Kia Discounts : మసాజింగ్ సీట్లు, కోల్డ్, హాట్ వాటర్.. పైగా లక్ష రూపాయలు డిస్కౌంట్.. ఈ కారు వావ్..

Kia Discounts : కియా కార్లపై బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. కొన్ని మోడళ్లపై మాత్రమే భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ నెలలో కారు కార్నివాల్ లగ్జరీ కారుపై రూ. లక్ష వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ 2026 మోడల్ ఇయర్‌పై అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి.

Kia Discounts

Kia Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కియా ఇండియా అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ మే నెలలో కంపెనీ కొన్ని మోడళ్లపై మాత్రమే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. కియా లగ్జరీ కారు కార్నివాల్‌పై కంపెనీ రూ. లక్ష వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

ఈ బెనిఫిట్స్ 2026 మోడల్ ఇయర్‌పై అందుబాటులో ఉంటాయి. మరోవైపు, 2025 మోడల్ ఇయర్‌పై కస్టమర్లు డీలర్ల నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ లగ్జరీ లిమోసిన్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.42 లక్షలుగా ఉంది.

అన్నింటినీ కలిపి చూస్తే.. ఎంపిక చేసిన వేరియంట్లపై మొత్తంగా రూ. 70వేల వరకు బెనిఫిట్స్ ఉండవచ్చు. కియా సైరోస్ కస్టమర్లు ఈ నెలలో రూ. 50వేల వరకు మొత్తం ఆదాను పొందవచ్చు. మే 2026లో డిస్కౌంట్ ప్యాకేజీలో రూ. 10వేలు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్, రూ. 20వేలు ఎక్స్ఛేంజ్ సపోర్ట్, అదనంగా రూ. 20వేలు స్క్రాపేజ్ ఇన్సెంటివ్ కూడా ఉన్నాయి. కొరియన్ ఆటో మేజర్ అత్యధికంగా అమ్ముడయ్యే వాహనాల్లో ఒకటి. కియా సెల్టోస్ మోడళ్లపై అర్హతను బట్టి లాయల్టీ, కార్పొరేట్ స్కీమ్స్ పొందవచ్చు.

ఈ కియా మోడళ్లపై రూ. లక్ష వరకు బెనిఫిట్స్ :
కియా ఇండియా మే 2026లో కొన్ని కీలక మోడళ్లపై కొత్త డిస్కౌంట్లు, బెనిఫిట్స్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్రమే వర్తిస్తాయి. డీలర్ ఇన్వెంటరీ, స్టాక్ లభ్యతను బట్టి ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ నెలలో భారీ బెనిఫిట్స్ కార్నివాల్ ప్రీమియం MPVపై అందుబాటులో ఉన్నాయి. కియా, MY2026 యూనిట్లపై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్ అందిస్తుంది.

Kia Discounts

వేరియంట్ ఎంపిక, డీలర్‌షిప్‌ల వద్ద ఉన్న స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్ల రేంజ్ మారవచ్చు. భారత మార్కెట్లో కియా ఫ్లాగ్‌షిప్ పీపుల్ మూవర్‌గా కార్నివాల్ దూసుకుపోతోంది. కొనుగోలుదారులు ఈ లగ్జరీ కారు కొనుగోలుపై రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30వేల వరకు లాయల్టీ బెనిఫిట్స్ పొందవచ్చు.

కార్నివాల్ హైలిమోసిన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
కార్నివాల్ హై లిమోసిన్‌లో కూడా లగ్జరీ ప్రయాణీకుల కోసం ఆకర్షణీయమైన ఇంటీరియర్ ఉంటుంది. వెల్‌ఫైర్ మాదిరిగానే ఈ కార్నివాల్‌లో రెండో వరుసలో రెండు వైడ్ ప్రీమియం కెప్టెన్ కుర్చీలు ఉంటాయి. ఇందులో ప్రతిదానికీ 3D క్విల్టెడ్ డిజైన్‌తో హై క్వాలిటీ నాప్పా లెదర్ సర్‌ఫేస్ ఉంటాయి. లిమోసిన్ సీట్ల మాదిరిగానే వైడ్ లెగ్ సపోర్ట్ ఉంటుంది.

Read Also : WhatsApp Chat Lock : వాట్సాప్‌లో మీ చాట్స్ ఈజీగా లాక్ చేయొచ్చు.. ఇక ఎవరూ చూడలేరు.. సింపుల్ ప్రాసెస్..!

ఈ సీట్లకు స్పెషల్ పిక్నిక్ టేబుల్స్, అనేక ఎలక్ట్రిక్ అడ్జెస్ట్ మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక టచ్‌స్క్రీన్ రిమోట్ డిస్‌ప్లే ద్వారా కంట్రోల్ అవుతాయి. ఈ డిస్‌ప్లే ఏసీ, క్యాబిన్ లైట్లు, కర్టెన్లను కూడా అడ్జెస్ట్ చేయొచ్చు. ఫ్రంట్ వరుసకు సరిగ్గా బ్యాక్, పైకప్పుపై అమర్చిన భారీ 21.5-అంగుళాల ఎల్ఈడీ టీవీకి రిమోట్‌గా కూడా పనిచేస్తుంది.

ఫుట్ మసాజర్, హీట్ కూలింగ్ హోల్డర్లు :
ఇందులో రెండు సీట్లకు ఆర్మ్‌రెస్ట్‌లు, కన్సోల్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీట్, కూలింగ్ అందించే కప్ హోల్డర్‌లు ఉన్నాయి. రెండవ వరుస ప్రయాణికులకు ఫుట్ మసాజర్ కూడా ఉంది. ప్రయాణికులకు కంపర్ట్ ఎక్స్ పీరియన్స్ అందించే హెల్త్‌కేర్ కంపెనీ హు-టెక్‌తో కలిసి ఈ ఫుట్ మసాజర్‌ను ప్రత్యేకంగా డెవలప్ చేసినట్టు కియా చెబుతోంది.

ఈ లగ్జరీ ఎంపీవీలో స్పెషల్ షూ స్టోరేజ్ ఉంది. ఇద్దరు ప్రయాణీకుల కోసం హీట్ లేదా కూలింగ్ వాటర్ కోసం వేర్వేరు కప్ హోల్డర్‌లతో హీటెడ్ లేదా కూల్డ్ క్యాబినెట్ కూడా ఉంది. రూఫ్‌పై అమర్చిన హ్యాంగర్, అండర్‌ఫ్లోర్ స్టోరేజ్ బాక్స్‌తో కార్గో హోల్డ్‌లో స్పేస్ ఆప్టిమైజ్ చేసింది. ఔట్ సైడ్ కార్నివాల్ హై లిమౌసిన్‌లో అదనపు క్రోమ్ ట్రిమ్, డిఫరెంట్ అల్లాయ్ వీల్ డిజైన్ ఉన్నాయి.

కార్నివాల్ హై లిమౌసిన్ ఇంజిన్ :
ఈ 4-సీటర్ కార్నివాల్ హై లిమౌసిన్ 290hp, 355Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 3.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ V6 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉంది. అంతేకాదు.. స్టాండర్డ్ కార్నివాల్‌తో పోలిస్తే.. అద్భుతమైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది. ప్రత్యేకించి కియా హై లిమౌసిన్ వేరియంట్ కోసం సస్పెన్షన్‌ను రీట్యూన్ చేసింది.