే? :
* మీ పాత ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ బటన్‌ను నొక్కండి.
* Settings > Chats > Transfer Chats ఎంచుకోండి.
* Get Started బటన్ నొక్కండి. సమీప Wi-Fi లొకేషన్ పర్మిషన్ అంగీకరించండి.
* మీరు QR కోడ్ స్కానర్ స్క్రీన్ కనిపిస్తుంది.
Read Also :
మీ కొత్త ఫోన్‌లో..
* వాట్సాప్ ఓపెన్ చేసి.. Get Started బటన్‌ను నొక్కండి.
* Agree > Continue నొక్కండి. మీ ఫోన్ నంబర్‌ను ధృవీకరించండి.
* ప్రాంప్ట్ రాగానే మీ పాత ఫోన్ నుంచి ట్రాన్స్‌ఫర్ చాట్‌లను నొక్కండి.
* మీ పాత ఫోన్‌లో కనిపించే QR కోడ్‌ని స్కాన్ చేయండి.
* ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.
* ట్రాన్స్‌ఫర్ పూర్తయిన తర్వాత.. మీ కొత్త ఫోన్‌లో మీ అన్ని చాట్‌లను చూస్తారు.
* పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి వాట్సాప్ ట్రాన్స్‌ఫర్ చేసే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
* రెండు ఫోన్‌లు వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఉండేలా అప్‌డేట్ చేసుకోండి.
* రెండు ఫోన్‌లు తప్పనిసరిగా ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉండాలి.
* ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
* మీరు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‌లను (Android నుంచి iOS) రన్ అయ్యే డివైజ్‌ల మధ్య వాట్సాప్ చాట్‌లను ట్రాన్స్‌ఫర్ చేయలేరు.
వాట్సాప్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే కొత్త పద్ధతిలో వినియోగదారులు తమ చాట్‌ల బ్యాకప్‌ను ఉంచుకోవాలి. ఎందుకంటే.. తమ ఫోన్ పోయిన లేదా దొంగిలించిన సందర్భాల్లో సాయపడుతుంది. iOS నుంచి Androidకి WhatsAppని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్ చాట్ హిస్టరీని iPhone నుంచి Androidకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి :
* మీ ఆండ్రాయిడ్ డివైజ్ ఫ్యాక్టరీ రీసెట్ అయింది లేదా కొత్తదిగా సెటప్ అయిందని నిర్ధారించుకోండి.
* కొత్త డివైజ్ సెటప్ ద్వారా ప్రాంప్ట్ చేసినప్పుడు డేటాను రీస్టోర్ ఎంచుకోండి.
* మీ iPhoneని Unlock చేయండి.
* మీ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్ USB-Cతో లైటనింగ్ కేబుల్‌కు కనెక్ట్ చేయండి.
* మీ ఐఫోన్‌లో మీకు వార్నింగ్ కనిపిస్తే ‘Trust’ని నొక్కండి.
* మీ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో చేయాలి.
* మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో కనిపించే QR కోడ్‌ని స్కాన్ చేసేందుకు మీ ఐఫోన్ కెమెరాను ఉపయోగించండి.
* ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.
* మీ ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్ Disconnect చేయండి.
* మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి మీ ఐఫోన్‌లోని అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.
WhatsApp చాట్ హిస్టరీని Android నుంచి iPhoneకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే? :
* Android ఫోన్‌లో Move to iOS యాప్‌ని ఓపెన్ చేయండి.
* iPhoneలో కోడ్‌ను చూసే వరకు ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
* Android ఫోన్‌లో కోడ్‌ని ఎంటర్ చేయండి.
* ‘Continue’ నొక్కండి. ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
* ‘Transfer Data’ స్క్రీన్‌లో ‘WhatsApp’ని ఎంచుకోండి.
* Android ఫోన్‌లో ‘Get Started’ నొక్కండి. డేటా ఎగుమతి అయ్యే వరకు వేచి ఉండండి.
* Android ఫోన్‌లో ‘Next’ నొక్కండి.
* డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి మీ iPhoneలో ‘Continue’ నొక్కండి.
* ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.
* ఇప్పుడు మీ ఐఫోన్‌లోని యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* iPhoneలో WhatsAppని ఓపెన్ చేసి.. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉపయోగించిన అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.
* ప్రాంప్ట్ రాగానే ‘Start’ నొక్కండి. ప్రాసెస్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.
* iPhoneని యాక్టివేట్ చేయడం Complete చేయండి.
* iPhone ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు రీసెట్ చేసినట్టుగా నిర్ధారించుకోండి.
* రెండు ఫోన్‌లు గుడ్బ్యాటరీ లైఫ్ కలిగి ఉన్నాయని ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిందని నిర్ధారించుకోండి.
* అదనంగా, మీ OS, WhatsApp యాప్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ అయ్యేలా చూసుకోవాలి.
Read Also : Apple Free Earphones : ఆపిల్ పండుగ ఆఫర్.. కొత్త ఐఫోన్ కొంటే ఫ్రీగా ఇయర్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు!