PAN Aadhaar Link
PAN Aadhaar Link : మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా? ఇంకా చేయకపోతే ఇప్పుడే చేసుకోవడం బెటర్.. డిసెంబర్ 31 వరకు మాత్రమే ఛాన్స్ ఉంది.. ఆ తర్వాత మీ పాన్ కార్డు ఆధార్ లింక్ కాకుంటే పాన్ చెల్లదు. మీరు భారతీయ పౌరులైతే ఇది మీకోసమే.. పాన్ కార్డ్ హోల్డర్లకు ఆధార్ పాన్ లింక్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. ఇదే విషయంలో ఆదాయపు పన్ను శాఖ కూడా రిమైండర్ జారీ చేసింది.
పాన్ ఆధార్ లింక్ చేయకపోవడం వల్ల అనేక మంది పన్ను చెల్లింపుదారులు ఆర్థిక పరమైన ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. గడువు దాటిన పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అవుతుంది.
ఆదాయ రిటర్న్‌లను దాఖలు నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని యాక్సస్ కోల్పోతారు. మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే ఇంకా ఏయే ప్రయోజనాలను కోల్పోతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పాన్-ఆధార్ లింక్ ఎందుకంటే? :
పాన్ ఆధార్ లింక్ తప్పనిసరి. కానీ, కొద్దిమంది పన్ను చెల్లింపుదారులు ఇంకా ఈ ప్రాసెస్ పూర్తి చేయలేదు. లేటెస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం.. ఆధార్ లింక్ చేయడంలో విఫలమైన పాన్ హోల్డర్లు ముందు రూ. 1,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఇందులో మినహాయింపు కూడా ఉంది. అక్టోబర్ 1, 2024 తర్వాత పాన్ అందుకున్న ఆధార్ ఎన్‌రోల్ ఐడీని ఉపయోగించిన వ్యక్తులు డిసెంబర్ 31, 2025 వరకు లింకింగ్ ప్రక్రియను ఫ్రీగా పూర్తి చేయవచ్చు.
పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి? :
ఈ పాన్ ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారులు (incometax.gov.in)లోని అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను విజిట్ చేయాలి. క్విక్ లింక్స్ కింద “Link Aadhaar” ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆపై పాన్, ఆధార్ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత వినియోగదారులు వారి స్టేటస్ వెరిఫై చేసుకోవచ్చు. పెనాల్టీ ఇప్పటికే NSDL పోర్టల్ ద్వారా పేమెంట్ చేసి ఉంటే సిస్టమ్ పేమెంట్ ఆటోమాటిక్‌గా వెరిఫై చేస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTP వెరిఫికేషన్ పూర్తి చేస్తుంది. అప్‌డేట్ సాధారణంగా 4 నుంచి 5 వర్కింగ్ డేలో కనిపిస్తుంది.
గడువు దాటితే ఏమౌతుంది? :
డిసెంబర్ 31, 2025 నాటికి మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే ఇకపై మీ పాన్ చెల్లదు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు, కేవైసీ వెరిఫికేషన్, ఇతర ఆర్థిక సేవలను పొందలేరు.