DLF's KP Singh Love
DLF’s KP Singh Love : రియల్ ఎస్టేట్ గ్రూప్ డీఎల్‌ఎఫ్ ఎమెరిటస్ చైర్మన్ కుశాల్ పాల్ సింగ్ 91 ఏళ్ల వయస్సులో ప్రేమలో పడ్డారు. నేను లవ్ లో పడ్డానంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో కేపీ సింగ్ (KP Singh) గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అనే విషయంపై గూగుల్ లో వెతికేశారు జనాలు. 2018లో కేన్సర్‌తో తన భార్య చనిపోయిన తరువాత ఒకటి రెండేళ్లు ఒంటరితనంతో బాధపడ్డానని కానీ ఆ తరువాత ఓ గొప్ప వ్యక్తిని కలుసుకోవడం అదృష్టమంటూ తన కొత్త ప్రేమను పరిచయం చేయడం బిజినెస్ వర్గాల్లో విశేషంగా నిలిచింది.
65 ఏళ్ల తరువాత భార్య ఇందిర క్యాన్సర్‌తో చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఒంటరి తనం కుదిపేసిందని చెప్పుకొచ్చిన కేపీ సింగ్ షీనాతో కలిసి జీవిస్తున్నాను అంటూ వెల్లడించారు. భార్యమరణంతో మానసికంగా తీవ్రంగా కృంగిపోయిన సింగ్ మరోసారి ప్రేమలో పడటంతో తిరిగి ఆనందమైన జీవితం దక్కిందంటూ చెప్పుకొచ్చారు. తన భార్య ఇందిరతో అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడిపానని..ఆమె భార్య మాత్రమే కాదు..మంచి, స్నేహితురాలు కూడానంటూ తన మొదటిభార్య ఇందిర గురించి గొప్పగా చెప్పారు. ఆమెను రక్షించుకోవటానికి చాలా తాపత్రాయపడ్డాను. కానీ రక్షించు కోలేకపోయనని..కానీ ఆమెలాంటి గొప్ప వ్యక్తిని దూరం చేసుకోవటం ఎంతో విషాదకరమని వాపోయారు. ఆమె జ్ఞాపకాల్లోంచి బయపటడలేకపోయానని అలా రెండేళ్లపాటు డిప్రెషన్ కు గురి అయ్యాయని చెప్పుకొచ్చారు. ఆమె ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆమె చనిపోవడానికి ఆరు నెలల ముందు, జీవితాన్ని వదులు కోవద్దని కోరిందనీ, తన జీవితం ఎలాగూ తిరిగి రాదు.. కానీ మీ జీవితం ఇంకా చాలా ఉంది.. దాన్ని వదులుకోవద్దంటూ తనతో వాగ్దానం చేయించు కుందని గుర్తు చేసుకున్నారు.
ఆ తరువాత క్రమంగా కోలుకున్న సింగ్ తన బిజినెస్ వ్యవహారాల్లో బిజి బిజీగా మారిపోయారు. అలా క్రమంలో భార్య ఇందిర జ్ఞాపకాల్లోంచి బయటపడ్డారు.65 ఏళ్ల్ వయస్సులో భార్యను కోల్పోవటం నిజంగా శిక్షేనని అని వ్యాఖ్యానించిన సింగ్ ఆమెను కోల్పోయాక నా ఉత్సాహమంతా పోయిందని కానీ ఆ తరువాత పరిచయం అయిన షీనా వల్ల నా జీవితమే మారిపోయిందని నేను ఎప్పుడు డల్ గా ఉన్నా షీనా నన్ను చాలా ఉత్సాహరపరిచేదని తెలిపారు.
నా భార్య మాటలు నన్ను ఎంతగా ఉత్తేజపరిచేవో అలా షీనా మాటలు కూడా నన్ను ఎంతగానో ఉత్తేజపరుస్తున్నాయని నిజానికి ఈ విషయంలో తాను అదృష్టంతుడినని, ప్రస్తుతం షీనాతో కలిసి జీవిస్తున్నానని వెల్లడించారు. షీనా చాలా ఎనర్జిటిక్. అందుకే తానెఫ్పుడైనా డల్‌గా ఉన్నా యాక్టివ్‌గా మార్చేస్తుంది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్నేహితులు ఉన్నారని ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె చాలా ప్రేరణ నిస్తుంది. తన జీవితంలో ముఖ్య భాగమైన షీనా అండతో తానిపుడు చలాకీగా పనిలో నిమగ్నమయ్యానని చెప్పడం విశేషం. దీంతో పాటు కెరియర్ ప్రారంభలో తన అనుభవాలను కూడా సింగ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో షీనా ఒకరు అంటూ తెలిపారు. షీనా ప్రేమ నాకు లభించటం, ఆమెతో జీవించటం నా అదృష్టం అని తెలిపారు సింగ్. ఇందిర కోరుకున్నట్లుగానే నేను ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు కేపీసింగ్.
కాగా ఫోర్బ్స్ ప్రకారం సింగ్ నికర విలువ రూ.66వేల కోట్లు. 1946లో తన మామగారు ప్రారంభించిన డీఎల్‌ఎఫ్ అనే కంపెనీలో చేరడానికి ముందు సింగ్ 1961లో ఆర్మిలో పనిచేశారు. ఆ తరువాత రైతుల నుండి భూమిని సేకరించి..రియల్ ఎస్టేట్ లో దిగ్గజ కంపెనీగా మారారు. ఢిల్లీ నగర శివార్లలో తన షోపీస్ టౌన్‌షిప్ గుర్గావ్‌లో డీఎల్‌ఎఫ్ సిటీని నిర్మించారు. 50 ఏళ్లకు పైగా ఆ పదవిలో ఉన్న సింగ్ జూన్ 2020లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడా బాధ్యతలను ఆయన కుమారుడు రాజీవ్ తీసుకున్నారు. రాజీవ్ డీఎల్ఎఫ్ చైర్మన్‌గా ఉన్నారు.